Home
Gadgets

రక్షా బంధన్ కానుకగా ఇవ్వడానికి, బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఇవే !

By Maheswara

భారతదేశ సంస్కృతిని మేళవించే పండుగలలో రక్షా బంధన్ ఒక ప్రధాన ఆచారం. ఈ పండుగ అన్న చెల్లెళ్ళ మరియు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమ ఆప్యాయతలకు గుర్తుగా జరుపుకుంటారు. ఈ రాఖి పండుగ రోజున ఒక సోదరి రాఖీని తన సోదరుడికి కడుతుంది మరియు అతను ఆమెకు ప్రతిఫలంగా ఏదైనా బహుమతిగా ఇవ్వాలి. ప్రజలు సాధారణంగా స్వీట్లు, పువ్వులు లేదా చాక్లెట్ వంటి వాటిని బహుమతిగా ఇస్తారు. ఈ సంవత్సరం, మీ సోదరి ఆరోగ్యాన్ని ఎప్పుడు గమనిస్తూ హెచ్చరించే విధంగా ఉండటానికి సహాయపడే స్మార్ట్ వాచ్‌ను బహుమతిగా ఇవ్వండి.

ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లు

కాబట్టి, ఒక సోదరుడు తన సోదరికి బహుమతిగా ఇవ్వగల ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లు ఇక్కడ ఉన్నాయి.సోదరుడు సోదరికి కాకఈ వాచ్ లను ఒక సోదరి తన సోదరుడికి కూడా బహుమతి రూపంలో ఇవ్వవచ్చు.

Amazfit T-Rex

Amazfit T-Rex

Amazfit T-Rex చాలా కఠినమైన, మన్నిక గల స్మార్ట్‌వాచ్, ఇది ధర రూ. 9,999 వద్ద లభిస్తుంది.  మేము ఇటీవల ఈ మోడల్‌ను సమీక్షించాము,ఇది చాలా గొప్ప పనితీరును కనబరిచింది.బ్యాటరీ మన్నిక కూడా ఎక్కువ సమయం అందిస్తుంది. రూ. 10,000 ధర లోపు బెస్ట్ స్మార్ట్ ‌వాచ్‌లలో ఇది ఒకటి.

Fitbit Ionic

Fitbit Ionic

Fitbit Ionic  రూ. 15,990  వద్ద కొనుగోలు చేయవచ్చు మరియు ఇది క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ కలర్ డిస్ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ మరియు iOS స్మార్ట్‌ఫోన్‌లతో బాగా పనిచేస్తుంది.

Fossil Q Explorist Gen 3

Fossil Q Explorist Gen 3

Fossil Q Explorist Gen 3 సాదా సీదా గా కనిపించే ఈ స్మార్ట్‌వాచ్ మంచి ఫీచర్లతో వస్తుంది. మరియు దీని ధర రూ. 6,782 గా ఉంటుంది. క్లాసిక్ రిస్ట్ వాచ్ స్టైల్ డిజైన్ లో చూడటానికి,ధరించటానికి ఎంతో హుందాగా ఉంటుంది. Google WearOS పై ఆధారపడి ఇది పనిచేస్తుంది, అలాగే ఎక్కువసంఖ్యలో అప్ లను ఇందులో వాడవచ్చు.

Samsung Galaxy Watch Active2

Samsung Galaxy Watch Active2

Samsung Galaxy Watch Active2 ఇది ధర రూ. 24,090 వద్ద అమ్ముడవుతూ ఉంది.ఈ గడియారం వృత్తాకార టచ్ స్క్రీన్  డిస్ప్లే ను కలిగి ఉంటుంది. మరియు ఇది  Android మరియు iOS పరికరాలతో బాగా అనుసంధానించబడి పనిచేస్తుంది.

Fossil Gen 5

Fossil Gen 5

Fossil Gen 5  ప్రస్తుతం రూ. 22,995 ధర తో లభిస్తుంది.మరియు మునుపటి తరం మోడల్‌తో పోల్చినప్పుడు మెరుగైన బ్యాటరీ లైఫ్  మరియు పనితీరును మెరుగు పరిచే విధంగా ఇది రూపొందించబడింది.

Apple Watch

Apple Watch

ఆపిల్ వాచ్ సిరీస్ 3 రూ. 23,900 గా ఉంది. ఇది ఆపిల్ వాచ్ సిరీస్ 5 తో సమానంగా కనిపిస్తుంది కానీ సిరీస్ 5 వేరియంట్‌తో సగం ఖర్చవుతుంది. ఇది జలనిరోధితమైనది మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Amazfit GTR

Amazfit GTR

అమాజ్ ఫిట్ GTR  కూడా చూడడానికి  ఆపిల్ వాచ్ లాగా చాలా సారూప్యతో కనిపిస్తుంది. కానీ ఆపిల్ వాచ్ మాదిరిగా కాకుండా, GTR ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ పరికరాల రెండిటి తో కూడా బాగా పనిచేస్తుంది.

Samsung Galaxy watch

Samsung Galaxy watch

శాంసంగ్ గెలాక్సీ వాచ్ ప్రీమియం స్టైల్ తో వస్తుంది మరియు ఇది ధర రూ. 26.635 వద్ద అమ్ముడవుతుంది. ఇది బంగారంతో తయారు చేసిన సాధారణ గడియారం వలె కనిపించడం దీని ప్రత్యేకత.

Honor Watch Magic

Honor Watch Magic

హానర్ వాచ్ మ్యాజిక్ ధర కేవలం రూ. 7,999 గా ఉంటుంది. మరియు ఇది డ్యూయల్-టోన్ రిస్ట్ బ్యాండ్‌తో వస్తుంది.ఇది ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాల రెండిటి తో ఉపయోగించవచ్చు.

Puma PT9100

Puma PT9100

ప్యూమా PT9100 కూడా గూగుల్ యొక్క WearOS పై ఆధారపడి పనిచేస్తుంది. భారతదేశంలో దీని ధర రూ.13,995 గా ఉంది.

Best Mobiles in India

English summary
Raksha Bandan 2020: Raksha Bandhan Gift Ideas For Your Sister 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X