54 గంటల ప్లేబ్యాక్ టైంతో OPPO ఇయర్బడ్స్ విడుదల... ధర, ఫీచర్ల పూర్తి వివరాలు..!
OPPO Enco Buds 3 pro TWS Earbuds : ప్రముఖ స్మార్ట్ఫోన్స్, గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ ఒప్పో నుంచి భారత్ మార్కెట్ లోకి ఇవాళ ఒప్పో K13 టర్బో సిరీస్తోపాటు ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో TWS ఇయర్బడ్స్ విడుదల అయ్యాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 54 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ను పొందవచ్చు. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఫీచర్, గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ బడ్స్ ఇన్-ఇయర్ డిజైన్ ను కలిగి ఉన్నాయి. ఈ బడ్స్ టైటానియం ప్లేటింగ్ తో కూడిన 12.4mm డైనమిక్ డ్రైవర్స్ ను కలిగి ఉంది. AAC, SBC ఆడియో కోడిక్స్ ను సపోర్టు చేస్తుంది. 47ms లేటెన్సీని కలిగి ఉంది.

ఒప్పో బడ్స్ ఛార్జింగ్ కేస్ 560mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే ఒక్కో ఇయర్బడ్ 58mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఇయర్బడ్స్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 54 గంటల ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు. కేవలం 10 నిమిషాల క్విక్ ఛార్జింగ్ సపోర్టుతో 4 గంటల ప్లేబ్యాక్ టైమ్ ను పొందవచ్చని సంస్థ చెబుతోంది. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
ఇయర్బడ్స్ ఫీచర్లు :
ఈ ఒప్పో బడ్స్ బ్లూటూత్ 5.4 మరియు డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఫీచర్, గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్, టచ్ కంట్రోల్స్ వంటి ఫీచర్ లను కలిగి ఉంటాయి. బడ్స్ 3 ప్రో ఇయర్బడ్స్ IP55 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ బడ్స్ ను Hey Melody యాప్ ద్వారా కస్టమైజ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో ధర, సేల్ వివరాలు :
ఈ ఒప్పో TWS ఇయర్బడ్స్ ధర రూ.1799 గా ఉంది. ఆగస్టు 27 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా, ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్ బడ్స్ బ్లాక్, వైట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తాయి.
ఒప్పో K13 టర్బో సిరీస్ :
ఈ బడ్స్తోపాటు ఒప్పో K13 టర్బో సిరీస్ కూడా విడుదల అయింది. ఈ సిరీస్ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 7000mAh భారీ బ్యాటరీతో అందుబాటులో ఉంది. మరియు థర్మల్ మేనేజ్మెంట్ కోసం కూలింగ్ ఛాంబర్ను కూడా కలిగి ఉంది.
ఈ సిరీస్ 6.8 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. బేస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్సెట్ను కలిగి ఉంది. అదే ప్రో మోడల్ స్నాప్డ్రాగన్ 8s జెన్ 4 SoC చిప్సెట్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS తో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP + 2MP తోపాటు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








