30 రోజుల బ్యాట‌రీ లైఫ్ ఇచ్చే Smartwatch చూశారా.. ఫీచ‌ర్ల‌పై లుక్కేయండి!

|

Pebble కంపెనీ భార‌త మార్కెట్లో క్ర‌మంగా త‌మ ఉత్ప‌త్తుల్ని విస్త‌రిస్తోంది. ఇత‌ర కంపెనీల‌కు దీటుగా అద్భుత‌మైన Smartwatchల‌ను మ‌న మార్కెట్లో విడుద‌ల చేస్తోంది. తాజాగా మ‌రో రెండు కొత్త స్మార్ట్‌వాచ్ ల‌ను భార‌త్‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చింది. పెబ‌ల్ Orion, Spectra అనే రెండు మోడ‌ళ్ల‌ను బ‌డ్జెట్ ధ‌ర‌లో భార‌త మార్కెట్లో విడుద‌ల చేసింది. ఈ రెండు Smartwatchలు బ్లూటూత్ కాలింగ్ ఆప్ష‌న్‌ను క‌లిగి ఉన్నాయి.

 
30 రోజుల బ్యాట‌రీ లైఫ్ ఇచ్చే Smartwatch చూశారా.. ఫీచ‌ర్ల‌పై లుక్కేయండి

పెబల్ ఓరియన్ మోడ‌ల్ Smartwatch 1.81-అంగుళాల పూర్తి-HD డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇక స్పెక్ట్రా మోడ‌ల్ 1.36-అంగుళాల AMOLED డిస్‌ప్లేను ప్యాక్ చేస్తుంది. రెండు మోడల్‌లు AI- ఎనేబుల్డ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ మరియు స్పోర్ట్ SpO2 మానిటరింగ్‌, ర‌క్తపోటు పర్యవేక్షణ, హృదయ స్పందన పర్యవేక్షణ మరియు స్త్రీలకు ఆరోగ్య ట్రాకింగ్‌ను కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు మోడ‌ల్ స్మార్ట్ వాచ్‌ల‌కు సంబంధించిన ధ‌ర‌ల్ని, ఫీచ‌ర్ల‌ని, స్పెసిఫికేష‌న్ల‌ను వివ‌రంగా తెలుసుకుందాం.

పెబ‌ల్ Orion, Spectra మోడ‌ల్స్ Smartwatchల ధ‌ర‌లు:
పెబ‌ల్ Orion మోడ‌ల్ స్మార్ట్ వాచ్ Smartwatchధ‌ర‌ను భార‌త మార్కెట్లో రూ.3,499 గా నిర్ణ‌యించారు. ఇక‌పోతే, పెబ‌ల్ Spectra ధ‌ర‌ను డిస్కౌంట్‌తో రూ.5,499 గా నిర్ణ‌యించారు.

పెబ‌ల్ Orion Smartwatch స్పెసిఫికేన్లు:
పెబ‌ల్ Orion యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 240×286 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.81-అంగుళాల స్క్వేర్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని పెద్ద స్క్రీన్‌ను క‌లిగి ఉంటుంది. దీనికి స్క్వేర్ ఆకారంలో ఉండే జింక్ బాడీని అందిస్తున్నారు. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృద‌య స్పంద‌న‌ల‌) మానిట‌రింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాక‌ర్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిట‌రింగ్ ఫీచ‌ర్‌ను కూడా ఈ బ్యాండ్ క‌లిగి ఉంది. ఈ వాచ్ 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‌ల‌ను క‌లిగి ఉంటుంది. స్ట్రెస్ మానిట‌రింగ్‌, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచ‌ర్‌ల‌ను కూడా అందిస్తున్నారు. ఇది ఆటో స్పీక‌ర్ క్లీన‌ర్ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉంది.

అంతేకాకుండా కాల్ రిజెక్ష‌న్‌, ఫైండ్ మై ఫోన్‌, మ్యూజిక్‌, కెమెరా కంట్రోల్ స‌హా ప‌లు ఫీచ‌ర్లు ఈ వాచ్‌కు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇది 5.1 బ్లూటూత్ వ‌ర్ష‌న్‌ను క‌లిగి ఉంది. మ‌రోవైపు ఈ స్మార్ట్ వాచ్ డ‌స్ట్ మ‌రియు వాట‌ర్ రెసిస్టెన్స్ కు సంబంధించి IP67 సౌక‌ర్యాన్ని క‌లిగి ఉంది. దీనికి 260mAh
సామర్థ్యం గ‌ల బ్యాట‌రీ ని అందిస్తున్నారు. ఇది ఒక‌సారి ఫుల్ చార్జ్ చేయ‌డం ద్వారా 10 రోజుల పాటు కంటిన్యూ వినియోగాన్ని అందిస్తుంది. AI- ఎనేబుల్డ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ క‌లిగి ఉంది.

30 రోజుల బ్యాట‌రీ లైఫ్ ఇచ్చే Smartwatch చూశారా.. ఫీచ‌ర్ల‌పై లుక్కేయండి

పెబ‌ల్ Spectra Smartwatch స్పెసిఫికేన్లు:
పెబ‌ల్ Spectra యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 390×390 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.36-అంగుళాల స్క్వేర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ ప‌రిమాణం ఓరియాన్ కంటే కాస్త చిన్న‌గా ఉంటుంది. ఈ వాచ్ డిస్‌ప్లే ఆల్వేస్ ఆన్ మోడ్ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉంది. ఈ వాచ్ బాడీని జింక్ అలాయ్ మెట‌ల్‌తో త‌యారు చేశారు. క్రౌన్ రొటేష‌న్ బ‌ట‌న్‌ను క‌లిగి ఉంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృద‌య స్పంద‌న‌ల‌) మానిట‌రింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాక‌ర్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిట‌రింగ్ ఫీచ‌ర్‌ను కూడా ఈ బ్యాండ్ క‌లిగి ఉంది. ఈ వాచ్ 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‌ల‌ను క‌లిగి ఉంటుంది. స్ట్రెస్ మానిట‌రింగ్‌, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచ‌ర్‌ల‌ను కూడా అందిస్తున్నారు. ఇది ఆటో స్పీక‌ర్ క్లీన‌ర్ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉంది.

 

అంతేకాకుండా కాల్ రిజెక్ష‌న్‌, ఫైండ్ మై ఫోన్‌, మ్యూజిక్‌, కెమెరా కంట్రోల్ స‌హా ప‌లు ఫీచ‌ర్లు ఈ వాచ్‌కు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇది 5.1 బ్లూటూత్ వ‌ర్ష‌న్‌ను క‌లిగి ఉంది. మ‌రోవైపు ఈ స్మార్ట్ వాచ్ డ‌స్ట్ మ‌రియు వాట‌ర్ రెసిస్టెన్స్ కు సంబంధించి IP67 సౌక‌ర్యాన్ని క‌లిగి ఉంది. దీనికి 300mAh
సామర్థ్యం గ‌ల బ్యాట‌రీ ని అందిస్తున్నారు. ఇది ఒక‌సారి ఫుల్ చార్జ్ చేయ‌డం ద్వారా 30 రోజుల పాటు కంటిన్యూ వినియోగాన్ని అందిస్తుంది. AI- ఎనేబుల్డ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ క‌లిగి ఉంది.

Best Mobiles in India

English summary
Pebble Orion, Spectra Smartwatches with SpO2 Tracking launched in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X