Rapoo India నుంచి సరికొత్త గేమింగ్ ఉత్పత్తులు
ప్రముఖ కంప్యూటింగ్ ఉపకరణాల తయారీ కంపెనీ రాపో (Rapoo) తన గేమింగ్ బ్రాండ్ VPRO నంచి సరికొత్త బ్లుటూత్ గేమింగ్ హెడ్‌సెట్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.
ప్రముఖ కంప్యూటింగ్ ఉపకరణాల తయారీ కంపెనీ రాపో (Rapoo) తన గేమింగ్ బ్రాండ్ VPRO నంచి సరికొత్త బ్లుటూత్ గేమింగ్ హెడ్‌సెట్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. రాపో వీపీఆర్ఓ వీఎమ్300 (Rapoo VPRO VM300) పేరుతో ఈ బ్లుటూత్ గేమింగ్ హెడ్‌సెట్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.2,999. ప్రత్యేకించి గేమింగ్ ప్రియులను ఉద్దేశించి డిజైన్ చేయబడిన ఈ హెడ్‌సెట్‌లో 4.1 ఆడియో ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను రాపో నిక్షిప్తం చేసింది. ఈ టెక్నాలజీ 10 మీటర్ల ప్రసార దూరంలోనూ స్థిరమైన కనెక్షన్‌ను అందించగలుగుతుంది. ఈ ప్రొడక్ట్‌లో పొందుపరిచిన సీఎస్ఆర్ 8645 చిప్ అలానే aptX టెక్నాలజీలు సౌండ్ తీవ్రతకు సంబంధించిన క్యారెక్టర్‌ను డిమానిస్ట్రేట్ చేయటంతో పాటు సౌండ్ దిశను ఖచ్చితంగా గుర్తించగలుగుతాయని రాపో వెల్లడించింది.

7 గంటల బ్యాటరీ బ్యాకప్..
డ్యుయల్ బ్యాటరీ డిజైన్‌తో వస్తోన్న ఈ బ్లుటూత్ హెడ్‌సెట్ సింగిల్ ఛార్జ్ పై 7 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేయగలుగుతుందట. ఐపీ44 వాటర్ ప్రూఫ్ సర్టిఫికేషన్‌తో డిజైన్ కాబడిన ఈ డివైస్‌ను కఠినమైన వాతవరణాల్లోనూ వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. మైక్ సపోర్ట్‌తో కూడిన మల్టీ ఫంక్షన్ వైరిడ్ కంట్రోల్, హెచ్‌డి సౌండ్‌ను సపోర్ట్ చేయటంతో పాటు పూర్తిస్థాయి వాల్యుమ్ కంట్రోలింగ్‌కు అనుమతిస్తుంది. ఈ హెడ్‌సెట్‌తో వచ్చే డిటాచబల్ హ్యాంగర్‌ను వివిధ సైజుల్లో అడ్జస్ట్ చేసకోవచ్చు.

స్మూత్ కమ్యూనికేషన్ ఎక్స్‌పీరియన్స్..
ఈ హెడ్‌సెట్ ఆవిష్కరణ సందర్బంగా రాపో టెక్నాలజీ ఇండియా హెడ్ ముఖేష్ చౌదరి మాట్లాడుతూ ఈ ఐడియల్ ప్రొడక్ట్‌ను ప్రత్యేకించి గేమర్స్ కోసం అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ హెడ్‌సెట్ కోసం డిజైన్ చేసిన ఆడియో మైక్రోఫోన్ నాయిస్‌ను మరింతగా ఫిల్టర్ చేసి స్మూత్ కమ్యూనికేషన్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తుందని ఆయన తెలిపారు.

అన్ని బ్లుటూత్ డివైస్‌లను సపోర్ట్ చేస్తుంది..
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాపో పార్టనర్స్ వద్ద ఈ హెడ్‌సెట్‌లను అందుబాటులో ఉంచినట్లు ముఖేష్ చౌదరి తెలిపారు. ధర రూ.2,999. బ్లూటత్ కనెక్టవిటీ సపోర్ట్‌తో వచ్చే అన్ని డివైస్‌లను ఈ బ్లుటూత్ హెడ్‌సెట్ సపోర్ట్ చేస్తందట.

రాపో 3610 ప్లస్ 2.4జీ ఫ్యాబ్రిక్ వైర్‌లెస్ ఆప్టికల్ మౌస్
ఇదే ఈవెంట్‌లో భాగంగా ‘రాపో 3610 ప్లస్ 2.4జీ' (RAPOO 3510 Plus 2.4G) పేరుతో సరికొత్త ఫ్యాబ్రిక్ వైర్‌లెస్ ఆప్టికల్ మౌస్‌ను రాపో లాంచ్ చేసింది. ధర రూ.1,999. 80 గ్రాముల బరవును కలిగి ఉండే ఈ మౌస్ ప్లగ్ అండ్ ప్లే అల్ట్రా-మినీ నానో రిసీవర్‌తో వస్తోంది. ఈ మౌస్‌లో నిక్షిప్తం చేసిన 2.4జీ వైర్‌లెస్ టెక్నాలజీ 10 మీటర్ల వరకు ప్రసార దూరాన్ని కవర్ చేయగలుగుతుంది.


Click it and Unblock the Notifications