Realme 30W Charge పవర్ బ్యాంక్ లాంచ్!! అందుబాటు ధరలోనే...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారి సంస్థ రియల్‌మి ఈ రోజు ఇండియాలో తన సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి C11ను విడుదల చేసింది. దీనితో పాటుగా 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ ను కూడా ఈ రోజు విడుదల చేసింది.

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ లాంచ్

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ లాంచ్

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్  దీని యొక్క పేరుకు సూచించినట్లుగా ఈ పవర్ బ్యాంక్ అన్ని పరికరాలను గరిష్టంగా 30W వేగంతో ఛార్జ్ చేయగలదు. అంటే ఇది సాధారణ 18W ఛార్జింగ్ పవర్ బ్యాంకుల కంటే చాలా వేగంగా ఛార్జ్ చేస్తుంది. రియల్‌మి కొత్త పవర్ బ్యాంక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే ఇది తన పాత రియల్‌మి పవర్ బ్యాంకుల మాదిరిగానే ఉంటుంది. రియల్‌మి యొక్క 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ కార్బన్ ఫైబర్ ఆకృతి ముగింపును కలిగి ఉండి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: Realme C11 కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!!! ధర కూడా తక్కువే...Also Read: Realme C11 కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!!! ధర కూడా తక్కువే...

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ ధరల వివరాలు

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ ధరల వివరాలు

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ ఇండియాలో రూ.1,999 ధర వద్ద విడుదల అయింది. ఇది బ్లాక్ మరియు ఎల్లో వంటి రెండు కలర్ ఎంపికలలో వస్తుంది. ఇవి రెండూ కూడా కార్బన్ ఫైబర్ ఆకృతిని కలిగి ఉంటాయి. వీటి యొక్క మొదటి అమ్మకం రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ తో పాటుగా జూలై 21 న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి వెబ్‌సైట్ ద్వారా జరుగుతుందని కంపెనీ పేర్కొంది.

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ అవుట్ పుట్ పోర్టులను కలిగి ఉన్నాయి. ఇందులో ఒకటి USB టైప్-A మరియు రెండవది USB టైప్-C పోర్టులను కలిగి ఉన్నాయి. ఇందులో పవర్ బటన్ మరియు పవర్ బ్యాంక్లో మిగిలిన సామర్థ్యాన్ని చూపించే LED ఇండికేటర్ కూడా కలిగి ఉంది. ఈ పరికరాన్ని ఛార్జ్ చేయడానికి ఒకే పోర్టును ఉపయోగిస్తున్నప్పుడు పవర్ బ్యాంక్ పూర్తిగా 30W శక్తిని అందించగలదు. కాని ఒకేసారి రెండు పోర్టుల ద్వారా ఛార్జ్ చేస్తున్నప్పుడు 25W వద్ద ఛార్జ్ చేస్తుంది. 30W డార్ట్ ఛార్జ్ 10000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్ ఓవర్-వోల్టేజ్ ప్రొటెక్షన్, ఇన్పుట్ సర్జ్ ప్రొటెక్షన్, ఛార్జింగ్ ప్యాచ్ ఇంపెడెన్స్, ఎలెక్ట్రోస్టాటిక్, అండర్-వోల్టేజ్ మరియు ఉష్ణోగ్రత రక్షణతో సహా 15-లేయర్ ఛార్జింగ్ రక్షణతో నిర్మించబడింది. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు లేదా స్మార్ట్ వేరబుల్స్ వంటి AIoT పరికరాలను కూడా ఇది తక్కువ కరెంట్ మోడ్‌తో ఛార్జ్ చేయగలుగుతుంది.

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ డిజైన్

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ డిజైన్

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ డిజైన్ విషయానికి వస్తే ఇది 3D కర్వ్డ్ డిజైన్ ను కలిగి ఉందని రియల్మే తెలిపింది. పవర్ బ్యాంక్‌లో కార్బన్ ఫైబర్ ఆకృతిని కలిగి ఉండి ఇది నలుపు మరియు పసుపు రెండు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది. ఇది ఇరువైపుల రియల్మే బ్రాండింగ్ కలిగి ఉండి 17 మిమీ మందంతో పాటు 230 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ కెపాసిటీ

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ కెపాసిటీ

రియల్‌మి 30W డార్ట్ ఛార్జ్ 10000mAh పవర్ బ్యాంక్ అంతర్నిర్మిత హై-డెన్సిటీ లిథియం-అయాన్ పాలిమర్ రెండు బ్యాటరీల 10,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. ఈ 10,000mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 1 గంట 36 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇది రెండు మార్గాల డార్ట్ ఛార్జీకి మద్దతు ఇస్తుంది. ఈ పవర్ బ్యాంక్ 30W ఛార్జింగ్ వేగాన్ని కలిగి ఉండి డార్ట్ VOOC, క్విక్ ఛార్జ్, మరియు బహుళ ఫాస్ట్ ఛార్జింగ్ లకు మద్దతును ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Realme 30W Dart Charge 10000mAh Power Bank Launched in India: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X