OnePlus వాచ్ 3 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ బ్రాండెడ్ వాచ్‌ల కంటే దుమ్మురేపే బ్యాటరీ లైఫ్!
OnePlus Watch 3: ఫిబ్రవరి 18న వన్‌ప్లస్ కంపెనీ కొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి దించుతోంది. దీని పేరు వన్‌ప్లస్ వాచ్ 3. వేర్ ఓఎస్ (Wear OS) యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అదిరిపోయే ఫీచర్లతో ఈ వాచ్ రాబోతోంది. ముఖ్యంగా దీని బ్యాటరీ లైఫ్ ఏకంగా 120 గంటలు అంటే దాదాపు 5 రోజుల పాటు వస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా లాంటి టాప్ స్మార్ట్‌వాచ్‌ల బ్యాటరీ లైఫ్‌ను కూడా ఇది దాటేస్తుంది.
వన్‌ప్లస్ వాచ్ 3లో బ్యాటరీ లైఫ్ పెంచడానికి డ్యూయల్-చిప్‌సెట్ సిస్టమ్‌ను వాడారు. ఇందులో వేర్ ఓఎస్ 5 కోసం స్నాప్‌డ్రాగన్ W5 చిప్ ఉంటుంది. అలాగే, సెకండరీ రియల్-టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ (RTOS) కోసం BES2800 MCU చిప్ కూడా ఉంది. ఈ వాచ్ ఆటోమేటిక్‌గా ఈ రెండు సిస్టమ్‌ల మధ్య మారుతూ ఉంటుంది.

* పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ రెండూ బ్యాలెన్స్..
దీనివల్ల పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ కూడా ఎక్కువసేపు వస్తుంది. వన్‌ప్లస్ యూరప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సెలినా షి టెక్‌రేడార్‌తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. \"మా సాఫ్ట్‌వేర్ ఈ రెండు చిప్‌ల మధ్య చాలా స్మూత్‌గా మారుతుంది. దీనివల్ల పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ రెండూ బ్యాలెన్స్ అవుతాయి\" అని ఆమె అన్నారు.
* పెరిగిన బ్యాటరీ సైజు..
వన్‌ప్లస్ వాచ్ 3 బ్యాటరీ సైజును కూడా పెంచారు. ఇది ఇప్పుడు 631mAh బ్యాటరీతో వస్తోంది. వన్‌ప్లస్ సిలికాన్ నానోస్టాక్ బ్యాటరీ టెక్నాలజీని ఇందులో వాడారు. ఇదే టెక్నాలజీని వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌లో కూడా వాడబోతున్నారు. దీనివల్ల ఎనర్జీ స్టోరేజ్, యూసేజ్ రెండూ మెరుగుపడతాయి.
రాత్రంతా నిద్రను ట్రాక్ చేసేవాళ్లకు ఈ ఎక్కువ బ్యాటరీ లైఫ్ బాగా ఉపయోగపడుతుంది. స్లీప్ ట్రాకింగ్ ఫీచర్స్‌ను కూడా ఇంప్రూవ్ చేసినట్లు సెలినా షి చెప్పారు. \"స్లీప్ ట్రాకింగ్ కచ్చితత్వాన్ని మేము పెంచుతున్నాం. యూజర్లు వాళ్ల నిద్ర క్వాలిటీ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకోవచ్చు\" అని ఆమె వెల్లడించారు.
* యాపిల్ వాచ్‌లా రొటేటింగ్ డిజిటల్ క్రౌన్, అదిరిపోయే డిజైన్..
వన్‌ప్లస్ వాచ్ 3లో యాపిల్ వాచ్‌లో ఉండేలా తిరిగే డిజిటల్ క్రౌన్ ఉంటుంది. దీన్ని తిప్పుతూ మెనూల్లో ఈజీగా స్క్రోల్ చేసుకోవచ్చు, ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. \"వన్‌ప్లస్ వాచ్ 2 డిజైన్‌ను మా యూజర్లు బాగా ఇష్టపడ్డారు. కానీ తిరిగే క్రౌన్ ఉంటే బాగుంటుందని చాలామంది అడిగారు. అందుకే ఈసారి దాన్ని యాడ్ చేశాం.\" అని సెలినా షి వివరించారు.
రొటేటింగ్ క్రౌన్ కారణంగా వాచ్‌ను వాడటం ఈజీగా ఉంటుంది. ఈ కొత్త వాచ్ మరింత స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీనిలో స్టెయిన్‌లెస్ స్టీల్ బెజెల్‌కు బదులు టైటానియం బెజెల్‌ను వాడారు. స్క్రీన్‌కు శాఫైర్ క్రిస్టల్ డిస్‌ప్లే ఉండటంతో వాచ్ మన్నికగా ఉంటుంది. వన్‌ప్లస్ వాచ్ 3 అబ్సిడియన్ టైటానియం, ఎమరాల్డ్ టైటానియం వంటి రెండు కలర్లలో వస్తుంది.
* ఫిట్‌నెస్‌కు పర్‌ఫెక్ట్..
వన్‌ప్లస్ వాచ్ 3 ఫిట్‌నెస్ ఫీచర్ల గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ చెప్పలేదు. కానీ సెలినా షి మాత్రం \"వన్‌ప్లస్ వాచ్ 3 ఫిట్‌నెస్, స్లీప్ ట్రాకింగ్ రెండింటికీ సూపర్బ్‌గా పనిచేస్తుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది, బ్యాటరీ లైఫ్ కూడా ఊహించిన దానికంటే ఎక్కువే వస్తుంది\" అని చెప్పారు.
ఈ వాచ్ డిజైన్ చూస్తుంటేనే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని అర్థమవుతోంది. యాపిల్ వాచ్ అల్ట్రా, గెలాక్సీ వాచ్ అల్ట్రా లాంటి హై-ఎండ్ స్పోర్ట్స్ వాచ్‌లలాగే ఇది కూడా చాలా రగ్గెడ్‌గా ఉంటుందని అంటున్నారు. ఇది విడుదల అయ్యాక చాలా మందికి ఫేవరెట్ స్మార్ట్ వాచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
* ఎప్పుడు లాంచ్..
వన్‌ప్లస్ వాచ్ 3 ఫస్ట్ నార్త్ అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో రిలీజ్ చేస్తారు. దీని ధరెంతో ఇంకా తెలియరాలేదు. కంపెనీ తన వెబ్‌సైట్‌లో నిన్న అప్‌డేట్‌లో వన్‌ప్లస్ వాచ్ 3 ఐదు రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుందని, ఫిబ్రవరి 18న లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ చేసింది. మిగతా డీటెయిల్స్ అఫీషియల్ లాంచ్ ఈవెంట్‌లో తెలుస్తాయి.


Click it and Unblock the Notifications








