Oppo నుంచి అద‌ర‌గొట్టే ఫీచ‌ర్ల‌తో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఇయ‌ర్‌బ‌డ్స్ విడుద‌ల‌!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ ఒప్పో, భార‌త మార్కెట్లో క్ర‌మంగా త‌మ ఉత్ప‌త్తుల్ని విస్త‌రిస్తోంది. తాజాగా, Oppo కంపెనీ సరికొత్త ఇయ‌ర్‌బ‌డ్స్ ను భార‌త మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. Oppo Enco Buds2 పేరుతో ఈ స‌రికొత్త మోడ‌ల్ బ‌డ్స్‌ను ఈ రోజు భారతదేశంలో లాంచ్ చేసింది.

 
Oppo నుంచి అద‌ర‌గొట్టే ఫీచ‌ర్ల‌తో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఇయ‌ర్‌బ‌డ్స్ విడు

ఈ వైర్‌లెస్ బ‌డ్స్‌ బడ్జెట్ ధ‌ర‌లోనే వినియోగ‌దారుల ముందుకు వ‌స్తున్నాయి. కొత్త Oppo Enco Buds2, దేశ‌వ్యాప్తంగా ఉన్న Oppo స్టోర్లలో మరియు Flipkartలో అందుబాటులో ఉంటాయ‌ని కంపెనీ పేర్కొంది. ఈ బడ్స్ ప్రారంభ ధర రూ.1,799 గా కంపెనీ నిర్ణ‌యించింది. ఈ ఇయ‌ర్‌ బడ్స్ ఆగస్టు 31 నుండి అమ్మకానికి వస్తాయి.

Oppo Enco Buds2 స్పెసిఫికేష‌న్లు:

Oppo Enco Buds2 స్పెసిఫికేష‌న్లు:

OPPO Enco Buds2 మెరుగైన బేస్ తో మంచి సౌండ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను క‌లిగిస్తాయి. ఇవి 10mm డ్రైవర్ల‌ను క‌లిగి ఉన్నాయి. ఈ డ్రైవర్ల టైటానియం డయాఫ్రాగమ్ స‌మాన‌మైన సౌండ్ బేస్ స్థాయిని అందించ‌డంలో స‌హ‌క‌రిస్తుంది. TWS డాల్బీ అట్మోస్‌కు స‌పోర్టు క‌లిగి ఉంది. ఇందులో ఒరిజినల్ సౌండ్, బేస్ బూస్ట్ మరియు క్లియర్ వోకల్స్ అని మూడు సెట్టింగ్‌లు ఉన్నాయి. అలాగే OPPO యొక్క స్వంత Enco లైవ్ స్టీరియో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా క‌ల్పిస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలో డ‌స్ట్ లేదా చెమ‌ట నుంచి రెసిస్టెన్స్ పొంద‌డానికి కాంపాక్ట్ TWSలోని IPX4 గ్రేడ్ రేటింగ్ క‌ల్పిస్తున్నారు.

ఈ బ‌డ్స్ ఒక‌సారి పూర్తి ఛార్జ్ చేయ‌డం ద్వారా వినియోగ‌దారులు ఏడు గంటల పాటు సౌండ్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా, ఛార్జింగ్ కేసు నుండి 28 గంటల పాటు మ్యూజిక్ ఎంజాయ్ చేసే విధంగా ఎన‌ర్జీ సపోర్ట్ అందిస్తున్నారు. వాస్తవానికి, ఈ బడ్స్‌ను కేవ‌లం 10 నిమిషాల పాటు ఛార్జింగ్ చేయడం ద్వారా వినియోగదారులు ఒక గంట పాటు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

అద్భుత‌మైన క‌నెక్టివిటీ:
 

అద్భుత‌మైన క‌నెక్టివిటీ:

OPPO Enco Buds2లో డీప్ న్యూరల్ నెట్‌వర్క్ (DNN) ఆధారిత AI డీప్ నాయిస్ క్యాన్సిలేషన్ అల్గారిథమ్‌లు ఉన్నాయి. ఇవి కాల్స్ మాట్లాడే సమయంలో బ్యాక్‌గ్రౌండ్లో అన‌వ‌స‌ర శ‌బ్దాల‌ను దూరం చేస్తాయి. త‌ద్వారా మంచి సౌండ్ అనుభూతిని పొంద‌వ‌చ్చు. అదనంగా, TWS తక్కువ-లేటెన్సీ బ్లూటూత్ 5.2 ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ఇది మంచి కనెక్టివిటీని అనుమతిస్తుంది. ఈ బ‌డ్స్ ద్వారా వినియోగదారులు వైర్డు హెడ్‌ఫోన్‌ల స్థాయి ఆడియో మరియు వీడియో సమకాలీకరణతో గేమింగ్‌ను ఆస్వాదించవచ్చు.

బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఇయ‌ర్‌బ‌డ్స్‌:

బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఇయ‌ర్‌బ‌డ్స్‌:

ఇక పెయిరింగ్ విష‌యానికొస్తే.. ఈ బ‌డ్స్ ఏ డివైజ్‌తో అయినా చాలా త్వరగా సులువుగా పెయిర్ అవుతాయి. ఇది వినియోగదారులు పాప్-అప్ విండోపై నొక్కడానికి సులభంగా మరియు త్వరగా బడ్స్‌తో జత చేయడానికి అనుమతిస్తుంది. ఓపెన్-అప్ ఫ్లాష్ యొక్క కొత్త ఫీచర్ వినియోగదారులు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవ్వడానికి మరియు కేసు మూసివేయబడినప్పుడు ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఫ్లిప్‌కార్ట్ మరియు ఒప్పో స్టోర్‌లలో ఆగస్టు 31 నుండి బ్లాక్ కలర్‌లో రూ. 1,799 ధరకు లభిస్తాయి.

అదేవిధంగా, ఇటీవ‌ల రియ‌ల్‌మీ కంపెనీ నుంచి కూడా Realme TechLife Buds T100 TWS పేరుతో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఇయ‌ర్‌బ‌డ్స్ విడుద‌ల‌య్యాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం:

అదేవిధంగా, ఇటీవ‌ల రియ‌ల్‌మీ కంపెనీ నుంచి కూడా Realme TechLife Buds T100 TWS పేరుతో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఇయ‌ర్‌బ‌డ్స్ విడుద‌ల‌య్యాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం:

Realme కంపెనీ నుంచి TechLife Buds T100 TWS ఇయర్‌బడ్స్ బ‌డ్జెట్ ధ‌ర‌లో ఇటీవ‌ల భార‌త మార్కెట్లోకి వ‌చ్చాయి. భార‌త మార్కెట్లో వాటి ధరను కంపెనీ రూ.1,499 గా నిర్ణ‌యించింది. అంతేకాకుండా, ఆగస్ట్ 24 నుండి ఆ ఇయ‌ర్ బ‌డ్స్ Flipkart మరియు Realme.com ద్వారా సేల్ చేయ‌వ‌చ్చ‌ని పేర్కొంది. పరిమిత-కాల ఆఫర్‌గా, ఆస‌క్తి గల వినియోగ‌దారులు వీటిని రూ.1,299 కొనుగోలు చేసేలా కంపెనీ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

Realme TechLife Buds T100 TWS స్పెసిఫికేష‌న్లు:

Realme TechLife Buds T100 TWS స్పెసిఫికేష‌న్లు:

Realme TechLife Buds T100 ఇయ‌ర్‌బ‌డ్స్ స్పష్టమైన సౌండ్ బేస్ కోసం PEEK+TPUని ఉపయోగించి తయారు చేసిన‌ 10mm అధునాతన డయాఫ్రాగమ్‌తో అమర్చబడింది. మీరు కాల్స్ కోసం ఇయ‌ర్ బ‌డ్స్ ఉపయోగిస్తున్నప్పుడు యాంబియంట్ నాయిస్‌ను త‌గ్గించి మొత్తం కాలింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే విధంగా AI ENC టెక్నాల‌జీని క‌లిగి ఉంటాయి. ఇంకా, ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ ప్రత్యేకమైన 88ms తక్కువ లేటెన్సీ మోడ్‌ను కలిగి ఉంటాయి, ఈ ఫీచ‌ర్ గేమింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇది 10mm డైనమిక్ డ్రైవర్లతో కూడా వస్తుంది.

Google ఫాస్ట్ పెయిర్ స‌పోర్ట్ ఫీచ‌ర్ ద్వారా, Realme TechLife Buds T100 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ఇప్పటికే పెయిర్ చేసిన పరికరంతో తక్షణమే సులువుగా జత చేయవచ్చు. డిజైన్ పరంగా, యాక్సెసరీ ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, చెవి సైజుకు త‌గ్గ‌ట్టు మార్చుకోవ‌డానికి అద‌నంగా సిలికాన్ టిప్స్‌ను అందిస్తున్నారు. ఇక ఛార్జింగ్ కేస్ పెబ‌ల్ ఆకారంలో ఆక‌ర్ష‌ణీయమైన డిజైన్‌ కలిగి ఉంటుంది.

బ్యాటరీ లైఫ్ పరంగా, Realme TechLife Buds T100 బ‌డ్స్ ఆరు గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. ఛార్జింగ్ కేస్ 28 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ TWS ఇయర్‌బడ్‌లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడా వస్తాయి, దీని వలన వినియోగదారులు కేవలం 10 నిమిషాల పాటు ప్లగిన్ చేయడం ద్వారా 120 నిమిషాల ప్లేబ్యాక్‌ను పొందగలరు. మీరు జిమ్‌లో మరియు అవుట్‌డోర్‌లో ఉన్నప్పుడు దీనిని ఉపయోగించడానికి Realme TechLife Buds T100లో IPX5 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. కంపెనీ ఈ ఇయర్‌బడ్‌లను వైట్ anb మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. ఈ ఇయ‌ర్ బ‌డ్స్ దేశంలో ఈ కంపెనీ నుంచి ఇదువ‌ర‌కు విడుద‌ల చేసిన Realme Buds Air 3 Neolకి స‌క్సెస‌ర్‌గా పేర్కొంటున్నారు.

Best Mobiles in India

English summary
Oppo Enco Buds2 Launched in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X