Home
Gadgets

ఒప్పో ఎన్‌కో బడ్స్‌ 2 కొత్త వేరియంట్‌ విడుదల.. 28 గంటల బ్యాటరీ లైఫ్‌, నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌తో..!

ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి 2022 సంవత్సరంలో ఒప్పో ఎన్‌కో బడ్స్‌ 2 (Oppo Enco Buds 2) అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా ఈ బడ్స్‌ కొత్త కలర్‌ వేరియంట్‌ను సంస్థ భారత్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ బడ్స్‌ సింగిల్‌ ఛార్జింగ్‌తో 28 గంటల ప్లేటైంను అందిస్తాయి. తొలి విడుదల సమయంలో ఈ బడ్స్‌ బ్లాక్‌ కలర్‌ ఆప్షన్‌లోనే అందుబాటులో ఉండగా.. తాజాగా లిలక్‌ బ్లూ కలర్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఒప్పో ఎన్‌కో బడ్స్‌ 2 స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో ఎన్‌కో బడ్స్‌ 2 ఇయర్‌బడ్స్‌ 10mm డైనమిక్‌ డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. మరియు ఒప్పో ఎన్‌కో లైవ్‌ స్టీరియో సౌండ్‌ ఎఫెక్ట్‌ ఫీచర్‌, డాల్బీ అట్మాస్‌ సపోర్టును కలిగి ఉంటుంది. డిజైన్‌ పరంగా ఈ ఇయర్‌బడ్స్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

Oppo Enco Buds 2 earbuds lilac blue colour variant launched

ఈ ఇయర్‌బడ్స్‌ క్విక్‌ ఛార్జింగ్ సపోర్టుతో సింగిల్‌ ఛార్జింగ్‌లో 28 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ ను అందిస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో ఒక గంటపాటు ప్లేబ్యాక్‌ సమయాన్ని పొందవచ్చని ఒప్పో చెబుతోంది. ఈ ఇయర్‌బడ్స్‌ను పూర్తిగా 90 నిమిషాల్లో ఛార్జింగ్‌ చేయవచ్చని ఒప్పో తెలిపింది.

దీంతోపాటు గేమింగ్‌ కోసం లో లేటెన్సీ మోడ్‌ మరియు బ్లూటూత్ V5.2 పైన పనిచేస్తుంది. కాలింగ్‌ సమయంలో మెరుగైన అనుభూతి కోసం AI డీప్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ ఒప్పో ఎన్‌కో బడ్స్ 2 ఇయర్‌బడ్స్‌ IPX4 రేటింగ్‌తో రెసిస్టెన్స్‌ను కలిగి ఉన్నాయి.

ఒప్పో ఎన్‌కో బడ్స్‌ 2.. ఇయర్‌బడ్స్‌ విడుదల సమయంలో ధర రూ.1,799 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1599 కే కొనుగోలు చేయవచ్చు. తాజాగా లిలక్‌ కలర్‌ ఆప్షన్‌లో అందుబాటులో రావడంతో మొత్తంగా ఈ ఇయర్‌బడ్స్‌ రెండు కలర్ వేరియంట్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

** ఒప్పో నుంచి భారత్‌ మార్కెట్‌లోకి ఒప్పో F27 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌ జూన్‌ 13న విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక లీక్‌లు వచ్చాయి. ఒప్పో F27 ప్రో+ స్మార్ట్‌ఫోన్.. చైనాలో ఏప్రిల్‌ నెలలో విడుదల అయిన ఒప్పో A3 ప్రో హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

డిజైన్ పరంగా ఒప్పో F27+ 5G స్మార్ట్‌ ఫోన్‌ సిల్వర్‌ రింగ్‌ తరహా బోర్డర్‌తో వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. వెనుక ప్యానల్‌ వేగాన్ లెదర్‌తో రానుంది. మరియు మధ్యలో పాలీ కార్బోనేట్‌ స్ట్రిప్‌ను కలిగి ఉంది. దీంతోపాటు కర్వడ్‌ డిస్‌ప్లే సహా సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంది. మరియు ముందువైపు పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేతో రానుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Oppo Enco Buds 2 earbuds new colour variant launched in india features and sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X