ఒప్పో నుంచి కొత్త ఇయర్‌బడ్స్.. ఏకంగా 54 గంటల బ్యాటరీ లైఫ్ సహా మరిన్ని ఫీచర్‌లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌లు తయారీ సంస్థ ఒప్పో ( OPPO India ) నుంచి ఈ నెల 20 వ తేదీన ఒప్పో F29 5G సిరీస్ లాంచ్ కానుంది. ఈ సిరీస్ లో భాగంగా ఒప్పో F29 5G, ఒప్పో F29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ సిరీస్ అండర్ వాటర్ ఫొటోగ్రఫీ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
ఏ పేరుతో లాంచ్ కానుంది? :
అయితే ఒప్పో నుంచి త్వరలో ఇయర్‌బడ్స్ కూడా లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. ఒప్పో ఎన్‌కో సిరీస్ లో ఈ బడ్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఒప్పో ఎన్‌కో బడ్స్ 3 ప్రో పేరుతో (Oppo Enco Buds 3 Pro) విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ బడ్స్ ఒప్పో గ్లోబల్ వెబ్‌సైట్‌లో కనిపించాయి.

54 గంటల బ్యాటరీ లైఫ్ :
దీని ఆధారంగా ఒప్పో బడ్స్ డిజైన్ సహా కొన్ని ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి. అయితే బడ్స్.. ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని తెలుస్తోంది. ఈ బడ్స్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 54 గంటలపాటు వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ తో 4 గంటల వరకు ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు.
ఫీచర్‌ల వివరాలు :
ఒప్పో ఎన్‌కో బడ్స్ 3 ప్రో AAC మరియు SBC ఆడియో కోడిక్స్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. మరియు లోలేటెన్సీతో బ్లూటూత్ 5.4 వెర్షన్‌తో పనిచేస్తుంది. మరియు ఈ బడ్స్ 12.4mm టైటానియం డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుందని సమాచారం.
దీంతోపాటు ఒప్పో ఎన్‌కో బడ్స్ 3 ప్రో ఇయర్‌బడ్స్ డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఫీచర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ బడ్స్ IP55 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని సమాచారం. ఈ బడ్స్ HeyMelody ద్వారా కంట్రోల్ చేయవచ్చు.
భారత్ మార్కెట్‌లో మార్చి 20 వ తేదీన ఒప్పో F29 5G సిరీస్ లాంచ్ కానుంది. వీటితో పాటు ఈ బడ్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే బడ్స్ లాంచ్ పై ఒప్పో ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
* ఒప్పో F29 5G సిరీస్ ఈనెల 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఒప్పో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లు 360 డిగ్రీ ఆర్మర్ బాడీ, మిలిటరీ గ్రేడ్ MIL STD 810H 2022 సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. లెన్స్ ప్రొటెక్షన్, ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఇంటర్నల్ ఫ్రేమ్, కార్నర్ డిజైన్ కవర్, స్పాంజ్ బయోనిక్ కుషనింగ్‌ను కలిగి ఉంది.
ఒప్పో F29 5G ప్రో మోడల్ 80W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. F29 సిరీస్ హ్యాండ్‌సెట్ IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు అండర్ వాటర్ ఫొటోగ్రఫీ ను సపోర్టు చేస్తుంది.


Click it and Unblock the Notifications








