రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ అందుబాటు ధరలో లాంచ్ అయింది!! ఫీచర్స్ బ్రహ్మాండం

|

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి నేడు ఇండియాలో రియల్‌మి GT 2 ప్రో, రియల్‌మి GT 9 4G స్మార్ట్‌ఫోన్లతో పాటుగా రియల్‌మి బడ్స్ ఎయిర్ 3 TWS ఇయర్‌బడ్స్ మరియు రియల్‌మి స్మార్ట్ టీవీ స్టిక్‌తో పాటు రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ ను కూడా విడుదల చేసింది. భారతదేశంలో రియల్‌మి బ్రాండ్ తన యొక్క ల్యాప్‌టాప్ సిరీస్ లో కొత్తగా చేరిన రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ ప్రస్తుతం లాంచ్ ఆఫర్లలో భాగంగా కేవలం రూ.46,999 ధర వద్దనే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ ధరలు & సేల్స్ వివరాలు

రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ ధరలు & సేల్స్ వివరాలు

రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ యొక్క ధరల విషయానికొస్తే భారతదేశంలో ఇది రూ.64,999 ధర వద్ద లాంచ్ అయింది. అయితే లాంచ్ ఆఫర్లలో భాగంగా ఇది దేశంలో రూ.57,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ తగ్గింపు ధరలు ఎన్ని రోజులు అందుబాటులో ఉంటాయో తెలియదు. లభ్యత విషయానికి వస్తే భారతదేశంలో దీని మొదటి సేల్స్ ఏప్రిల్ 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి realme.com, Flipkart మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌ల ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్‌లకు క్రెడిట్ కార్డ్‌లు మరియు డెబిట్ కార్డ్‌లు మరియు EMI లావాదేవీల ద్వారా రూ.3,000 వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది.

రియల్‌మి బడ్స్ ఎయిర్ 3 ధరల వివరాలు

రియల్‌మి బడ్స్ ఎయిర్ 3 ధరల వివరాలు

రియల్‌మి బడ్స్ ఎయిర్ 3 ఇండియాలో రూ.3,999 ధర వద్ద విడుదలైంది. ఇది గెలాక్సీ వైట్ మరియు స్టార్రీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇవి Realme.com, Flipkart మరియు రిటైల్ స్టోర్‌ల ద్వారా ఈరోజు నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అలాగే రియల్‌మి స్మార్ట్ టీవీ స్టిక్ కూడా రూ.2,999 ధర వద్ద లాంచ్ అయింది. ఇది Realme.com, Flipkart మరియు రిటైల్ స్టోర్‌ల ద్వారా ఏప్రిల్ 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి బుక్ ప్రైమ్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది అల్యూమినియం ఛాసిస్‌తో 14.9mm మందంతో కేవలం 1.37Kgs బరువును కలిగి ఉంటుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను 2048×1080 పిక్సెల్‌లను 2K రిజల్యూషన్‌తో మరియు 400 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అలాగే ఇది 11వ తరం ఇంటెల్ కోర్ i5-11320 ప్రాసెసర్‌తో ఆధారితంగా రన్ అవుతూ ఇంటెల్ ఐరిస్ X గ్రాఫిక్స్‌తో జత చేయబడి వస్తుంది. ఇది అధిక సమయం వినియోగించడానికి వీలుగా వేడి వెదజల్లడాన్ని మెరుగ్గా నిర్వహించడానికి VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో కూడా వస్తుంది. ఇంటెల్ ప్రాసెసర్ గరిష్టంగా 16GB వరకు LPDDR4x RAM మరియు 512GB PCle SSD స్టోరేజ్ తో జత చేయబడి ఉండి విండోస్ 11 ఓఎస్‌తో రన్ అవుతుంది.

బ్యాటరీ

సాధారణంగా ల్యాప్‌టాప్లలో అందురు ముఖ్యంగా గమనించే మరొక విషయం బ్యాటరీ. ఈ విషయంలో రియల్‌మి బుక్ ప్రైమ్ USB టైప్-సి పోర్ట్ ద్వారా 65W పాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 54Wh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. Realme కొత్తగా ప్రారంభించిన ల్యాప్‌టాప్ 12 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ ఎంపికలలో WiFi 6, Thunderbolt 4, 3.5mm జాక్, USB-A 3.1 Gen 1 పోర్ట్, USB-C 3.2 Gen 2 పోర్ట్ వంటివి ఉన్నాయి. అదనపు ఫీచర్లు DTS ద్వారా స్టీరియో సౌండ్‌తో బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కలిగి ఉంటాయి.

Best Mobiles in India

English summary
Realme Book Prime laptop Launched in India: Price, Specs, Features, Sales Date, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X