12.1 అంగుళాల డిస్‌ప్లే, 10000mAh బ్యాటరీతో పోకో ప్యాడ్... స్పెసికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!
పోకో సంస్థ ఇటీవల పోకో ప్యాడ్ ను విడుదల చేసింది. అయితే ఈ ప్యాడ్ భారత్ మినహా ప్రపంచంలోని అనేక దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే త్వరలో భారత్ లో విడుదల కానుందని తెలుస్తోంది. ఇటీవలే పోకో ప్యాడ్ 5G ( Poco Pad 5G variant ) వేరియంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్‌ను (BIS) పొందింది. దీని ఆధారంగా భారత్‌లో విడుదల కానుందని ధ్రువీకరణ అయింది. పోకో మే నెలలో పోకో ప్యాడ్ వైఫై వేరియంట్ ను విడుదల చేయగా.. త్వరలో 5G వేరియంట్‌ను విడుదల చేయనుంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ (BIS) వెబ్ సైట్ లో 24074PCD2I మోడల్ నంబర్‌తో కనిపించింది. ఈ లిస్టింగ్ ఆధారంగా పోకో ప్యాడ్ 16:10 ఆస్పెక్ట్ రేషియోను కలిగి ఉంటుంది. అయితే ఈ పోకో ప్యాడ్ భారత్ మార్కెట్‌లోకి కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందో వెల్లడి కాలేదు.

పోకో ప్యాడ్ 5G అంచనా స్పెసిఫికేషన్‌లు :
గత నెలలో చైనాలో లాంచ్ అయిన రెడ్‌మి ప్యాడ్ ప్రో 5G కు రీ బ్రాండెడ్ వెర్షన్ గా పోకో ప్యాడ్ లాంచ్ కానుందని తెలుస్తోంది. పోకో తొలి ప్యాడ్ 2560*1600 పిక్సల్ రిజల్యూషన్‌తో 12.1 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది.
ఈ పోకో ప్యాడ్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 చిప్ సెట్ పైన పనిచేస్తుంది. మరియు 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS పై పనిచేయనుంది.
దీంతోపాటు ఈ పోకో ప్యాడ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 10,000mAh బ్యాటరీతో విడుదల కానుంది. కెమెరాల పరంగా ఈ ప్యాడ్ వెనుక వైపు 8MP కెమెరా మరియు ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంటుంది. పోకో ప్యాడ్ గ్లోబల్ వేరియంట్ ధర $330 ( భారత కరెన్సీ ప్రకారం రూ.27500 ) గా ఉంది.
ఈ పోకో ప్యాడ్ 5G వేరియంట్ విడుదల తేదీని ఇంకా సంస్థ వెల్లడించలేదు. దీంతోపాటు పైన తెలిపిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతోపాటు ధర వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌ల వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








