రాఖీ కట్టిన తోబుట్టువులకు స్పెషల్ గిఫ్ట్ !

Posted By: Madhavi Lagishetty

రాఖీ పండగ...ఇది కేవలం సాంప్రదాయ పండుగే కాదు. అన్నాచెల్లెల అనురాగాన్ని ప్రతిబింబింపజేసే పండుగ. అక్కాచెల్లెల్లు..అన్నాదమ్ములకు రాఖీలను కట్టడం ప్రతీతి. రాఖీకవచాన్ని కట్టిన అక్కాచెల్లెల్లకు సోదరులు ఏదైన బహుమతి అందజేస్తారు. అయితే ఈ రక్షాబంధన్ కు మీరు మీ సోదరి కోసం గొప్ప బహుమతిని ఇవ్వండి.

రాఖీ కట్టిన తోబుట్టువులకు స్పెషల్ గిఫ్ట్ !

మీ సోదరికి భిన్నమైన బహుమతిని ఇవ్వాలనకుంటే...వారి లైవ్ స్టైల్ కు తగ్గట్టుగా ఉండే గిఫ్ట్ ను సెలక్ట్ చేయండి. అయితే ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియక తికమక పడే సోదరులు...అద్భుతమైన గిఫ్ట్ జాబితా మీకోసం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూఈ బూమ్ 2...

ఇది ఎక్కువగా ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఉపయోగపడుతుంది. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఎక్కువగా మ్యూజిక్ ను ఇష్టపడేవారికి దీన్ని గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. చూడటానికి అందంగా కనిపిస్తుంది. బ్లూటూత్ స్పీకర్ల కంటే ఎక్కువ ధ్వనిని అందిస్తాయి. ఐపిఎక్స్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. వాటర్ లో పడినా...బేఫికర్ గా ఉండొచ్చు. మ్యూజిక్ కంట్రోల్ కోసం డివైస్ పై ప్రత్యేక బటన్లను ఏర్పాటు చేశారు. బ్రెయిన్ ఫ్రీజ్ రంగులో ఉంటుంది.

ధర రూ. 15,995 .

గేమర్ లాజిటెక్ G310...

మీ సోదరునికి గేమ్స్ అంటే ఇష్టమా?అయితే లాజిటెక్ జి310 మెకానికల్ కీబోర్డ్ ను గిఫ్ట్ గా ఇవ్వండి. ఈ కీబోర్డ్ ఒక గేమ్ స్వర్గాన్ని తలపిస్తుంది. గేమ్స్ అంటే ఇష్టపడే మీ తోబుట్టువులకు ఇస్తే...చాలా హ్యాపీగా ఫీలవుతారు.

ధర రూ. 8,795

ఒప్పో ఎఫ్ 3...

ఈ రక్షాబంధన్ కు మీ సోదరికి స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకుంటే...ఒప్పో కెమెరా ఫోన్ ను కొనివ్వండి. ఎందుకంటే ఇది బెస్ట్ కెమెరా ఫోన్. ఈ ఫోన్ లో మంచి ఫీచర్లు ఉన్నాయి. డ్యుయల్ కెమెరాతోపాటు..16మెగా పిక్సెల్ ప్రంట్ కెమెరా ఉంది. ఈఫోన్ మీ సోదరికి బహుమతిగా ఇచ్చాక...ఓ సెల్ఫీ తీసుకుని కెమెరాలో బంధించండి. అంతేకాదు డ్యుయల్ సెల్ఫీ కెమెరాతో మీరు మీ కుటుంబ సభ్యులు సెల్ఫీ తీసుకోండి. ఈ ప్రత్యేక గిఫ్ట్ ను మీ సోదరికి అందజేసి ఆమె ముఖంలో ఆనందాన్ని చూడండి.

ధర రూ. 19,990

ఫిట్ బిట్ అల్టా...

ఫిట్ బిట్ అల్టా...ఆరోగ్యం, ఫిట్నెస్ కు మార్కెట్లో లీడర్ అని చెప్పొచ్చు. నిద్ర ట్రాకింగ్ కోసం ఫిట్ బిట్ అల్టా ప్రవేశపెట్టింది. హెల్త్ కు సంబంధించి మరింత సమచారం తెలుసుకునేందుకు ఫిట్ బిట్ యాప్ కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే స్లిమ్మెస్ట్ ఫిట్సెస్. నిరంతరం హార్ట్ రేట్ ను ట్రాకింగ్ చేస్తుంది. ప్యూర్ పల్స్ , హార్ట్ రేట్ టెక్నాలజీ , ఆటోమెటిక్ వ్యాయామం, నిద్ర ట్రాకింగ్ ఏడు రోజులు బ్యాటరీ ఛార్జింగ్ ఉంటుంది. మీ సోదరికి ఈ స్టైలిష్ ఫిట్నెస్ ట్రాకర్ ఇవ్వండి..ఆమె ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేయండి

ధర రూ. 14,999

ఫిట్ బిట్ బ్లేజ్...

మీ సోదరుడికి ఈ ఫిట్ బిట్ బ్లేజ్ ను గిఫ్ట్ గా ఇవ్వండి. గోధుమ, నలుపు, నీలం రంగుల్లో ఉన్న ఈ స్టైలీష్ ఫిట్ బిట్ వాచ్ మీ హెల్త్ గురించి చెప్పేస్తుంది. అంతేకాదు ఎన్ని మెట్లు ఎక్కారు...ఎంత సేపు నడిచారు కూడా చెప్పేస్తుంది. టైమర్ సాయంతో కూడా వ్యాయామాలు చేసే సౌకర్యం ఈ వాచ్ లో ఉంది. దీంతోపాటుగా పల్స్ రేట్ కూడా చెబుతుంది. ఈ వాచ్ బ్యాటరీ 5రోజుల వరకు ఛార్జింగ్ ఉంటుంది.

ధర రూ. 19,990

సెన్హీసర్ మోమెంటమ్ ఇన్-ఇయర్ వైర్లెస్...

మీ సోదరుడు మ్యూజిక్ లవర్ అయితే ఇన్-ఇయర్ వైర్లెస్ ను ఇవ్వండి. మీ చెవికి సొంపైన ధ్వనిని కలిపిస్తుంది. విలాసవంతమై...హై క్వాలిటీ మెటిరియల్స్ తో తయారు చేసిన ప్రీమియం హెడ్ సెట్ , హై ఫై వైర్లెస్ సౌండ్, సింపుల్ టచ్ పేయిరింగ్ కోసం nfc ఉంటుంది. 22 గంటల పాటు బ్యాటరీ చార్జింగ్ ఉంటుంది. బ్లాక్, ఐవరీ వెర్షన్లలో అందుబాటులో ఉంది.

ధర రూ. 14,990

వెర్సెస్ కొత్త లోగో...

కొత్త లోగో..ఆమెకు కానీ అతనికి కానీ కొత్త వెర్సస్ వెర్సెస్ లైన్ చాలా ఐకానిక్ రూపాన్ని కలిగి ఉంది. ఇది క్రోనో వెర్షన్స్ లో మాత్రమే లభిస్తుంది. డబుల్ లోగోతో టాప్ రింగ్ ద్వారా గుర్తించవచ్చు. పురుషుల కోసం క్రోన్ గ్రాఫ్ వెర్షన్ ఉంటుంది. ఎక్స్ ఎల్ కేస్ హౌజ్, క్వార్జ్ మూమెంట్ , అరబిక్ అంకెల గంట గుర్తులు ఉంటాయి. నీలం, డయల్ తోపాటు ఐదు వేర్వేరు రంగుల్లో ఉంటుంది.

ధర రూ. 15,990

అల్టిమేట్ ఇయర్స్ వండర్ బూమ్....

ఈ రక్షా బంధన్ కు మీ తోబుట్టువుకు మ్యూజిక్ గిఫ్ట్ ఇవ్వండి. చిన్ననాటి ట్రాక్స్ ను మీ కుటుంబం అదనంగా పొందండి. పోర్టబుల్, వాటర్ ప్రూవ్ , గో ఎనివేర్,స్పీకర్స్ తీసుకెళ్లచ్చు. సూపర్ పోర్టబుల్ వండర్ బూమ్ స్పష్టమైన, సాఫ్ట్ ధ్వనిని అందిస్తుంది.

ధర రూ. 7,995.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Do wish to mark a difference this Raksha Bandhan? If so, here are some gift options that you can gift for your geeky siblings.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot