Home
Gadgets

రూ.1099 ధరకే ANC సపోర్టు, 40 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌తో నెక్‌బ్యాండ్‌ విడుదల..!

Probuds Wave 931 Neckband launched : భారత్‌ మార్కెట్‌ లో ప్రోబడ్స్‌ వేవ్‌ 931 నెక్‌బ్యాండ్ లాంచ్‌ అయింది. యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC), ఆకట్టుకొనే బ్యాటరీ లైఫ్‌ తో అందుబాటులోకి వచ్చింది. డిజైన్‌ పరంగానూ ఈ నెక్‌బ్యాండ్ ఆకట్టుకుంటుంది. రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటుందని సంస్థ చెబుతోంది. సాధారణంగా ప్రోబడ్స్‌ ఆడియో ఉత్పత్తులు మెరుగైన బ్యాటరీ లైఫ్‌తోపాటు ఆడియో అనుభూతిని కూడా అందిస్తాయని చెబుతోంది. ఈ నెక్‌బ్యాండ్‌ పూర్తి ఫీచర్లు, ధర, సేల్‌ వివరాలు.

ప్రోబడ్స్‌ వేవ్‌ 931 నెక్‌బ్యాండ్‌ పూర్తి వివరాలు :
ఈ నెక్‌బ్యాండ్‌ డీప్‌ బాస్‌ తో ( Deep Bass ) కూడిన 13mm డైనమిక్‌ డ్రైవర్లను కలిగి ఉంది. దీంతోపాటు యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ( ANC ) సపోర్టును కలిగి ఉంది. ట్రావెల్‌ లేదా ముఖ్యమైన పనుల సమయాల్లో కూడా మెరుగైన పనితీరును అందిస్తుంది. మెటాలిక్‌ ఫినిష్‌ ను కలిగి ఉంది. ఫలితంగా డిజైన్‌ పరంగానూ ఆకట్టుకుంటుంది.

Probuds Wave 931 Neckband

ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ :
దీంతోపాటు మెరుగైన వాయిస్‌ క్లారిటీ కోసం ఈ నెక్‌బ్యాండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ENC) ఫీచర్‌ ను కూడా కలిగి ఉంది. మొబైల్‌ గేమింగ్‌ లేదా వీడియో స్ట్రీమింగ్‌ సమయాల్లో మెరుగైన పనితీరు కోసం 45ms Low latency మోడ్‌ ను కలిగి ఉంది.

ఏకంగా 40 గంటల ప్లేబ్యాక్‌ టైమ్ :
ఈ నెక్‌బ్యాండ్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి ఏకంగా 40 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ ను (ANC Off) పొందవచ్చని సంస్థ తెలిపింది. అయితే ANC ఫీచర్‌ ను వినియోగిస్తున్నప్పుడు 31 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ను అందిస్తుందని సంస్థ తెలిపింది. ఈ నెక్‌బ్యాండ్‌ IPX5 వాటర్‌, చెమట నుంచి ప్రొటెక్షన్‌ ను అందిస్తుందని సంస్థ తెలిపింది.

10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో :
ఈ నెక్‌బ్యాండ్‌ USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ నెక్‌బ్యాండ్‌ ను పూర్తిగా ఛార్జింగ్‌ చేసేందుకు గంట సమయం పడుతుందని సంస్థ తెలిపింది. కేవలం 10 నిమిషాల ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో అనేక గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ ను అందిస్తుందని సంస్థ తెలిపింది.

డ్యూయల్‌ డివైజ్‌ పెయిరింగ్‌ :
మాగ్నటిక్‌ ఫీచర్‌ ను కలిగి ఉంది. రెండు ఇయర్‌బడ్స్‌ అటాచ్‌ చేస్తే నెక్‌బ్యాండ్‌ పవర్‌ ఆన్‌ అవుతుంది. డిటాచ్‌ చేయడం ద్వారా ఆఫర్‌ చేయవచ్చు. దీంతోపాటు బ్లూటూత్‌ 5.4 ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. డ్యూయల్‌ డివైజ్‌ పెయిరింగ్‌ ఫీచర్‌ ను కూడా కలిగి ఉంది.

ప్రోబడ్స్‌ వేవ్‌ 931 నెక్‌బ్యాండ్‌ ధర, సేల్‌ వివరాలు :
ప్రోబడ్స్‌ వేవ్‌ 931 నెక్‌బ్యాండ్‌ ధర రూ.1299 గా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్‌ లో భాగంగా రూ.1099 కే కొనుగోలు చేయవచ్చు. ఈ నెక్‌బ్యాండ్‌ సేల్‌ డిసెంబర్‌ 24 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వైలెట్‌ ఎక్లిప్స్‌, సెలెస్టియల్‌ క్రోమ్ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Probuds Wave 931 Neckband with ANC launched at Rs1099 price in india, features, sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X