Home
Gadgets

43 గంటల బ్యాటరీ లైఫ్‌, ANC సపోర్టుతో ఒప్పో ఇయర్‌బడ్స్.. ఫీచర్లు, సేల్‌ వివరాలు..!

ఒప్పో సంస్థ భారత్ మార్కెట్లో ఇవాళ ఫైండ్ X9 సిరీస్‌తోపాటు ఎన్‌కో బడ్స్‌ 3 ప్రో+ ఇయర్‌బడ్స్ ను కూడా లాంచ్ చేసింది. రూ.2 వేల కంటే తక్కువ ధరలో అనేక ఫీచర్లతో ఈ TWS ఇయర్‌బడ్స్‌ విడుదల అయ్యాయి. డిజైన్‌తోపాటు బ్యాటరీ లైఫ్‌ కూడా ఆకట్టుకొనే అవకాశం ఉంది. ANC సపోర్టుతోపాటు TUV Rheinland బ్యాటరీ హెల్త్‌ సర్టిఫికేషన్‌ కలిగి ఉంది.

ఒప్పో ఎన్‌కో బడ్స్‌ 3 ప్రో+ ఇయర్‌బడ్స్ పూర్తి వివరాలు :
ఈ ఇయర్‌బడ్స్‌ (OPPO Enco Buds 3 Pro+ Earbuds) 12.4mm డైనమిక్‌ డ్రైవర్‌ లను కలిగి ఉంది. మైక్రోఫోన్ సెన్సిటివిటీ 38 dBV/Pa గా ఉంది. ఈ బడ్స్‌ 32dB స్మార్ట్‌ ANC (యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్) ను కలిగి ఉంది. ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ కూడా ఉంది.

OPPO Enco Buds 3 Pro  Earbuds

10 మీటర్ల వరకు రేంజ్‌ :
కనెక్టివిటీ పరంగా ఎన్‌కో బడ్స్‌ 3 ప్రో+ ఇయర్‌బడ్స్‌ బ్లూటూత్‌ 5.4 ఫీచర్‌ ను కలిగి ఉంది. సుమారు 10 మీటర్ల వరకు వైర్‌లెస్‌ రేంజ్‌ ను అందిస్తుందని ఒప్పో చెబుతోంది. దీంతోపాటు AAC, SBC ఆడియో కోడిక్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ ఇయర్‌బడ్స్‌ 46.2 గ్రాముల బరువు ఉంటుంది.

43 గంటల బ్యాటరీ లైఫ్ :
ఎన్‌కో బడ్స్ 3 ప్రో+ ఇయర్‌బడ్స్‌ లోని ఒక్కో బడ్‌ 58mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే ఛార్జింగ్ కేస్ 440mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ANC ఆఫ్‌ చేసి వినియోగిస్తే గరిష్ఠంగా 43 గంటల బ్యాటరీ లైఫ్‌ ను అందిస్తుంది. అదే ANC ఫీచర్‌ 28 గంటల బ్యాటరీ లైఫ్‌ ను అందిస్తుంది.

12 గంటల ప్లేబ్యాక్‌ టైమ్ :
ఈ బడ్స్‌ ను పూర్తిగా ఛార్జింగ్‌ చేసి ANC ఆఫ్‌ లో ఉన్నప్పుడు 12 గంటలపాటు ప్లేబ్యాక్‌ టైమ్‌ ను అందిస్తుంది. అదే ANC ఆన్‌ లో ఉన్నప్పుడు గరిష్ఠంగా 8 గంటలపాటు ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చని ఒప్పో చెబుతోంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌ తో 11 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

బ్యాటరీ హెల్త్‌ సర్టిఫికేషన్‌ :
ఒప్పో బడ్స్‌ TUV Rheinland బ్యాటరీ హెల్త్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. మరియు IP55 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఒప్పో ఎన్‌కో బడ్స్‌ 3 ప్రో+ ఇయర్‌బడ్స్‌ ధర, సేల్ వివరాలు :
ఒప్పో ఎన్‌కో బడ్స్‌ 3 ప్రో+ ఇయర్‌బడ్స్‌ ధర రూ.2,099 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌ లో భాగంగా రూ.1899 ధరకే కొనుగోలు చేయవచ్చని ఒప్పో చెబుతోంది. భారత్ మార్కెట్‌ లో నవంబర్‌ 21 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభ కానుంది.

ఒప్పో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ స్టోర్‌, భాగస్వామ్య రిటైల్‌ స్టోర్‌లతోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లోనూ అందుబాటులో ఉంటాయి. ఈ బడ్స్‌ మిడ్‌నైట్‌ బ్లాక్‌, సోనిక్‌ బ్లూ కలర్‌ వేరియంట్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
OPPO Enco Buds 3 Pro+ Earbuds with 43 Hours of battery life launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X