Home
Gadgets

Realme Band సేల్స్ : మళ్ళీ దొరకని ఆఫర్స్ త్వరపడండి...

రియల్‌మి సంస్థ యొక్క మొట్టమొదటి ఫిట్‌నెస్ ట్రాకర్ రియల్‌మి బ్యాండ్ యొక్క సేల్స్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ మరియు అమెజాన్ ద్వారా మొదలుకానుంది.

రియల్‌మి స్మార్ట్ బ్యాండ్

ఈ స్మార్ట్ బ్యాండ్ యొక్క మొదటి ఫ్లాష్ సేల్స్ ఇండియాలో ప్రారంభించిన రోజు మార్చి 5నే జరిగింది. ఇప్పుడు ఈ రియల్‌మి బ్యాండ్ నలుపు, పసుపు మరియు ఆకుపచ్చ వంటి మూడు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ద్వారా రియల్‌మి బ్యాండ్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు ఫిట్‌నెస్ ట్రాకర్‌ కోసం కొన్ని ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

ధర మరియు ఆఫర్స్ వివరాలు

ధర మరియు ఆఫర్స్ వివరాలు

ఇండియాలో రియల్‌మి బ్యాండ్ యొక్క ధర రూ.1,499 వద్ద నిర్ణయించబడింది. దీనిని రియల్‌మి యొక్క సొంత వెబ్‌సైట్‌తో పాటుగా అమెజాన్ ఇండియా ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులు అమెజాన్ పే ద్వారా చెల్లింపు చేయడం ద్వారా రూ.50 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే ప్రైమ్ సభ్యులు అమెజాన్ పే మరియు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి 5 శాతం క్యాష్‌బ్యాక్, ప్రైమ్ సభ్యులు కానీ వారికి 3 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

 

 

రియల్‌మి బ్యాండ్‌ స్పెసిఫికేషన్స్

రియల్‌మి బ్యాండ్‌ స్పెసిఫికేషన్స్

రియల్‌మి బ్యాండ్‌లో 0.96-అంగుళాల (2.4 సెం.మీ) కలర్ TFT ఎల్‌సిడి ప్యానెల్ 80x160 పిక్సెల్స్ రిజల్యూషన్ వద్ద వస్తుంది. దీని యొక్క డిస్ప్లేలో టచ్ బటన్ ఉంటుంది. ఇది రియల్‌మి లింక్ యాప్ ద్వారా సర్దుబాటు చేయగల ఐదు రకాల మోడ్ లకు మద్దతు ఇస్తుంది. ఇంకా ఇందులో అంతర్నిర్మిత గురుత్వాకర్షణ సెన్సార్ ను ఉపయోగించి మీ మణికట్టు భూమికి ఎంత ఎత్తులో ఉందొ కనుగొనవచ్చు. రియల్‌మి లింక్ యాప్‌ను ఉపయోగించి రియల్‌మి బ్యాండ్‌లో ఐదు రకాల డయల్ ఫేస్‌లను వర్తించవచ్చు. భవిష్యత్ లో ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్ డేట్ లతో ఇంకా అదనపు డయల్ పేస్ లను జోడించవచ్చు అని రియల్‌మి సంస్థ హామీ ఇచ్చింది.

 

 

రియల్‌మి బ్యాండ్ సెన్సార్‌

రియల్‌మి బ్యాండ్ సెన్సార్‌

ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం రియల్‌మి బ్యాండ్ ఖచ్చితమైన PPG ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్‌తో ప్రీలోడ్ చేయబడి ఉంది. ఇది ప్రతి ఐదు నిమిషాలకు వినియోగదారుల యొక్క హృదయ స్పందన రేటును కొలుస్తుందని పేర్కొంది. ఇది స్లీప్ క్వాలిటీ మానిటర్‌తో కూడా వస్తుంది. దీని ద్వారా నిద్ర నాణ్యతను విశ్లేషించడానికి ఒక అల్గోరిథంను ఉపయోగించింది. వినియోగదారులు వారి నిద్ర విధానాలను అర్థం చేసుకోవడానికి ఇది ఒక నివేదికను రూపొందిస్తుంది. వినియోగదారులు ఎక్కువసేపు కూర్చున్న తర్వాత నడవడానికి గుర్తుచేయడానికి వీలుగా ఐడిల్ అలర్ట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

 

 

రియల్‌మి బ్యాండ్‌ స్పోర్ట్స్ మోడ్‌

రియల్‌మి బ్యాండ్‌ స్పోర్ట్స్ మోడ్‌

రియల్‌మి బ్యాండ్‌లో తొమ్మిది రకాల స్పోర్ట్స్ మోడ్‌ల జాబితా కూడా ఉన్నాయి. ఇందులో వాకింగ్, రన్నింగ్ మరియు యోగా వంటివి ఉన్నాయి. మీరు ఈ మూడు రకాల మోడ్‌లను ఫిట్‌నెస్ బ్యాండ్‌లో సెట్ చేసుకొని మీరు మీ యొక్క కార్యక్రమాలను చేసుకోవచ్చు. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు వివరణాత్మక గణాంకాలను అందించడానికి క్రికెట్ మోడ్ కూడా ఇందులో ఉంది. రియల్‌మి బ్యాండ్‌ IP68- సర్టిఫైడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. అంటే ఇది నీరు, ధూళి వంటి నిరోధకతను కలిగి ఉంది. ఈ రియల్‌మి బ్యాండ్‌ స్మార్ట్ నోటిఫికేషన్‌లతో వస్తుంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్‌టాక్ మరియు యూట్యూబ్ వంటి యాప్ లకు మద్దతును ఇస్తుంది.

 

 

బ్యాటరీ లైఫ్

రియల్‌మి బ్యాండ్‌లో మూడు-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, రోటర్ వైబ్రేషన్ మోటర్ మరియు బ్లూటూత్ v4.2 ఉన్నాయి. బ్యాండ్ ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్‌లో పనిచేసే అన్ని రకాల డివైస్ లకు అనుకూలంగా ఉంటుంది. ఈ రియల్‌మి బ్యాండ్‌ 90mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఆరు నుండి తొమ్మిది రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Band Sale Start on Amazon at 12PM: Price, Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X