Home
Gadgets

డిజిటల్‌ పేమెంట్స్‌ ఫీచర్‌, హెల్త్‌ ట్రాకర్‌లతో వన్‌ప్లస్‌ వాచ్‌ 3 విడుదల.. ఫీచర్‌లు, ధర వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ నుంచి తాజాగా స్మార్ట్‌వాచ్‌ గ్లోబల్ మార్కెట్‌లోకి లాంచ్‌ అయింది. వన్‌ప్లస్‌ వాచ్‌ 3 పేరులో (OnePlus Watch 3 Smartwatch) విడుదల అయింది. ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ టైటానియం బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు క్విక్‌ హెల్త్‌ చెక్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. అయితే డిజైన్ పరంగా ఈ వాచ్‌ ఆకట్టుకుంటుంది.

వన్‌ప్లస్‌ వాచ్‌ 3 స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ వాచ్‌ 3 స్మార్ట్‌వాచ్‌ 2200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 1.5 అంగుళాల (460*460 పిక్సల్స్‌) LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్‌ 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్‌ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది.

OnePlus Watch 3 Smartwatch telugu news

ఈ వాచ్‌ మెరుగైన భద్రత కోసం టైటానియం బెజెల్స్‌ సహా క్రిస్టల్‌ గ్లాస్‌ కవర్‌ను కలిగి ఉంది. మరియు MIL - STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ Always On Display ను కలిగి ఉంది.

ఈ వాచ్‌ 3 మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ WS ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు BES2800BP MCU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 32GB స్టోరేజీతో అందుబాటులో ఉంది. ఈ వాచ్‌ గూగుల్‌ Wear OS 5 తో పనిచేస్తుంది. మరియు రియల్‌టైం ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

OnePlus Watch 3 Smartwatch telugu news

ఈ స్మార్ట్‌వాచ్ ఇతర ఫీచర్‌లతోపాటు మెరుగైన హెల్త్‌, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. ఆప్టికల్‌ హార్ట్‌ రేట్‌ సెన్సార్, ఆప్టికల్‌ పల్స్‌ సెన్సార్‌, టెంపరేచర్‌ సెన్సార్‌లను అమర్చారు. వీటి ద్వారా స్లీప్‌, బ్లడ్‌ ఆక్సీజన్‌ (SpO2), శరీరం, మెదడును పర్యవేక్షిస్తుంది.

దీంతోపాటు మణికట్టు వద్ద ఉష్ణోగ్రత చూడడం (Wrist Temperature) సహా అనేక హెల్త్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. హెల్త్‌, ఫిట్‌నెస్ ట్రాకర్‌ల సమాచారాన్ని OHealth app ద్వారా తెలుసుకోవచ్చు. కేవలం 60 సెకన్లలో ప్రాథమిక స్థాయిలో ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకోవచ్చని సంస్థ చెబుతోంది.

కనెక్టివిటీ పరంగా ఈ వన్‌ప్లస్‌ వాచ్ 3 డ్యూయల్‌ బ్యాండ్ వైఫై, బ్లూటూత్‌ 5.2, NFC వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు బ్లూటూత్‌ కాలింగ్ సపోర్టు చేస్తుంది. దీంతోపాటు డ్యూయల్‌ బ్యాండ్‌ L1+L5, GPS, Galileo, Glonass, Beidou, QZSS వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

ఆసక్తికరంగా ఈ వాచ్‌ ద్వారా డిజిటల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చని వన్‌ప్లస్‌ చెబుతోంది. గూగుల్‌ వాలెట్ ద్వారా వాచ్‌ నుంచే పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉందని తెలిపింది. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. దీంతోపాటు 5 ATM వాటర్‌ రిసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

వన్‌ప్లస్ వాచ్ 3 ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి పవర్ సేవర్‌ మోడ్‌లో 16 రోజులపాటు వినియోగించుకోవచ్చు. అదే స్మార్ట్‌ మోడ్‌లో 5 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుందని వన్‌ప్లస్‌ తెలిపింది. ప్రస్తుతం వన్‌ప్లస్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌ ఎమరార్డ్‌ టైటానియం, ఒబ్సిడియన్ టైటానియం రంగుల్లో లభిస్తుంది.

వన్‌ప్లస్‌ వాచ్‌ 3 ధర, సేల్‌ పూర్తి వివరాలు :
వన్‌ప్లస్‌ వాచ్‌ 3 ధర అమెరికాలో $329 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.29000) గా ఉంది. అమెరికాలో ఈ వాచ్‌ ప్రస్తుతం ప్రీ బుకింగ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉంది. మరియు ఫిబ్రవరి 25 నుంచి అక్కడ సేల్‌ ప్రారంభం కానుంది. అయితే కూపన్ డిస్కౌంట్ ద్వారా $30 (భారత కరెన్సీలో సుమారు రూ.2600) తగ్గింపును పొందవచ్చు.

భారత్‌ మార్కెట్‌లో ఈ వాచ్‌ ఎప్పుడు లాంచ్‌ కానుందనే సమాచారాన్ని వన్‌ప్లస్‌ వెల్లడించలేదు. అయితే మరికొన్ని నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే ధరలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. త్వరలో ఫీచర్లు, ధర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Watch 3 Smartwatch launched with digital payment features and health trackers globally
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X