45 గంటల బ్యాటరీ లైఫ్, హార్ట్ రేట్ మానిటర్‌తో Beats ఇయర్‌ఫోన్స్ విడుదల... సేల్ ప్రారంభం..!
భారత్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లతోపాటు హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్‌కు అధిక డిమాండ్ ఉంటోంది. అందువల్ల ఆడియో గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థలు ఈ ఉత్పత్తులపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. ఈ ఇయర్‌బడ్స్ ANC సహా ఇతర మెరుగైన ఫీచర్‌లతో అందుబాటులోకి వస్తున్నాయి. బ్లూటూత్ TWS బడ్స్‌కు కూడా అధిక డిమాండ్ ఉంటోంది. అయితే తాజాగా Beats సంస్థ పవర్‌బీట్స్ ప్రో 2 పేరుతో (Powerbeats Pro 2) ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ ఇయర్‌ఫోన్స్ ఆపిల్ H2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.
పవర్‌బీట్స్ ప్రో 2 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ బడ్స్ డ్యూయల్ ఎలిమెంట్ డైనమిక్ డయాఫ్రం ట్రాన్స్‌డ్యూసర్‌లను కలిగి ఉంది. ఫలితంగా అత్యంత నాణ్యమైన ఆడియోను అందిస్తుందని తెలుస్తోంది. ఇయర్‌బడ్స్‌లో ప్రతి బడ్‌లో మూడు మైక్‌లు ఉంటాయి. ఈ మైక్‌లు ఆప్టికల్ సెన్సార్‌లతో కూడిన ఇన్ ఇయర్ డిటెక్షన్ సహా హార్ట్ రేట్ మానిటరింగ్, యాక్సెలిరోమీటర్, గైరోస్కోప్ వంటి సెన్సార్‌లు ఉంటాయి.

ANC ఫీచర్ :
ఈ బడ్స్ అడాప్టివ్ ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్‌ను సపోర్టు చేస్తాయి. ఈ ఫీచర్ అడాప్టివ్ EQ, ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ను కలిగి ఉంటాయి. దీంతోపాటు డైనమిక్ హెడ్ ట్రాకింగ్ టెక్నాలజీ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. స్పేషియల్ ఆడియో ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.

బ్లూటూత్ కనెక్టివిటీ :
ఈ బీట్స్ ఇయర్‌ఫోన్స్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉంటాయి. ఈ బడ్స్ ఆపిల్, ఆండ్రాయిడ్ ఫోన్‌లను సపోర్టు చేస్తాయి. ఆండ్రాయిడ్ యూజర్లు ఆన్ ఇయర్ బటన్‌లతో మ్యూజిక్, వాల్యూమ్‌ను కంట్రోల్ చేయవచ్చు. దీంతోపాటు Siri ను కూడా వినియోగించుకోవచ్చు. Hey Siri లేదా Siri కమాండ్ ద్వారా యాక్టివ్ చేయవచ్చు.
వాటర్ రెసిస్టెంట్ :
ఈ బడ్స్‌ను ఆపిల్ డివైజ్‌లో వన్ టచ్ పెయిరింగ్, ఆటోమేటిక్ స్విచ్చింగ్, ఆడియో షేరింగ్ వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తాయి. దీంతోపాటు Siri ను కూడా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ బీట్స్ ఇయర్‌ఫోన్స్ IPX4 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి.
హార్ట్ రేట్ :
పవర్‌బీట్స్ ప్రో 2 ఇయర్‌బడ్స్ ద్వారా రియల్ టైంలో హార్ట్ రేట్ వివరాలను తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం LED ఆప్టికల్ సెన్సార్‌లను వినియోగించినట్లు సంస్థ తెలిపింది. ఈ వివరాలను పవర్‌బీట్స్ ప్రో 2 సపోర్టు చేసే యాప్స్ ద్వారా తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఓపెన్, నైక్ రన్ క్లబ్, Runna, Slopes, YaoYao యాప్స్ ద్వారా హార్ట్ రేట్ సహా ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. మరియు ఈ ఇయర్‌ఫోన్స్ ఆపిల్ H2 చిప్ పైన పనిచేస్తాయి. దీంతోపాటు ఈ బడ్స్ మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని సంస్థ చెబుతోంది.
ఈ ఇయర్‌ఫోన్స్ సింగిల్ ఛార్జింగ్‌తో 45 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని Beats సంస్థ చెబుతోంది. అయితే కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 90 నిమిషాల ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు. ఈ ఛార్జింగ్ కేస్ QI వైర్‌లైస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. మరియు USB- C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.
పవర్‌బీట్స్ ప్రో 2 ఇయర్‌బడ్స్ ధర భారత్ మార్కెట్‌లో రూ.29,900 గా ఉంది. ఈ ఆడియో గ్యాడ్జెట్ నాలుగు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. క్విక్ శాండ్, ఎలక్ట్రిక్ ఆరెంజ్, హైపర్ పర్పుల్, జెట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్‌ను బీట్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








