Home
Gadgets

10 రోజుల బ్యాటరీ లైఫ్‌ తో వన్‌ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్లు, ధర, సేల్‌ వివరాలు..!

OnePlus Watch Lite : భారత్ మార్కెట్‌లో డిసెంబర్‌ 17 వ తేదీన వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్‌, వన్‌ప్లస్‌ ప్యాడ్ గో 2 ట్యాబ్లెట్‌ లాంచ్‌ అయ్యాయి. ట్యాబ్లెట్ సేల్‌ ఇవాళ్టి నుంచే ప్రారంభం అయింది. అదే ఫోన్‌ను ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే తాజాగా గ్లోబల్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ వాచ్‌ లైట్‌ మోడల్‌ విడుదల అయింది. వన్‌ప్లస్ వాచ్ సిరీస్‌లో భాగంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది.

వన్‌ప్లస్‌ వాచ్‌ లైట్ అనేక హెల్త్‌, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. ఆండ్రాయిడ్, iOS స్మార్ట్‌ఫోన్‌లను సపోర్టు చేస్తుంది. ఈ వాచ్‌ OxygenOS వాచ్‌ 7.1 పైన పనిచేస్తుంది. బ్లూటూత్‌ కాలింగ్‌, స్పోర్ట్స్‌ ట్రాకింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి గరిష్ఠంగా 10 రోజుల వరకు వినియోగించుకోవచ్చు.

oneplus watch lite launched with 10 days battery life  OxygenOS  full details

వన్‌ప్లస్ వాచ్ లైట్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఈ వాచ్ వృత్తాకార వృత్తాకార డిజైన్‌తో విడుదల అయింది. 1.46 అంగుళాల (464 x 464 పిక్సల్స్‌) అమోలెడ్‌ 2.5D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫ్రేమ్‌, రెయిన్‌ఫోర్డ్స్‌ గ్లాస్‌ ఫైబర్‌తో కూడిన ప్లాస్టిక్‌ బ్యాక్‌ ప్యానల్‌ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌వాచ్‌ ఫ్లోరోరబ్బర్‌ స్ట్రాప్స్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బకెల్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్‌ 5 ATM, IP68 డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. బ్లూటూత్‌ 5.2, NFC, డ్యూయల్‌ బ్యాండ్‌ GPS, బ్లూటూత్ కాలింగ్‌ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

చిప్‌సెట్‌, OS :
వన్‌ప్లస్‌ వాచ్‌ లైట్‌ స్మార్ట్‌వాచ్‌ BES2800BP చిప్‌, OxygenOS వాచ్‌ 7.1 పైన పనిచేస్తుంది. 4GB eMMC స్టోరేజీని సపోర్టు చేస్తుంది. అయితే Wear OS తరహాలో ఈ వాచ్‌ థర్డ్‌ పార్టీ యాప్స్‌, కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌ను సపోర్టు చేయదు.

హెల్త్‌ ఫీచర్లు :
ఈ వాచ్‌ హెల్త్‌, ఫిట్‌నెస్‌ పై అధికంగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా హార్ట్‌ రేట్‌, SpO2, నాడీ ఉష్ణోగ్రత, ఒత్తిడి, నిద్ర నాణ్యతను పర్యవేక్షించే ట్రాకర్‌లు ఉన్నాయి. ఫాస్ట్‌ డిటెక్షన్‌, బ్రీజింగ్‌. వన్‌ప్లస్‌ 60 సెకండ్స్‌ వెల్‌నెస్‌ చెక్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి.

ఈ వాచ్‌ 339mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి గరిష్ఠంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. అయితే Always on Display ఫీచర్‌ను ఉపయోగిస్తే బ్యాటరీ లైఫ్‌ 4 రోజులు ఉంటుందని చెబుతోంది. ఈ వాచ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ వాచ్‌ రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ సహా అనేక స్పోర్ట్స్‌ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది.

వన్‌ప్లస్‌ వాచ్‌ లైట్‌ ధర, సేల్‌ వివరాలు :
ప్రస్తుతానికి ఈ వాచ్‌ UK, యూరోపియన్‌ మార్కెట్స్‌లో అందుబాటులో ఉంది. యూరోపియన్‌ మార్కెట్‌లో ప్రారంభ ధర EUR 179 (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.19000) గా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్‌లో భాగంగా EUR 159 (భారత కరెన్సీ ప్రకారం రూ.16,800) కే కొనుగోలు చేయవచ్చు.

అయితే ఈ వాచ్‌ భారత్‌, అమెరికా సహా ఇతర గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులోకి వస్తుందా లేదా అనేదానిపై ఇప్పటి వరకు వన్‌ప్లస్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
oneplus watch lite launched with 10 days battery life, OxygenOS, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X