ఆపిల్ కు పోటీగా రియల్‌మి ఎయిర్‌పాడ్స్

|

గత నెలలో రియల్‌మి ఎక్స్ 2 ప్రోను ఇండియాలో లాంచ్ చేస్తున్నపుడు రియల్‌మి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ఈ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు సూచించింది. రియల్‌మి కంపెనీ సీఈఓ మాధవ్‌ శేత్‌ ఎయిర్‌ పోడ్స్ ను వేదికపైకి తీసినప్పటికీ అతను వాటి గురించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. కేవలం త్వరలో ప్రారంభించనున్నట్లు మాత్రమే ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు రియల్‌మి ఎయిర్‌పాడ్స్‌ను డిసెంబర్‌లో భారత్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

రియల్‌మి
 

రియల్‌మి సీఈఓ మాధవ్‌ శేత్‌ ట్విటర్ యొక్క తన తాజా ట్వీట్‌లో తాను రియల్‌మి ఎయిర్‌పాడ్స్‌ను ఉపయోగిస్తున్న ఫోటోను షేర్ చేసాడు. పసుపు కాలర్ లోని ఎయిర్‌పొడ్స్‌ను వాడుతున్న ఫోటోను మాత్రమే షేర్ చేసాడు. ఎయిర్‌పొడ్స్‌ యొక్క మొత్తం కేసును మాత్రం చూపించలేదు. రియల్‌మి ఎయిర్‌పాడ్స్‌ డిసెంబర్‌లో మార్కెట్‌లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఎయిర్‌పాడ్స్‌ యొక్క ధర మరియు వాటి ప్రత్యేకతల గురించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు.

నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్... బడ్జెక్ట్ ధరలో...హైలైట్స్

CMO

మరొక పోస్ట్‌లో రియల్‌మి CMO ఫ్రాన్సిస్ వాంగ్ ఎయిర్‌పాడ్స్‌ యొక్క బ్లాక్ వేరియంట్‌ను ఉపయోగిస్తున్న మరొక ఫోటోను షేర్ చేసాడు. రియల్‌మి ఎయిర్‌పాడ్స్ ఇయర్‌బడ్‌లు ఆపిల్ ఎయిర్‌పాడ్‌ల మాదిరిగానే పొడవైన ఆకారంను కలిగి ఉంది. ఇది ప్లేబ్యాక్ నియంత్రణలు మరియు వాల్యూమ్ సర్దుబాటు కోసం టచ్-సెన్సిటివ్ నియంత్రణలను కలిగి ఉంటుంది అని తెలిపారు.

థియేటర్ కంటే ఖరీదైన Samsung Wall TV రిలీజ్... ధర చాలా ఎక్కువ

ఎయిర్‌పాడ్‌లు

రియల్‌మి సంస్థ వీటి గురించి ఇంకా ఎటువంటి ఫీచర్లను తెలుపనప్పటికీ రియల్‌మి ఎయిర్‌పాడ్‌లు గూగుల్ అసిస్టెంట్‌తో అనుసంధానం చేయగలవు మరియు సిరి ఒకసారితో స్మార్ట్‌ఫోన్‌కు జత చేస్తుంది. ఎయిర్‌పాడ్‌లు ఆడియో నాణ్యతకు బదులుగా చలనశీలతపై ఎక్కువగా దృష్టి సారించింది కాబట్టి గొప్ప ఆడియో నాణ్యతను ఉహించవచ్చు. అయినప్పటికీ రియల్‌మి ఎయిర్‌పాడ్‌లతో మెరుగైన బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.

ధర
 

రియల్‌మి తన ఎయిర్‌పాడ్స్‌ యొక్క ధరను ఇండియాలో ఎంత నిర్ణయించిందో చూడాలి. ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను కోనుగోలు చేయడానికి ఇండియాలో రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చవుతుంది. రియల్‌మి సంస్థ ఆ పరిధి కంటే తక్కువ ధర వద్ద అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది.

రియల్‌మి XT

రియల్‌మి ఇండియాలో డిసెంబర్‌ నెలలో ప్రారంభించబోయే తన ఉత్పత్తులలో ఎయిర్‌పాడ్స్‌ మాత్రమే కాకుండా రియల్‌మి XT 730Gని కూడా త్వరలో భారతీయ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు రియల్‌మి ధృవీకరించింది. రియల్‌మి XT730G స్నాప్‌డ్రాగన్ 712 చిప్‌సెట్‌కు బదులుగా మరింత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 730G చిప్‌సెట్‌తో లభిస్తున్నది. మిగిలిన ఫీచర్స్ సాధారణ రియల్‌మి XT కి సమానంగా ఉంటాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఇండియాలో రూ.30,000 ధర వద్ద ప్రారంభం కానున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme Airpods Alongside Realme X2 Pro, Set For December Release In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X