Philips కంపెనీ యొక్క కొత్త సౌండ్‌బార్ల ధరలు & ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...

|

ఫిలిప్స్ సంస్థ భారతదేశంలో ఫిలిప్స్ TAB7305 మరియు ఫిలిప్స్ TAB5305 పేరుతో కొత్తగా రెండు సౌండ్‌బార్లను విడుదల చేసింది. ఈ రెండు సౌండ్‌బార్లు 2.1 ఛానల్ సెటప్ మరియు వైర్‌లెస్ సబ్‌ వూఫర్‌లకు మద్దతుతో వస్తాయి. అయితే ఫిలిప్స్ TAB7305 సౌండ్ బార్ అనేది ఫిలిప్స్ TAB5305 కన్నా అధిక సౌండ్ ను అందిస్తుంది. ఏదేమైనా ఈ రెండింటి మధ్య ధర వ్యత్యాసం కూడా అధికంగానే ఉంది. ఫిలిప్స్ TAB7305 సౌండ్ బార్ అధిక ఫీచర్లను కలిగి ఉంది. మీరు మీ ఇంటి / కార్యాలయ గోడలపై మౌంట్ చేయాలనుకుంటే కంపెనీ వాల్ బ్రాకెట్లను స్పీకర్లతో అందిస్తోంది.

ఫిలిప్స్ కొత్త సౌండ్‌బార్ల ధరల వివరాలు

ఫిలిప్స్ కొత్త సౌండ్‌బార్ల ధరల వివరాలు

ఫిలిప్స్ సంస్థ యొక్క TAB7305, TAB5305 రెండు సౌండ్‌బార్ల ధరలు వరుసగా రూ.21,990 మరియు 14,990 రూపాయలుగా ఉన్నాయి. ఈ సౌండ్‌బార్లను భారతదేశంలో ఆన్‌లైన్ లో ఫిలిప్స్ ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి మరియు సంస్థ యొక్క ఆఫ్‌లైన్ భాగస్వాముల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

ఫిలిప్స్ TAB7305, TAB5305 సౌండ్‌బార్ల స్పెసిఫికేషన్స్

ఫిలిప్స్ TAB7305, TAB5305 సౌండ్‌బార్ల స్పెసిఫికేషన్స్

ఫిలిప్స్ TAB7305 సౌండ్‌బార్ మొత్తంగా 300W సౌండ్ అవుట్పుట్ సిస్టమ్ (140W సబ్ వూఫర్ మరియు 160W సౌండర్) తో వస్తుంది. మరోవైపు ఫిలిప్స్ TAB5305 సౌండ్‌బార్ మొత్తంగా 70W సౌండ్(సౌండర్ నుండి 30W మరియు సబ్ వూఫర్ నుండి 40W) అవుట్పుట్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఫిలిప్స్ సౌండ్‌బార్లు రెండూ 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 4.2, ARC, HDMI 1.4 మరియు డిజిటల్ ఆప్టికల్ యూనిట్ వంటి కనెక్టివిటీ ఎంపికలకు మద్దతును కలిగి ఉంటాయి. అయితే TAB7305 USB పోర్ట్ మరియు HDMI-CEC ఫీచర్ వంటి అదనపు కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఫిలిప్స్ TAB5305 సౌండ్‌బార్ బ్లూటూత్

ఆడియో ఫార్మాట్లలో ఫిలిప్స్ TAB5305 సౌండ్‌బార్ బ్లూటూత్ ద్వారా SBC కి మరియు HDMI ARC కి మరియు ఆప్టికల్ ద్వారా LPCM 2ch కి మద్దతును ఇస్తుంది. అలాగే ఫిలిప్స్ TAB7305 సౌండ్‌బార్ డాల్బీ డిజిటల్, HDMI ARC ద్వారా డాల్బీ డిజిటల్ ప్లస్, LPCM 2ch మరియు బ్లూటూత్ ద్వారా SBC మరియు ఆప్టికల్ కనెక్షన్ ద్వారా డాల్బీ డిజిటల్ మరియు LPCM 2ch వంటి ఆడియో ఫార్మాట్‌లకు మద్దతును ఇస్తుంది. ఫిలిప్స్ TAB5305 సౌండ్‌బార్ 900x91x65.5mm మరియు ఫిలిప్స్ TAB7305 సౌండ్‌బార్ 800x95x64.7mm కొలతలతో వస్తుంది. ఫిలిప్స్ TAB5305 యొక్క సబ్ వూఫర్ 150x225x267mm మరియు ఫిలిప్స్ TAB7305 యొక్క సబ్ వూఫర్ 380x280x190mm కొలతలతో వస్తుంది.

Best Mobiles in India

English summary
Philips company Released Two New Soundbars With Wireless Subwoofer in India: Price, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X