Home
Gadgets

50 గంటల ప్లే బ్యాక్ టైమ్ తో ఇయర్ బడ్స్! రూ.1099కే పొందండి

By Maheswara

పోర్ట్రోనిక్స్ హార్మోనిక్స్ ట్విన్స్ S6 ఇయర్‌బడ్స్ ఇండియాలో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. అంతే కాక లాంచ్ ఆఫర్ ద్వారా అద్భుతమైన ఆఫర్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం, ఈ ఇయర్ బడ్స్ యొక్క ప్రారంభ ధర సగానికి సగం తగ్గించబడింది. దీని ధర మరియు ఇతర ఫీచర్లపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం, మార్కెట్లో ఉన్న చాలా ఇయర్‌బడ్‌లు ENC మరియు తక్కువ లేటెన్సీ వంటి అనేక కొత్త టెక్నాలజీతో వస్తున్నాయి. అయితే అవి బ్యాటరీ పరంగా చాలా వెనకబడి ఉన్నాయి. ఎందుకంటే బ్లూటూత్ ఇయర్‌బడ్‌లకు బ్యాటరీ చాలా ముఖ్యమైనది. అందువల్ల, మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌తో ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయడంపై ప్రజల దృష్టి మళ్లింది.

Portronics Harmonics Twins S6 Earbuds With 50Hours Playback Time, Priced At Rs.1099 Launched.

దీన్ని అర్థం చేసుకున్న కంపెనీలు ప్రస్తుతం ఎక్కువ గంటలు బ్యాటరీ బ్యాకప్ అందించే ఇయర్‌బడ్‌లను అభివృద్ధి చేసి విక్రయిస్తున్నాయి. ఆ కోణంలో, పోర్ట్రోనిక్స్ 50 గంటల వరకు బ్యాకప్‌ను అందించే బడ్జెట్ ధర కలిగిన ఇయర్‌బడ్‌లతో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో భాగంగానే, Portronix Harmonics Twins S6 ఇయర్‌బడ్‌లు పరిచయం చేయబడ్డాయి.

Portronix Harmonics Twins S6 ఇయర్‌బడ్‌ల ఫీచర్‌లు: మార్కెట్‌లోని ఇతర ఇయర్‌బడ్‌లతో పోలిస్తే ఈ ఇయర్‌బడ్‌లు తక్కువ బరువుతో నిర్మించబడి ఉంటాయి. ఇవి 10mm డైనమిక్ డ్రైవర్లతో వస్తుంది. బ్యాలెన్స్‌డ్ బాస్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. బాస్ సౌండ్ ను ఎక్కువగా ఇష్టపడే వారికి ఇది చాలా గొప్ప ఎంపిక అవుతుంది.

ఇవి, బ్లూటూత్ v5.3 కనెక్టివిటీతో వస్తాయి. దీనికి క్విక్ కనెక్ట్ సపోర్ట్ కూడా ఉంది. క్వాడ్ మైక్ క్రిస్టల్ క్లియర్ కాలింగ్ అనుభవం కోసం ENC టెక్నాలజీ కూడా ఇందులో వస్తుంది. ఇది 650 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జింగ్‌తో 50 గంటలపాటు ఉపయోగించుకోవచ్చు. ఇందులో డీప్ బాస్ టెక్నాలజీని ఉపయోగించారు మరియు ఇవి రెండు మైక్రోఫోన్‌లతో వస్తాయి.

ఇంకా వీటి ప్రత్యేకత చెప్పుకోవాలనుంటే, ఈ ఇయర్ బడ్ లను 10 నిమిషాల పాటు ఛార్జింగ్ చేస్తే 10 గంటల పాటు కంటిన్యూగా వాడుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కల్పించబడింది. ఇది టైప్ సి పోర్ట్‌తో వస్తుంది. ఈ ఇయర్ బడ్స్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ మరియు టచ్ కంట్రోల్స్‌తో కూడా వస్తాయి.

ఈ ఇయర్ బడ్స్ నలుపు మరియు తెలుపు 2 రంగులలో అందుబాటులో ఉంటాయి. ఇవి రూ.2,999 రూపాయల ధర కలిగిన పోర్ట్రోనిక్స్ ట్విన్స్ S6 ఇయర్‌బడ్స్ ఇప్పుడు లాంచ్ ఆఫర్ ద్వారా కేవలం రూ.1099 ధరకు అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది. ఇది IPX4 స్ప్లాష్ మరియు చెమట నిరోధకతతో వస్తుంది.

ఈ ఇయర్ బడ్స్ ను మీరు Portronics, Amazon, Flipkart ల నుండి ఆర్డర్ చేసి కొనుగోలు చేయవచ్చు. రానున్న కొద్ది వారాల పాటు ఇదే ధర కొనసాగే అవకాశం ఉంది. అలాగే, టెక్నాలజీ , గాడ్జెట్ లకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం మా గిజబోట్ ఛానెల్‌ని చూస్తూ ఉండండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

Best Mobiles in India

English summary
Portronics Harmonics Twins S6 Earbuds With 50Hours Playback Time, Priced At Rs.1099 Launched.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X