క్వాల్కమ్ నుంచి కొత్త ప్రాసెసర్ Snapdragon 670

ప్రముఖ మొబైల్ చిప్‌‌ల తయారీ కంపెనీ క్వాల్కమ్ తన స్నాప్‌డ్రాగన్ 600 ప్రాసెసర్స్ సిరీస్ నుంచి సరికొత్త ప్రాసెసర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

|

ప్రముఖ మొబైల్ చిప్‌‌ల తయారీ కంపెనీ క్వాల్కమ్ తన స్నాప్‌డ్రాగన్ 600 ప్రాసెసర్స్ సిరీస్ నుంచి సరికొత్త ప్రాసెసర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 670 పేరుతో ఈ కొత్త ప్రాసెసర్ అందుబాటులో ఉంటుంది. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించుకునే విధంగా ఈ ప్రాసెసర్‌ను క్వాల్కమ్ అభివృద్థి చేసింది. క్వాల్కమ్ క్రయో సీపీయూ, క్వాల్కమ్ స్పెక్ట్రా ఐఎస్‌పీ, క్వాల్కమ్ ఏఐ ఇంజిన్, స్నాప్‌డ్రాగన్ ఎక్స్12 ఎల్టీఈ మోడెమ్ వంటి ఇంటిగ్రేటెడ్ ఆర్కిటెక్షర్స్‌తో ఈ చిప్‌సెట్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది.

హై-ఎండ్ డిజిటల్ సిగ్నెలింగ్ ప్రాసెసింగ్..

హై-ఎండ్ డిజిటల్ సిగ్నెలింగ్ ప్రాసెసింగ్..

ఈ సరికొత్త మొబైల్ ప్లాట్‌ఫామ్‌కు ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్షురర్స్ మరిన్ని ఫీచర్లను జత చేసుకోవచ్చని క్వాల్కమ్ చెబుతోంది. క్వాల్కమ్ చెబుతోన్న దాని ప్రకారం ఈ సీపీయూ రెండు పెర్ఫామెన్స్ కోర్‌(అప్ టూ 2.0గిగాహెట్జ్)లతో పాటు 6 ఎఫీషియన్సీ (అప్ టూ 1.7గిగాహెట్జ్) కోర్స్‌ను ఉపయోగించుకుటుంది. హై-ఎండ్ మొబైల్ ప్లాట్‌ఫామ్స్ మాదిరిగానే స్నాప్‌డ్రాగన్ 670 చిప్‌సెట్ కూడా అదే విధమైన డిజిటల్ సిగ్నలింగ్ ప్రాసెసింగ్(క్వాల్కమ్ హెక్సాగన్ 685 డీఎస్‌పీ)ను వినియోగించుకోగలుగుతుందట.

 

 

1.8 రెట్ల అధికమైన పనితీరు..

1.8 రెట్ల అధికమైన పనితీరు..

ఈ చిప్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన మూడవ తరం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ మునుపటి జనరేషన్‌తో పోలిస్తే 1.8 రెట్ల అధికమైన పనితీరును కనబర్చగలుగుతుందని క్వాల్కమ్ వెల్లడించింది. స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్‌తో రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో అల్ట్రా హెచ్‌డి వీడియోలను క్యాప్చుర్ చేసుకునే వీలుంటుందట. ఇదే సమయంలో 25 మెగా పిక్సల్ సింగ్ కెమెరా లేదా 16 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరాలను ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేయగలుగుతుందట.

600 ఎంబీపీఎస్ వరకు డౌన్‌లోడ్ స్పీడ్స్

600 ఎంబీపీఎస్ వరకు డౌన్‌లోడ్ స్పీడ్స్

X12 ఎల్టీఈ మోడెమ్‌తో ఎక్విప్ చేయబడిన ఈ ప్రాసెసర్ 600 ఎంబీపీఎస్ వరకు డౌన్‌లోడ్ స్పీడ్‌లను సపోర్ట్ చేయగలుగుతుంది. ఇక అప్‌లోడ్ స్పీడ్ 150ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్ తో రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో మ్యూజిక్ అలానే వీడియోలను అంతరాయం లేకుండా ఆస్వాదించవచ్చు.

 

 

క్వాల్కమ్, మీడియాటెక్‌ల మధ్య హోరాహోరీ పోరు..

క్వాల్కమ్, మీడియాటెక్‌ల మధ్య హోరాహోరీ పోరు..

స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్‌ల విభాగంలో ప్రస్తుతం నడుస్తోన్న ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే క్వాల్కమ్, మీడియాటెక్‌ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. క్వాల్కమ్ కంపెనీ తయారు చేసే మొబైల్ ప్రాసెసర్లు అమెరికా సహా యూరోప్ దేశాల్లో బాగా పాపులర్ కాగా, మీడియాటెక్ అభివృద్ది చేస్తోన్న మొబైల్ ప్రాసెసర్లు దక్షిణ ఆసియా మార్కెట్లో అత్యధిక మార్కెట్ వాటాను కొల్ల గొడుతున్నాయి. క్వాల్కమ్ కంపెనీ తయారు చేసే మొబైల్ ప్రాసెసర్లు అమెరికా సహా యూరోప్ దేశాల్లో బాగా పాపులర్ కాగా, మీడియాటెక్ అభివృద్ది చేస్తోన్న మొబైల్ ప్రాసెసర్లు దక్షిణ ఆసియా మార్కెట్లో అత్యధిక మార్కెట్ వాటాను కొల్ల గొడుతున్నాయి.

నెం.1 స్థానంలో క్వాల్కమ్

నెం.1 స్థానంలో క్వాల్కమ్

మీడియోటెక్ ప్రాసెసర్‌లతో పోలిస్తే క్వాల్కమ్ ప్రాసెసర్లు ఖరీదైనవిగా ఉండటంతో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్షురర్స్, ఈ ప్రాసెసర్‌లతో ఫోన్‌లను తయారుచేసుందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ పాయింట్‌ను క్యాష్ చేసుకుంటున్న మీడియాటెక్ చౌక ధరల్లో ప్రాసెసర్‌లను తయారు చేస్తూ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలను తనవైపు తిప్పుకుంటోంది. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతోన్న చాలా వరకు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ ప్రాసెసర్‌లతోనే వస్తున్నాయి. మీడియోటెక్ ప్రాసెసర్‌లు మార్కెట్‌ను ముంచెత్తే ప్రయత్నం చేస్తున్నప్పటికి మిడ్‌రేంజ్ అలానే హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో క్వాల్కమ్ నెం.1 స్థానంలో కొనసాగుతూనే ఉంది.

 

 

Best Mobiles in India

English summary
Qualcomm announces Snapdragon 670 processor, to power mid-range smartphones.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X