Home
Gadgets

12.1 అంగుళాల డిస్‌ప్లే, 10000mAh బ్యాటరీతో 5G ట్యాబ్లెట్‌.. ఆగస్టు 23 న విడుదల..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ ల తయారీ సంస్థ పోకో (Poco) నుంచి త్వరలో 5G ప్యాడ్‌ విడుదల కానుంది. పోకో ప్యాడ్‌ 5G (Poco Pad 5G Launch Date in india) డిజైన్‌, స్పెసిఫికేషన్‌ల వివరాలను పోకో విడుదల చేసింది. ఈ ప్యాడ్‌ వైఫై (Wi-Fi) వేరియంట్‌ ఈ సంవత్సరం మే నెలలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం సెల్యూలర్‌ వేరియంట్‌ లాంచ్‌ కానుంది. గ్లోబల్‌ వేరియంట్‌ తరహా స్పెసిఫికేషన్‌ లను కలిగి ఉండే అవకాశం ఉంది.

పోకో ప్యాడ్ 5G విడుదల తేదీని సంస్థ తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం X ద్వారా వెల్లడించింది. ఆగస్టు 23వ తేదీన భారత్‌ లో లాంచ్‌ కానుంది. సంస్థ విడుదల చేసిన ఫోటో ఆధారంగా ఈ ట్యాబ్లెట్‌ బ్లూ కలర్‌లో అందుబాటులోకి రానుంది. అయితే గ్లోబల్‌ వేరియంట్ ఆధారంగా 10,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌ పైన పనిచేయనుందని తెలుస్తోంది.

Poco Pad 5G Tablet with 12 1 inch display to launch on august 23 in india

ఈ పోకో ట్యా్బ్లెట్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ నిర్వహించనున్నారు. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌ ఆధారంగా పోకో ప్యాడ్‌ 5G.. 12.1 అంగుళాల డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 16:10 ఆస్పెక్ట్ రేషియోతో అందుబాటులోకి వస్తుంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland ట్రిపుల్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది.

ఈ పోకో ప్యాడ్‌ 5G ట్యాబ్లెట్‌ గ్లోబల్‌ వేరియంట్ తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. దీని ఆధారంగా స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. 8GB LPDDR4x ర్యామ్‌ మరియు 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది.

దీంతోపాటు ఈ ప్యాడ్‌ ముందు, వెనుక 8MP కెమెరాలను కలిగి ఉంటుంది. 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 10,000mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ ట్యాబ్లెట్‌ బ్లూటూత్‌ 5.2, వైఫై 6 ఫీచర్‌లను కలిగి ఉంటుంది. మరియు డాల్బీ అట్మాస్‌ సపోర్టు తో స్వీకర్లతో విడుదల కానుంది.

ఈ పోకో ప్యాడ్‌ 5G ట్యాబ్లెట్‌ స్టోరేజీ వేరియంట్‌లు సహా ధర వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్‌ ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్‌ కానుంది. మరియు సేల్‌ ఫ్లిప్‌ కార్ట్‌ ద్వారా నిర్వహించనున్నారు. అయితే సేల్‌ తేదీ వెల్లడి కావాల్సి ఉంది. దీంతోపాటు స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco Pad 5G Tablet to launch on august 23 in india specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X