కనుమరుగుకానున్న వైఫై, దూసుకొస్తున్న లైఫై !

|

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫిలిప్స్ సరికొత్త టెక్నాలజీతో దూసుకొస్తోంది. వైఫై ఇక చరిత్రపుటల్లోకి జారుకోనుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇకపై మనం వైఫై కాదు, లైఫై (LiFi)ని వాడుకోవాలి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫిలిప్స్ ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తాజాగా ఆవిష్కరించింది. దీంతో త్వరలో లైఫై టెక్నాలజీ మనకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా సురక్షితమైన, వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను పొందేందుకు వీలుంటుంది. మరి అదెలా ఉండబోతోంది. దాని ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి అనేదానిపై చాలామందికి సందేహాలు రావచ్చు. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

లైఫై ఎలా పనిచేస్తుంది

లైఫై ఎలా పనిచేస్తుంది

వైఫై టెక్నాలజీ అంటే వైర్‌లెస్ తరంగాల ఆధారంగా పనిచేసే టెక్నాలజీ అని అందరికీ తెలిసిందే. అయితే లైఫై కాంతి తరంగాల ఆధారంగా పనిచేస్తుంది. అంటే ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎల్‌ఈడీ లైట్లలో మోడెమ్‌ను అమరుస్తారు.

లైట్లను ఆన్ చేసినప్పుడు..

లైట్లను ఆన్ చేసినప్పుడు..

ఈ క్రమంలో లైట్లను ఆన్ చేసినప్పుడు ఆ మోడెమ్ నుంచి కాంతి తరంగాలు లైట్ల ద్వారా బయటకు వస్తాయి. ఇక స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌కు అమర్చబడిన ప్రత్యేకమైన యూఎస్‌బీ డాంగిల్ ఆ కాంతి తరంగాలను గుర్తించి వాటిని ఇంటర్నెట్ తరంగాలుగా మార్చి డివైస్‌లకు ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఇలా లైఫై పనిచేస్తుంది.

లైఫై ఉపయోగాలు
 

లైఫై ఉపయోగాలు

వైర్‌లెస్ తరంగాలు వాడేందుకు వీలుకాని చాలా వరకు ప్రదేశాల్లో లైఫైని సులభంగా వాడవచ్చు. దీంతోపాటు ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం వినియోగదారులకు పూర్తి సెక్యూరిటీని అందిస్తుంది. గోడల ద్వారా వైఫై బయటకు కూడా ప్రసారం అవుతుంది. కానీ లైఫై కేవలం ఒకే చోట ఉంటుంది.

ఇతరులు దాన్ని యాక్సెస్ చేయలేరు

ఇతరులు దాన్ని యాక్సెస్ చేయలేరు

ఇది వైఫై ప్రయాణించినట్లు గోడల ద్వారా ప్రయాణించదు. దీంతో లైఫై ద్వారా వచ్చే ఇంటర్నెట్‌కు సెక్యూరిటీ ఉంటుంది. ఇతరులు దాన్ని యాక్సెస్ చేయలేరు. కార్పొరేట్ కార్యాలయాల్లో, ఇతర సంస్థల్లో లైఫై ద్వారా ఇంటర్నెట్‌ను వాడితే అది సురక్షింగా ఉండడమే కాదు, సుస్థిరమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తుంది.

ప్రస్తుతానికి 30 ఎంబిపీఎస్ స్పీడ్

ప్రస్తుతానికి 30 ఎంబిపీఎస్ స్పీడ్

కాగా ఈ లైఫై టెక్నాలజీ ప్రస్తుతానికి 30 ఎంబిపీఎస్ స్పీడ్ మీద ప్రయాణించే అవకాశం ఉంది. అయితే ఇది అంత వేగం కాకపోయినప్పటికీ ముందు ముందు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ వేగం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఫిలిప్స్ ఆవిష్కరించిన ఈ లైఫై టెక్నాలజీ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో వాణిజ్యపరమైన వినియోగానికి అందుబాటులోకి రానుంది.

Best Mobiles in India

English summary
Philips Lighting to Become the First Company to Provide LiFi Broadband Services Through LED Lights more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X