Home
Gadgets

6 గంటల బ్యాటరీ లైఫ్‌, TWS మోడ్‌, పోర్టబుల్‌ డిజైన్‌తో బ్లూటూత్‌ స్పీకర్.. ధర, సేల్‌ వివరాలు..!

భారత్‌ మార్కెట్‌ లో పోర్టబుల్‌ స్పీకర్‌లకు భారీ డిమాండ్‌ ఉంటోంది. ఇంట్లో ఖాళీ సమయాల్లో చాలా మంది నచ్చిన పాటలు వినేందుకు పోర్టబుల్‌ స్వీకర్‌లను ఉపయోగిస్తుంటారు. దీంతోపాటు చిన్న చిన్న పార్టీల్లోనూ వినియోగిస్తుంటారు. అందువల్ల అనేక సంస్థలు వీటిని తక్కువ ధరల్లో విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ పోర్ట్రోనిక్స్‌ పోర్టబుల్‌ స్వీకర్‌ ను (Portronics Fynix speaker launched in india) భారత్‌ మార్కెట్‌ లో లాంచ్‌ చేసింది. ఈ స్పీకర్ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరారు.

స్టీరియో అనుభూతి :
పోర్ట్రోనిక్స్ ఫినిక్స్‌ పేరుతో బ్లూటూత్‌ స్పీకర్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్పీకర్‌ 30W ఆడియో అవుట్‌పుట్‌ ను అందిస్తుందని పోర్ట్రోనిక్స్‌ చెబుతోంది. స్టీరియో అనుభూతిని అందిస్తుందని చెబుతోంది. ఈ సౌండ్‌ బాక్స్‌ అధిక సమయం బ్యాటరీ లైఫ్‌ ను కూడా అందిస్తుందని సంస్థ తెలిపింది.

Portronics Fynix portable bluetooth speaker launched1

ఆకట్టుకొనే డిజైన్‌ తో విడుదల :
పోర్ట్రోనిక్స్ ఫినిక్స్ స్పీకర్‌ డిజైన్ పరంగా ఈ స్పీకర్ ఆకట్టుకుంటుంది. మరియు రబ్బర్ స్ట్రిప్‌ ను కలిగి ఉంది. ఇతర ప్రాంతాలకు సులభంగా తీసుకెళ్లేలా డిజైన్‌ చేశారు. ఈ స్పీకర్‌ స్ప్లాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. అయితే రేటింగ్‌ వివరాలను సంస్థ వెల్లడించలేదు.

30W ఆడియో అవుట్‌పుట్‌ :
ఈ స్పీకర్‌ డ్యూయల్‌ ప్యాసివ్‌ రేడియేటర్స్‌ ను కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది. ఇవి మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తాయని తెలిపింది. మొత్తంగా ఈ పోర్ట్రోనిక్స్‌ ఫినిక్స్‌ బ్లూటూత్‌ స్పీకర్‌ 30W ఆడియో అవుట్‌పుట్‌ ను అందిస్తుంది. యూజర్లు మంచి అనుభూతిని పొందుతారని చెబుతోంది.

బ్లూటూత్‌ కనెక్టివిటీ :
స్పీకర్‌ కు అమర్చిన రబ్బర్‌ స్ట్రిప్‌ పైన అనేక బటన్స్‌ ను గుర్తించవచ్చు. పవర్‌, బ్లూటూత్‌ పెయిరింగ్‌, ప్లేబ్యాక్‌, TWS మోడ్, వాల్యూమ్ కంట్రోల్‌ బటన్స్‌ ఉన్నాయి. ఈ స్పీకర్‌ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉంది. ఫలితంగా ఇతర ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్‌ తో సులభంగా కనెక్ట్‌ చేయవచ్చు.

Portronics Fynix portable bluetooth speaker launched1

ప్రత్యేక ఫీచర్‌ ఎలా ఉపయోగపడుతుంది? :
ఈ స్పీకర్‌ USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. పోర్ట్రోనిక్స్‌ ఫినిక్స్‌ సౌండ్‌ స్పీకర్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 6 గంటల పాటు వినియోగించుకోవచ్చు. TWS మోడ్‌ లో రెండు ఫినిక్స్‌ స్పీకర్‌లను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఫలితంగా మరింత మెరుగైన ఆడియో అనుభూతి కలుగుతుందని సంస్థ చెబుతోంది.

పోర్ట్రోనిక్స్‌ ఫినిక్స్‌ పోర్టబుల్‌ స్పీకర్‌ ధర, సేల్‌ వివరాలు :
పోర్ట్రోనిక్స్‌ ఫినిక్స్‌ బ్లూటూత్‌ పోర్టబుల్‌ స్పీకర్‌ (Portronics Fynix Speaker Price and sale) ధర రూ.2599 గా ఉంది. భారత్‌ మార్కెట్‌ లో ఈ స్పీకర్ కేవలం బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌ లో అందుబాటులోకి ఉందని సంస్థ తెలిపింది.

ఈ స్పీకర్‌ ను పోర్ట్రోనిక్స్‌ ఇండియా వెబ్‌సైట్‌ తోపాటు ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ లో (Amazon) ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. ఈ స్పీకర్‌ కొనుగోలుపై 12 నెలల వరకు వారంటీని అందిస్తుందని సంస్థ వెల్లడించింది. పోర్ట్రోనిక్స్ ఫినిక్స్‌ బ్లూటూత్‌ స్పీకర్‌ ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్‌ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.

More from GizBot

Best Mobiles in India

English summary
Portronics Fynix portable bluetooth speaker launched at rs2599 price and sale is live in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X