Potronics నుంచి 4K అల్ట్రా HD రిజల్యూషన్‌తో రీఛార్జ్‌బుల్ ప్రొజెక్టర్.. ఫీచర్లు, ధర, సేల్ వివరాలు..!
ప్రముఖ గ్యాడ్జెట్‌ల తయారీ పోర్ట్రోనిక్స్ పోర్టబుల్ ప్రొజెక్టర్ ను (Portronics Pico 13 Portable Projector) భారత్‌లో లాంచ్ చేసింది. పోర్ట్రోనిక్స్ పికో 13 పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రొజెక్టర్ రీఛార్జ్‌బుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు 4K రిజల్యూషన్‌తో వీడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఈ ప్రొజెక్టర్ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి అనేక యాప్స్‌ను కలిగి ఉంటుంది. ఈ పోర్ట్రోనిక్స్ పోర్టబుల్ ప్రొజెక్టర్ 120 అంగుళాల వరకు వీడియోను ప్లే చేస్తుంది. మరియు ఇన్‌బిల్ట్ స్పీకర్లతో విడుదల అయింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
పోర్ట్రోనిక్స్ పికో 13 ప్రొజెక్టర్ స్పెసిఫికేషన్‌లు :
ఈ ప్రొజెక్టర్ డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. మరియు 3500 Lumens లైట్‌ను కలిగి ఉంది. ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్ 60Hz రీఫ్రెష్ రేట్‌తో 4K అల్ట్రా HD రిజల్యూషన్‌తో కంటెంట్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఈ ప్రొజెక్టర్ ప్రత్యేకమైన ఫోకస్ వీల్‌ను కలిగి ఉంది. దీని ద్వారా ప్రాజెక్షన్ లో మార్పులు చేసేందుకు అవకాశం ఉంది.

3m దూరం.. 120 అంగుళాల స్క్రీన్ :
ఈ పికో 13 పోర్టబుల్ ప్రొజెక్టర్ 1.3m నుంచి 3m దూరం వరకు ప్రొజెక్ట్ చేయగలదు. 0.5m దూరం వద్ద 20 అంగుళాల స్క్రీన్‌ను క్రియేట్ చేయగలదు. అదే 1.8m వద్ద 70 అంగుళాల స్క్రీన్ మరియు 3m వద్ద ఏకంగా 120 అంగుళాల స్క్రీన్ ప్రొజెక్షన్‌ను అందిస్తుంది.
ఇన్‌బిల్ట్ స్ట్రీమింగ్ యాప్‌లతో అందుబాటులోకి.. :
పోర్ట్రోనిక్స్ పికో 13 రీఛార్జ్‌బుల్ పొర్ట్రెయిట్ ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ ఆధారిత OS తో పనిచేస్తుంది. మరియు వైర్‌లెస్ కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ పికో 13 ప్రొజెక్టర్ డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సహా అనేక స్ట్రీమింగ్ యాప్‌లను సపోర్టు చేస్తుంది.
10 వాట్ ఇన్‌బిల్ట్ స్పీకర్లు :
ఈ పోర్ట్రోనిక్స్ పికో 13 ప్రొజెక్టర్ 10 వాట్ ఇన్‌బిల్ట్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ HDMI పోర్ట్, USB-A పోర్ట్, USB-C ఛార్జింగ్ పోర్ట్‌లను కలిగి ఉంది. రీఛార్జ్‌బుల్ బ్యాటరీ ప్రొజెక్టర్ బరువు 1.39kg గా ఉంది. పికో 13 డిజైన్ పరంగాను ఆకట్టుకొనే విధంగా ఉంది.
పోర్ట్రోనిక్స్ పికో 13 ప్రొజెక్టర్ ధర, సేల్ వివరాలు :
పోర్ట్రోనిక్స్ పికో 13 ప్రొజెక్టర్ ధర రూ.31,499 గా ఉంది. ప్రారంభ ఆఫర్ కింద ఈ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పోర్ట్రోనిక్స్ తెలిపింది. ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్‌ను ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








