Home
Gadgets

OnePlus Summer Launch Event వన్‌ప్లస్‌ వాచ్‌ 2R, నార్డ్‌ బడ్స్ 3 ప్రో విడుదల..ఫీచర్లు, ధర, సేల్‌ వివరాలు..!

వన్‌ప్లస్ సమ్మర్‌ లాంచ్ ఈవెంట్‌లో (OnePlus Summer Launch Event) వన్‌ప్లస్‌ నార్డ్ 4, వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 2 సహా వాచ్‌ 2R, నార్డ్ బడ్స్‌ 3 ప్రో విడుదల అయ్యాయి. వన్‌ప్లస్ వాచ్‌ 2R (Oneplus Watch 2R) వృత్తాకార డయల్‌ను కలిగి ఉంటుంది. మరియు సింగిల్‌ ఛార్జింగ్‌తో 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందుతుంది. మరియు వన్‌ప్లస్‌ బడ్స్‌ 3 ప్రో (OnePlus Buds 3 Pro) సింగిల్ ఛార్జింగ్‌తో 44 గంటల ప్లేబ్యాక్‌ సమయాన్ని పొందుతుంది.

వన్‌ప్లస్‌ వాచ్‌ 2R స్మార్ట్‌వాచ్‌ 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను డిస్‌ప్లేను కలిగి ఉంది. 466*466 రిజల్యూషన్‌ సహా 66Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ W5 మరియు BES2700 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. WearOS 4 ను కలిగి ఉంటుంది. 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ వాచ్‌ అల్యూమినియం ఛాసిస్‌తో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బకెల్స్‌, సిలికాన్ స్ట్రాప్స్‌ను కలిగి ఉంది.

oneplus-watch-2r

వన్‌ప్లస్‌ వాచ్‌ 2R డ్యూయల్‌ బ్యాండ్‌ GPS, వైఫై, బ్లూటూత్‌ కనెక్టివిటీ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు హార్ట్‌ రేట్‌, SpO2, స్లీప్‌ ట్రాకర్, ఒత్తిడి స్థితిని పర్యవేక్షిస్తుంది. OHealth app ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. ఈ వాచ్‌ 2R 5ATM వాటర్‌ రెసిస్టెంట్ మరియు IP68 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

ఈ వన్‌ప్లస్ వాచ్‌ 2R స్మార్ట్‌వాచ్‌ 7.5W Vooc ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 60 నిమిషాల్లో ఈ వాచ్‌ను 0-100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. ‌స్మార్ట్‌మోడ్‌లో 10 నిమిషాల ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో రోజంతా బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. స్మార్ట్‌మోడ్‌లో 100 గంటల బ్యాటలీ లైఫ్‌, పవర్ సేవింగ్‌ మోడ్‌లో 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు.

oneplus-watch-2r

వన్‌ప్లస్‌ వాచ్ 2R ధర, సేల్‌ వివరాలు ;
వన్‌ప్లస్ వాచ్ 2R ధర రూ.17999 గా ఉంది. జులై 20 నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఫారెస్ట్‌ గ్రీన్‌, గన్‌మెటల్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది. ICICI, వన్‌కార్డ్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. అమెజాన్‌, వన్‌ప్లస్ వెబ్‌సైట్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 3 ప్రో స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 3 ప్రో 12.4mm డ్రైవర్‌, బాస్‌వేవ్‌ 2.0 ను కలిగి ఉంటుంది. ఈ బడ్స్‌ 49dB హైబ్రిడ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌తో అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు ఈ బడ్స్‌ స్మార్ట్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. ఈ బడ్స్‌ 2 అనలాగ్‌, డిజిటల్‌తో కూడిన ట్రిపుల్‌ స్టీరియో మైక్రోఫోన్‌ వ్యవస్థను కలిగి ఉన్నాయి.

oneplus-watch-2r

44 గంటల బ్యాటరీ లైఫ్‌ :
ఈ నార్డ్‌ బడ్స్‌ 3 ప్రో... సింగిల్‌ ఛార్జింగ్ ద్వారా 44 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందుతుంది. అదే 10 నిమిషాల 11 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్‌ వస్తుందని సంస్థ చెబుతోంది. IP55 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చాయి.

ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 3 ప్రో ఇయర్‌బడ్స్‌ ధర రూ.3299 గా ఉంది. జులై 20న సేల్‌ ప్రారంభం కానుంది. స్టారీ బ్లాక్‌, సాఫ్ట్‌ జడే రంగుల్లో లభిస్తుంది. అమెజాన్ సహా వన్‌ప్లస్ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు మరియు వన్‌కార్డు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.300 తగ్గింపును పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Watch 2R and buds 3 Pro launched in india features price sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X