Home
Gadgets

తొలిసారిగా eSIM సపోర్టుతో వన్‌ప్లస్ వాచ్‌ విడుదల.. ధర, ఫీచర్‌లు, సేల్‌ పూర్తి వివరాలు..!

వన్‌ప్లస్‌ వాచ్‌ 2 ను (OnePlus Watch 2) లాంచ్ చేసింది. ఈ వాచ్‌ అల్యూమినియం కేస్‌ సహా eSIM సపోర్టుతో విడుదల అయింది. eSIM సపోర్టుతో అందుబాటులోకి వచ్చిన తొలి వన్‌ ప్లస్‌ వాచ్‌గా గుర్తింపు పొందింది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు, IP68 రేటింగ్‌, అమోలెడ్‌ డిస్‌ప్లే ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ వాచ్‌ మెటోరైట్‌ బ్లాక్, నెబ్యులా గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఈ వాచ్‌ ధర, సేల్‌ పూర్తి వివరాలు..

వన్‌ప్లస్‌ వాచ్‌ 2 స్పెసిఫికేషన్‌ లు :
వన్‌ప్లస్‌ వాచ్‌ 2... వృత్తాకర డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 466*466 పిక్సల్‌ రిజల్యూషన్‌ తో 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. దీంతోపాటు 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ తో అందుబాటులోకి వచ్చింది. అల్యూమినియం కేస్‌ను కలిగి ఉంది.

Oneplus watch 2 smartphone launched

వన్‌ప్లస్‌ వాచ్ 2 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ W5 చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుంది. 2GB ర్యామ్‌ మరియు 32GB అంతర్గత స్టోరేజీపై పనిచేస్తుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ వాచ్‌ తొలిసారిగా eSIM సపోర్టును కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ మరియు iOS లపైన పనిచేస్తుంది. దీంతోపాటు ఈ వాచ్‌ Color OS మరియు NFC సపోర్టుతో పనిచేస్తుంది.

ఈ వాచ్‌ హెల్త్‌ ట్రాకర్లతోపాటు 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్‌ మోడ్స్‌ ను కలిగి ఉంది. ఇందులో వర్కౌట్‌ డిటెక్షన్ సంబంధించినవి కూడా ఉన్నాయి. వాటిలో హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, SpO2 మానిటర్‌ తో సహా మరిన్ని ఫీచర్‌ లను గుర్తించవచ్చు. ఈ వాచ్‌ IP68 రేటింగ్‌ తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా లాంచ్ అయింది.

ఈ వన్‌ప్లస్‌ వాచ్‌ 2.. 500mAh బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్ ద్వారా 4 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. ఈ వాచ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులో ఉంది. కేవలం 60 నిమిషాల్లో ఈ వన్‌ ప్లస్‌ వాచ్‌ 2 ను 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు.

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ వాచ్‌ చైనాలో మాత్రమే లాంచ్ అయింది. భారత్‌లో విడుదలపై ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. చైనాలో 1799 యువాన్‌ (భారత కరెన్సీలో రూ.20,650) లుగా ఉంది. జులై 3 నుంచి చైనాలో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. అయితే భారత్‌లో ఈ స్మా్ర్ట్‌వాచ్‌ ఎప్పుడు లాంచ్ కానుందనే వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Oneplus watch 2 smartphone launched with eSIM and 500mAh Battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X