రియల్‌మి నుంచి కొత్తగా బడ్స్ ఎయిర్ 6 ఇయర్‌బడ్స్.. ANC, ENC ఫీచర్లతో మే 22న విడుదల..!!
రియల్‌మి నుంచి ఇయర్‌బడ్స్ మే 22వ తేదీన విడుదల కానున్నాయి. ఇదే రోజు రియల్‌మి GT 6T స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ కానుంది. రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ఇయర్ బడ్స్‌ను ( Realme Buds Air 6 Earbuds) రియల్‌మి అధికారిక వెబ్ సైట్ మరియు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ఇయర్‌బడ్స్ గత సంవత్సరం విడుదలైన బడ్స్ ఎయిర్ 5 కు తర్వాత తరం వెర్షన్‌గా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఇయర్‌బడ్స్ Hi-Res సర్టిఫైడ్ TWS గా రానున్నాయని సంస్థ వెల్లడించింది. మరియు 12.4mm డీప్ బాస్ డ్రైవర్‌ను కలిగి ఉంటుంది, 50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్టును కలిగి ఉంటుంది.

దీంతోపాటు ఈ ఇయర్ బడ్స్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సపోర్టుతో 6 మైక్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఫోన్ కాల్స్ సమయంలో మెరుగైన అనుభూతిని పొందుతారని పేర్కొంది. దీంతోపాటు 55ms లేటెన్సీని కలిగి ఉంటుందని సమాచారం. ఫలితంగా గేమింగ్ సమయంలో మెరుగైన పనితీరు కనబరుస్తుందని సమాచారం.
రియల్‌మి బడ్స్ ఎయిర్ 5 ప్రో వెర్షన్ గత సంవత్సరం విడుదల అయింది. అయితే ఎయిర్ 6 ప్రో వేరియంట్ అందుబాటులోకి తీసుకొస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీంతోపాటు రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ధరపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
**రియల్‌మి GT 6T స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో విడుదల కానుందని సమాచారం. దీంతోపాటు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్ సెట్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 32MP IMX615 కెమెరాను కలిగి ఉంటుంది.
రియల్‌మి GT 6T స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 + జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా వీడియో ఎడిటింగ్, గేమింగ్ సమయంలో మెరుగైన పనితీరును కనబరిచే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సాఫ్ట్ వేర్ అప్ డేట్‌పై సంస్థ ఎక్కువగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది.
ఈ రియల్‌మి హ్యాండ్ సెట్ 8GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే వీలుంది. దీంతోపాటు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, USB-C, వైపై, బ్లూటూత్, GPS సహా వివిధ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.\


Click it and Unblock the Notifications








