POCO నుంచి తొలిసారిగా ఇయర్‌బడ్స్.. 30 గంటల బ్యాటరీ, ENC ఫీచర్..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ POCO భారత్‌లో స్మార్ట్‌ఫోన్లను మాత్రమే విక్రయిస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇతర ఉత్పత్తులను విడుదల చేస్తున్నా... భారత మార్కెట్‌లో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి గ్యాడ్జెట్లను విడుదల చేయలేదు. అయితే పోకో సంస్థ భారత్‌లో తొలిసారిగా ఇయర్‌బడ్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
దీనిపై అనేక వార్తలు వస్తున్నాయి. పోకో ఇయర్‌బడ్స్ వచ్చే వారంలోనే భారత్‌లో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఇయర్‌బడ్స్ ధర, ఫీచర్లు, రంగు సహా ఇతర సమాచారం లీక్ అయింది.

91మొబైల్స్ నివేదిక ప్రకారం POCO Pods TWS ను జులై 28న భారత్ మార్కెట్లోకి పోకో సంస్థ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్లు కాకుండా పోకో సంస్థ తొలిసారిగా భారత్‌లో ఇయర్‌బడ్స్‌ను విడుదల చేస్తుంది. అది కూడా బడ్జెట్ ధరలోనే తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
పోకో Pods ఇయర్‌బడ్స్ ధర రూ.1500 నుంచి రూ.2000 మధ్యన ఉండనున్నట్లు తెలుస్తోంది. అంటే ఎంట్రీ లెవల్‌లో బడ్జెట్ ధరకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ రేంజ్ ధరలో ఇయర్‌బడ్స్ కోసం వెతుకుతున్న వారికి ఇవి మంచి ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు విడుదల చేస్తుందనే పేరును పోకో సంపాదించుకుంది. అయితే త్వరలో విడుదల కానున్న ఇయర్‌బడ్స్ ఫీచర్లు కూడా ఆకట్టుకొనే అవకాశం ఉంది. పోకో పాడ్స్ TWS రెడ్‌మీ బడ్స్ 4 యాక్టివ్ ఇయర్‌బడ్స్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానున్నట్లు తెలుస్తోంది.
రెడ్‌మీ బడ్స్ 4 యాక్టివ్ ఇయర్‌బడ్స్ జూన్‌లో భారత్‌లో విడుదల అయ్యాయి. ఈ రెండింటి మధ్య డిజైన్‌లో చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అయితే పోకో ఇయర్‌బడ్స్ డ్యూయల్ టోన్ ఫినిష్‌ను కలిగి ఉన్నాయి. పోకో పాడ్స్ TWS నలుపు, పసుపు రంగును కలిగి ఉన్నాయి. రబ్బరు, ఛార్జింగ్ కేస్‌లో కొంత భాగం పసుపు మరియు పూర్తి నలుపు రంగులో లభించనున్నాయి.
కొన్ని లీక్‌ల ప్రకారం పోకో ఇయర్‌బడ్స్ 12mm ఆడియో డ్రైవ్‌లు, స్వెట్, స్ల్పాష్ రెసిస్టెన్స్‌లో IPX4 రేటింగ్‌తో రానున్నాయి. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC), బ్లూటూత్ 5.3, గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఫీచర్లను కలిగి ఉంటాయి. మరియు 30 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
అయితే పోకో పాడ్స్ TWS ఇయర్‌బడ్స్ వివరాలు, ఫీచర్లపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే విడుదలకు వారం రోజుల సమయం ఉంది. ధర, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది. ఏ ఈ కామర్స్ ఫ్లాట్‌పాంలో లభిస్తుంది వంటి వివరాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








