Home
Gadgets

12MP కెమెరా, 32GB స్టోరేజ్, మెటా AIతో Ray-Ban స్మార్ట్ గ్లాసెస్ త్వరలో ఇండియాలో విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..

Ray-Ban Meta Glasses India launch: మీ ఫేవరెట్ రే-బాన్ స్టైల్ ఇప్పుడు స్మార్ట్‌గా మారింది. అదెలా అంటారా? టెక్ దిగ్గజం మెటా (Meta) తన AI టెక్నాలజీని జోడించింది. ఫలితమే ఈ 'రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్'. చూడటానికి క్లాసిక్ రే-బాన్ లుక్‌తో, లోపల అదిరిపోయే టెక్ ఫీచర్లతో వస్తున్న ఈ కళ్లద్దాలు త్వరలోనే ఇండియాలో అడుగుపెట్టనున్నాయి.

చేతులు వాడకుండానే ఎన్నో పనులు చేసే అవకాశం కల్పించే ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను 2023, సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు, ఇప్పుడు భారతీయ వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి. ప్రపంచ కళ్లద్దాల దిగ్గజం ఎస్సిలార్ లక్సోటికా (EssilorLuxottica) వారి రే-బాన్ (Ray-Ban), టెక్ దిగ్గజం మెటా (Meta) కలిసి వీటిని రూపొందించాయి.

Ray-Ban Meta AI Smart Glasses India Launch Soon

* భారత్‌లో విడుదల వివరాలు, లభ్యత
రే-బాన్ మెటా గ్లాసెస్ త్వరలో ఇండియాలో విడుదల కానున్నాయని మెటా అధికారికంగా ప్రకటించింది. కచ్చితమైన తేదీ ఇంకా వెల్లడించకపోయినా, ఇవి రే-బాన్ ఇండియా స్టోర్లు, మెటా ఆన్‌లైన్ స్టోర్‌లోనూ లభించే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా వీటి ప్రారంభ ధర 299 డాలర్లు (సుమారు రూ.26,000). ఎంచుకునే స్టైల్, లెన్స్ మార్పుల బట్టి ఇండియాలో ధరలు మారవచ్చు.

* డిజైన్, స్టైల్స్, లెన్స్ ఆప్షన్లు
ఈ గ్లాసెస్ మూడు అదిరిపోయే ఫ్రేమ్ స్టైల్స్‌లో వస్తున్నాయి. అవి వేఫేరర్ (Wayfarer), స్కైలర్ (Skyler), హెడ్‌లైనర్ (Headliner). వినియోగదారులు తమ అభిరుచికి తగ్గట్టుగా 20కి పైగా స్టైల్స్, రంగుల నుంచి ఎంచుకోవచ్చు. వీటిని కళ్లజోడు వాడే వారి కోసం రూపొందించారు.

ఇవి -6.00 నుంచి +4.00 పవర్ వరకు గల ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లను, ఎండలోకి వెళ్లినప్పుడు నల్లగా మారే ట్రాన్సిషన్ లెన్స్‌లను కూడా సపోర్ట్ చేస్తాయి. దీనివల్ల చాలామంది వీటిని కొనుగోలు చేసుకొని వాడుకోవచ్చు. క్లాసిక్ రే-బాన్ లుక్‌ను ఏమాత్రం మార్చకుండా, హై-టెక్ ఫీచర్లను ఇందులో చక్కగా అమర్చారు.

* AI ఫీచర్లు, కంపాటిబిలిటీ
వీటి ప్రత్యేక ఆకర్షణ మెటా AI (Meta AI) సపోర్ట్. ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసిన తర్వాత, "హే మెటా" అని వాయిస్ కమాండ్స్ ద్వారా మెటా AIతో మాట్లాడవచ్చు. ఇది మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది, పాటలు ప్లే చేస్తుంది, రిమైండర్‌లు సెట్ చేస్తుంది.

మెసేజ్‌లు పంపిస్తుంది, ఫోటో లేదా వీడియో తీయమని చెప్తే తీస్తుంది. ఈ గ్లాసెస్ ఆండ్రాయిడ్ (వెర్షన్ 10, ఆపై), ఐఫోన్ (iOS 14.2, ఆపై) రెండింటితోనూ పనిచేస్తాయి.కెమెరా, ఆడియో, స్టోరేజ్ సామర్థ్యాల విషయానికొస్తే, ఈ గ్లాసెస్‌లో 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది.

దీనితో చేతులు ఉపయోగించకుండానే (హ్యాండ్స్-ఫ్రీ) ఫోటోలు క్లిక్ చేయవచ్చు, 3 నిమిషాల నిడివి గల ఫుల్ HD+ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఇంకా, 30 నిమిషాల వరకు వీడియోలను ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌స్ట్రీమ్ కూడా చేయవచ్చు. ఫొటోలు, వీడియోలు దాచుకోవడానికి 32GB స్టోరేజ్ కూడా ఉంది.

చుట్టుపక్కల శబ్దాలకు ఆటంకం కలగకుండా కాల్స్ మాట్లాడటానికి, మ్యూజిక్ వినడానికి, మెటా AIతో స్పష్టంగా మాట్లాడటానికి ఓపెన్-ఇయర్ స్పీకర్లు, ఐదు మైక్రోఫోన్లు ఉన్నాయి. వీటివల్ల ఈ మెటా గ్లాసెస్ వినియోగం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వీటిని ఒకసారి వాడితే ఫిదా అవ్వడం పక్కా.

* లైవ్ ట్రాన్స్‌లేషన్, మెసేజింగ్ ఇంటిగ్రేషన్
మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే, మెటా AI ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్ భాషలలో లైవ్ ట్రాన్స్‌లేషన్ చేయగలదు. ఆ భాషా ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటే, ఇంటర్నెట్ లేకపోయినా అనువాదం పనిచేస్తుంది. అంతేకాకుండా, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్, ఫోన్‌లోని సాధారణ మెసేజింగ్ యాప్‌ల ద్వారా మెసేజ్‌లు, కాల్స్ చేయడం వంటివి ఈ గ్లాసెస్‌తో చేయవచ్చు.

* బ్యాటరీ లైఫ్, పనితీరు
ఈ స్మార్ట్ గ్లాసెస్ స్నాప్‌డ్రాగన్ AR1 జెన్1 (Snapdragon AR1 Gen1) ప్రాసెసర్‌తో చాలా స్మూత్‌గా పనిచేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే, గ్లాసెస్‌తో పాటు వచ్చే స్టైలిష్ ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఏకంగా 36 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. గ్లాసెస్, ఛార్జింగ్ కేస్ కలిపి మొత్తం బరువు 133 గ్రాములు మాత్రమే.

కాబట్టి రోజంతా పెట్టుకున్నా తేలికగా ఉంటాయి. ఈ డివైస్ IPX4 వాటర్ రెసిస్టెంట్ (చిన్న చిన్న నీటి తుంపర్లను తట్టుకుంటుంది). కనెక్టివిటీ కోసం లేటెస్ట్ Wi-Fi 6, బ్లూటూత్ 5.2 వంటి ఫాస్ట్ టెక్నాలజీలు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Ray-Ban Meta AI Smart Glasses India Launch Soon, 12MP Camera, Price, Features and Specs Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X