మీ ఫోన్‌కు పొంచి ఉన్న 10 గండాలు, ఏంటో తెలుసా..?

Written By:

ఈ రోజుల్లో ఫోన్ అనేది మనకు చాలా విలువైన ఆస్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరు వారివారి బడ్జెట్ పరిధిలో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చేతిలోని ఫోన్ దురదృష్టవశాత్తూ డామెజ్ కు గురవటం కాని, చోరీకి గురువటం కాని జరిగితే మన ప్రాణం చెప్పుకోలేని మానసిక ఒత్తిడికి లోనవుతుంది.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న 10 గండాలు, ఏంటో తెలుసా..?

దీనికి కారణం ఫోన్‌ల పై మనం రోజరోజు మనం పెంచుకుంటున్న మమకారమే. మన దైనందని కార్యకలాపాల్లో ఫోన్‌లు ఇంతాలా మనతో మమేకమవటానికి కారణం అవి కల్పిస్తోన్నకమ్యూనికేషన్ వసతులే. మీ ఫోన్ ఎప్పటికప్పుడే సేప్టీ జోన్‌లో ఉండాలంటే ఈ సందర్బాలు ఎదురుకాకుండా చూస్కోండి...

Read More : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా..? వీటి కోసం ఆగి తీరాల్సిందే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్‌కు పొంచి ఉన్న 10 గండాలు, ఏంటో తెలుసా..?

చాలా మంది తమ ఫోన్‌లను ఎండలో వదిలేసి వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. అధిక వేడి అలానే అధిక చల్లధనం ఫోన్ జీవితకాలాన్ని హరించివేయగలదు.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న 10 గండాలు, ఏంటో తెలుసా..?

ఫోన్‌ను వెనుక జేబులో క్యారీ చేయటమనేది ఏ మాత్రం మంచి ఆలోచన కాదు.ఇలా చేయటం వల్ల ఫోన్ స్ర్కీన్ దెబ్బతినే ప్రమాదముంది. అంతేకాదు కొన్ని కొన్ని సందర్బాల్లో ఫోన్ ఒవర్ హీట్ అయి ఫిజికల్ డామెజ్ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న 10 గండాలు, ఏంటో తెలుసా..?

చాలా మంది రెగ్యులర్ ట్రావెలర్స్ తమ ఫోన్‌లను బ్యాగ్ అడుగున పడేస్తుంటారు. ఈ కారణంగా ఫోన్ పై హీట్ లేదా ఒత్తిడి పెరిగి పనితీరు మందగించే అవకాశముంది.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న 10 గండాలు, ఏంటో తెలుసా..?

చాలా మంది తమ ఫోన్‌లను వంటగదిలోనూ ఉపయోగించేస్తుంటారు. ఫోన్‌లను కుకింగ్‌కు దగ్గరగా ఉంచటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అధిక వేడి ఉత్పన్నమైన ఫోన్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న 10 గండాలు, ఏంటో తెలుసా..?

బాత్‌రూమ్‌లలో కూడా సెల్‌ఫోన్‌లను విడిచిపెట్టి ఉండలేని పరిస్థితి నేటి యాంత్రిక ప్రపంచంలో నెలకుంది. ఈ చర్య అంత మంచిదేమి కాదు. బాత్‌రూమ్‌లోనూ సెల్‌ఫోన్ పై ధ్యాసను కేంద్రీకరించటం కారణంగా వ్యక్తిగత సంరక్షణను నిర్లక్ష్యం చేసే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు. ఒకవేళ పొరపాటు మీ ఫోన్ బాత్రూమ్‌లో పడితే వాటిల్లే నష్టం కూడా అంతేలా ఉంటుంది.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న 10 గండాలు, ఏంటో తెలుసా..?

పొరపాటున కాఫీ మీ ఫోన్ పై ఒలికినట్లయితే ఫోన్ స్ర్కీన్, స్పీకర్ వంటి కాంపోనెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీ ఫోన్‌ను కాఫీ కప్‌కు దూరంగా ఉంచండి.

మీ ఫోన్‌కు పొంచి ఉన్న 10 గండాలు, ఏంటో తెలుసా..?

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం ప్రమాదకరం. ఈ చర్య ప్రమాదాలకు కారణమవుతోంది. కాబట్టి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ను మీకుదూరంగా ఉంచండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Places Where Your Phone Should Never Be. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot