Just In
- 30 min ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 3 hrs ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 5 hrs ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 22 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
Don't Miss
- News
అనూహ్యమైన మలుపులు తీసుకుంటున్న ఏపీ రాజకీయం
- Sports
WPL:మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్.. బీసీసీఐకి రూ.4670 కోట్లు!
- Finance
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. బ్యాంక్ స్టాక్స్ ఫసక్
- Movies
Varasudu Collections: వారసుడికి మరో దెబ్బ.. 14వ రోజు దారుణంగా.. అన్ని కోట్లు వస్తేనే దిల్ రాజు సేఫ్
- Lifestyle
గర్భాధారణ సమయంలో తల్లికి రక్తహీనత ఉంటే బిడ్డకు కూడా ప్రమాదమే..ఈ ఫుడ్ తింటే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
రూ.799 లోనే బెస్ట్ నెక్‌బ్యాండ్ Earphones.. కొద్ది రోజుల వరకే ఆఫర్!
పోర్ట్రోనిక్స్(Portronics) కంపెనీ తాజాగా మరో ఆడియో బేస్డ్ ప్రొడక్ట్‌ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటికే, ఈ కంపెనీ ఇటీవల ఈ Muffs A వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఇప్పుడు కొత్త Harmonics Z2 నెక్‌బ్యాండ్ Earphonesను భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నెక్‌బ్యాండ్ Earphones తక్కువ ధరలో మంచి ఫీచర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇవి ఒకసారి ఛార్జ్ చేయడం ద్వారా దాదాపు 30 గంటల పాటు బ్యాటరీ లైఫ్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు వీటి ధరలు, పూర్తి స్పెసిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం.

Harmonics Z2 నెక్‌బ్యాండ్ ధరలు:
ప్రస్తుతం, Portronics Harmonics Z2 నెక్‌బ్యాండ్ Earphones అసలు ధరను రూ.1,999గా కంపెనీ నిర్ణయించింది. కానీ, ప్రస్తుతం ఇవి ప్రారంభ ధర(ఇంట్రడ్యూసరీ) ట్యాగ్‌తో రూ.799 కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇయర్‌ఫోన్‌లు ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర ప్రముఖ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు కంపెనీ పేర్కొంది.

Harmonics Z2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
Portronics కంపెనీ నుంచి విడుదలైన ఈ కొత్త హియరబుల్స్ వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన నెక్‌బ్యాండ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇంకా, కొత్త వైర్‌లెస్ Earphones 12ఎమ్ఎమ్ ఆడియో డ్రైవర్‌లను కూడా కలిగి ఉంటాయి. మరియు ఇవి ఆటో ENC సపోర్ట్ (ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలింగ్) ఫీచర్‌తో వస్తున్నాయి. ఇది బిజీగా ఉండే ప్రాంతాల్లో డిస్టర్బెన్స్ ఫ్రీ కాలింగ్‌ను అందించడంలో సహాయపడుతుంది.
ఇంకా ఛార్జ్ విషయానికొస్తే.. ఇది 250mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది. దీన్ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడం ద్వారా వినియోగదారులు గరిష్టంగా 30 గంటల వరకు ఆడియో ప్లేబ్యాక్‌ని ఎంజాయ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. హార్మోనిక్స్ Z2ని USB టైప్ C పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు, అది వేగవంతమైన ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇవి కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ ద్వారా దాదాపు 3 గంటల అదనపు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది.
హార్మోనిక్స్ Z2 ఇయర్‌ఫోన్స్‌ను రోజువారీ ఉపయోగం కోసం నాణ్యత కలిగిన సిలికాన్‌తో రూపొందించడం జరిగింది. మరియు మెటల్ ఇయర్‌బడ్‌లు మెరుగైన ఫిట్‌ను కలిగి ఉంటాయి. వినియోగదారులకు మెరుగైన సౌలభ్యం కోసం స్కిన్ కు అనుకూలమైన ఇయర్ బడ్స్‌ను వీటికి అందిస్తున్నారు. డిజైన్ కు సంబంధించి మరో గుర్తించదగిన అంశం ఏమిటంటే, ఇయర్‌బడ్స్‌పై ఉండే మాగ్నెటిక్ లాక్ ఫీచర్ను అందిస్తున్నారు. తద్వారా ఇయర్‌ఫోన్‌లు పడిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
ఈ Earphones మన మొబైల్ లేదా ఇతర డివైజ్‌లతో వేగంగా పెయిరింగ్ అవడానికి లైట్నింగ్ కనెక్ట్ ఫీచర్ కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఇవి బ్లూటూత్ 5.2, సిరి మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌ల ద్వారా ప్రాథమిక వాయిస్ కంట్రోలింగ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి. ప్రస్తుతం, Portronics Harmonics Z2 నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ అసలు ధరను రూ.1,999గా కంపెనీ నిర్ణయించింది. కానీ, ప్రస్తుతం ఇవి ప్రారంభ ధర(ఇంట్రడ్యూసరీ) ట్యాగ్‌తో రూ.799 కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

అదేవిధంగా, పోర్ట్రోనిక్స్(Portronics) కంపెనీ నుంచి ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న Muffs A వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను గురించి కూడా తెలుసుకుందాం:
Portronics కంపెనీ Muffs A వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను బడ్జెట్ ధరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇవి కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్లను కలిగి ఉన్నాయి. Portronics కంపెనీ నుంచి విడుదలైన ఈ వైర్‌లెస్ హెడ్‌సెట్ 3.5ఎమ్ఎమ్ ఆక్స్ ఇన్ ఆడియో డ్రైవర్‌లను కూడా కలిగి ఉంటాయి. ఇవి బ్లూటూత్ 5.0 వర్షన్‌తో పని చేస్తాయి. హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ చేయడానికి ఈ హెడ్‌సెట్ బాగా ఉపయోగపడతాయి. మరియు ఇవి ఆటో ENC సపోర్ట్ (ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలింగ్) ఫీచర్‌తో వస్తున్నాయి. ఇది బిజీగా ఉండే ప్రాంతాల్లో డిస్టర్బెన్స్ ఫ్రీ కాలింగ్‌ను అందించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ Muffs A బ్లూటూత్ హెడ్‌సెట్ ధర అమెజాన్‌లో రూ.1699 కి కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470