రూ.1299 కే 10000mAh పవర్ బ్యాంకు, Fastcharging ఫీచర్ తో!
Oppo సంస్థ నుండి కొత్త పవర్ బ్యాంకు 'ఒప్పో పవర్ బ్యాంక్ 2 ' భారతదేశంలో విడుదల అయింది.దీనితో ఒప్పో సంస్థ నుండి మార్కెట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల పోర్ట్‌ఫోలియో మరికొంత విస్తరించింది.ఈ కొత్త పవర్ బ్యాంక్ 10,000mAh తో పెద్ద బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

'ఒప్పో పవర్ బ్యాంక్ 2 ' 12-కారకాల భద్రతా హామీని కలిగి ఉంది, ఇది పరికరాన్ని ఓవర్ వోల్టేజ్, ఓవర్ కరెంట్, షార్ట్-సర్క్యూట్ మరియు ఇతర సంఘటనల నుండి రక్షిస్తుంది. ఇది స్మార్ట్ వాచ్ లేదా టిడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ వంటి పరికరాలను ఛార్జ్ చేయడానికి ఉపయోగపడే విధంగా తక్కువ కరెంటు మోడ్ లో కూడా వస్తుంది.

భారతదేశంలో ఒప్పో పవర్ బ్యాంక్ 2 ధర, లభ్యత మరియు ఆఫర్లు
ఒప్పో పవర్ బ్యాంక్ 2 భారతదేశంలో ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారా బ్లాక్ అండ్ వైట్ అనే రెండు రంగు ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.దీని ధర రూ.1,299 గా ఉంది.
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లలో భాగంగా ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో ఐదు శాతం ఆఫర్ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో నో-కాస్ట్ ఇఎంఐలను కూడా పొందవచ్చు.

ఒప్పో పవర్ బ్యాంక్ 2 ఫీచర్లు
ఒప్పో పవర్ బ్యాంక్ 2 స్లిమ్ మరియు తేలికపాటి 3D curve డిజైన్‌ను కలిగి ఉంది. దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉన్న ఈ పవర్ బ్యాంక్ 10,000 ఎమ్ఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంది. మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.ఇది 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇతర సాధారణ పవర్ బ్యాంక్ కంటే 16 శాతం వేగంగా ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. చెప్పినట్లుగా, ఒప్పో పవర్ బ్యాంక్ 2 తక్కువ కరెంట్ ఛార్జింగ్ మోడ్‌తో వస్తుంది, ఇది వినియోగదారులకు హెడ్‌ఫోన్స్ మరియు స్మార్ట్‌వాచ్‌లు వంటి పరికరాలను సురక్షితంగా ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒప్పో పవర్ బ్యాంక్ 2 యొక్క పవర్ బటన్‌ను రెండు సార్లు నొక్కడం ద్వారా తక్కువ కరెంట్ మోడ్‌ను యాక్టివేట్ చేయవచ్చు.

2-in-1 ఛార్జింగ్ కేబుల్
ఒప్పో పవర్ బ్యాంక్ 2 కనెక్టివిటీ కోసం రెండు యుఎస్బి టైప్-ఎ పోర్టులు మరియు ఒక యుఎస్బి టైప్-సి పోర్టుతో వస్తుంది. ఈ పరికరం 2-in-1 ఛార్జింగ్ కేబుల్‌తో వస్తుంది. పవర్ బ్యాంక్ ఎల్‌ఈడీ ఇండికేటర్‌ను కలిగి ఉంది. అది ఛార్జింగ్ అవసరమైనప్పుడు వినియోగదారులకు తెలియజేస్తుంది. ఈ ఒప్పో పవర్ బ్యాంక్ 2 బరువు 273 గ్రాములుగా ఉంది.


Click it and Unblock the Notifications








