Home
Gadgets

రూ.9,995 ప్రారంభ ధరతో Philips Air Purifiers విడుదల..Silentwings టెక్నాలజీ సహా అత్యాధునిక ఫీచర్‌లు ..!

కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఢిల్లీ సహా ఇతర నగరాలు, పట్టణాల్లోని ప్రజలు గాలి కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం కారణంగా అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ కలుషితమైన గాలి కారణంగా శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఊపిరితిత్తుల సమస్యలు సహా శరీరంలోని రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎయిర్‌ ప్యూరిఫైయర్‌లు (Latest Air Purifiers)బాగా ఉపయోగపడుతున్నాయి.

ఈ ఎయిర్‌ప్యూరిఫైయర్‌లను ఇంట్లో, కార్యాలయాల్లో గాలిని శుభం చేసి అందిస్తాయి. ఫలితంగా అనారోగ్యం బారినపడకుండా కాపాడుకోవచ్చు. గాలిలోని కాలుష్యం, క్రిములను తొలగించి, స్వచ్చమైన గాలిని అందిస్తాయి. ప్రస్తుతం అనేక సంస్థలు ఎయిర్‌ ప్యూరిఫైయర్‌లను తక్కువ ధరకే అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ సంస్థ ఫిలిప్స్‌ (Philips Air Purifiers) సరికొత్త ఎయిర్‌ ప్యూరిఫైయర్‌లను విడుదల చేసింది.

hilips launched 3200 and 4200 pro and 900 mini series Air Purifiers

ఫిలిప్స్‌ తాజాగా మూడు మోడళ్లలో ఎయిర్‌ ప్యూరిఫైయర్స్‌ను లాంచ్ చేసింది. ఇందులో 3200, 4200 ప్రో, 900 మిని (వైఫై సపోర్టు) ఉన్నాయి. ఈ ప్యూరిఫైయర్‌లు వాతావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తాయి. మరియు అత్యాధునిక ఫీచర్‌లను కలిగి ఉంది. ఇంట్లో, కార్యాలయాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తాయని సంస్థ చెబుతోంది.

ఫిలిప్స్‌ 900 మిని సరీస్‌ :
చిన్న గదుల్లో తక్కువ ధరతో ఎయిర్ ప్యూరిఫైయర్‌ కావాలని భావిస్తున్న వారు ఈ ప్యూరిఫైయర్‌ సౌకర్యంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. 250 క్యూబిక్‌ మీటర్ల వేగంతో స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ఈ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ చిన్న బెడ్‌రూంలకు అనువుగా ఉంటుంది. 3 లేయర్‌ HEPA నానోప్రొటెక్ట్‌ ఫిల్టరేషన్‌ సిస్టమ్‌ చిన్న కణాలను కూడా నియంత్రిస్తుంది.

ఈ మోటల్‌ తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటుందని సంస్థ చెబుతోంది. ఈ ప్యూరిఫైయర్‌ స్టాండర్డ్‌ మోడల్‌ ధర రూ.9,995 గా ఉంది. అదే వైఫై తో కూడిన మోడల్‌ ధర రూ.11,995 గా ఉంది. ఈ 900 మిని ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను కూడా Air+ యాప్‌తో కనెక్ట్‌ చేయవచ్చు. ప్రస్తుతం రిటైల్‌ దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి.

ఫిలిప్స్‌ 3200 సిరీస్‌ :
ఈ ప్యూరిఫైయర్‌ కాంపాక్ట్ సైజులో అందుబాటులో ఉంది. ఈ ప్యూరిఫైయర్‌ గంటకు 520 క్యూబిక్‌ మీటర్ల వేగంతో స్వచ్చమైన గాలిని అందిస్తుంది. ఎటువంటి శబ్ధం లేకుండా పనిచేస్తుంది. సైలెంట్‌వింగ్స్‌ టెక్నాలజీ ద్వారా ప్రస్తుత మోడళ్లు కంటే 30 శాతం నిశ్శబ్దంగా పనిచేస్తుంది.

HEPA నానా ప్రొటెక్ట్ ఫిల్టర్‌ 99.97 శాతం హానికరమైన క్రిములు, కణాలను 0.003 మైక్రాన్‌ల వరకు నియంత్రిస్తుంది. ఈ ప్యూరిఫైయర్‌ 3200 ఎయిర్‌+ యాప్‌ ద్వారా కనెక్ట్ చేయవచ్చు. ఈ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను దూరం నుంచే నియంత్రణ, పర్యవేక్షించే అవకాశం ఉంది. దీని ధర భారత్ మార్కెట్‌లో రూ.22,995 గా ఉంది.

ఫిలిప్స్‌ 4200 ప్రో సిరీస్‌ :
గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ సమర్థవంతంగా పనిచేస్తుంది. గంటలకు 600 క్యూబిక్‌ మీటర్ల వేగంతో గాలిని శుభ్రపరుస్తుంది. ఈ ప్యూరిఫైయర్‌ 4 లేయర్‌ ఫిల్టరేషన్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.27,995 గా ఉంది.

ఈ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ ప్రీ ఫిల్టర్‌, HEPA నానో ప్రొటెక్ట్‌, టూ లేయర్‌ యాక్టివ్‌ కార్బన్‌ సిస్టమ్‌తో 99.97 శాతం వరకు కణాలను శుభ్రం చేస్తుంది. ఈ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ కూడా Air+ యాప్‌ ద్వారా కనెక్ట్‌ కావచ్చు. అధిక గాలి కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ఈ ప్యూరిఫైయర్‌ బాగా ఉపయోగపడుతుంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X