40 గంటల బ్యాటరీ లైఫ్‌తో రియల్‌మి ఇయర్ బడ్స్.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్‌లు..!
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి త్వరలో బడ్స్ ఎయిర్ 6 ప్రో (Realme Buds Air 6 Pro) విడుదల కానున్నాయి. సంస్థ తాజాగా ఈ బడ్స్ డిజైన్, ఫీచర్లు సహా విడుదలపై ప్రకటన చేసింది. ఈ ఇయర్‌బడ్స్ నాయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్ డివైస్ కనెక్షన్, డ్యూయల్ డ్రైవర్స్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటాయని తెలిపింది. అయితే రియల్‌మి సంస్థ మే నెలలో భారత్ మార్కెట్‌లోకి రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ఇయర్‌బడ్స్ విడుదల అయ్యాయి.
ఎప్పుడు విడదల కానుంది.. :
రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ప్రో ఇయర్‌బడ్స్ జూన్ 20 మధ్యాహ్నం 1:30 గంటలకు భారత్లో విడుదల చేయనున్నట్లు రియల్‌మి సంస్థ ప్రకటన చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌ను రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

డిజైన్ వివరాలు :
రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 బడ్స్ తరహా డిజైన్ మరియు ఛార్జింగ్ కేస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రమోషనల్ ఇమేజ్‌లో గ్రే కలర్‌లో బడ్స్‌ను గుర్తించవచ్చు. గ్లోసీ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. అయితే ధర సహా సేల్ వివరాలను సంస్థ వెల్లడించలేదు.
రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ప్రో ఫీచర్‌లు:
రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ప్రో ఇయర్‌బడ్స్ 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరియు LDAC కనెక్టివిటిని కలిగి ఉంటుంది. 6 మైక్ సిస్టమ్‌తో Hi- Res ఆడియోను కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్ డ్యూయల్ డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. 11mm బాస్ డ్రైవర్ మరియు 6mm మైక్రో ప్లానర్ ట్వీటర్‌ను కలిగి ఉంటుంది.
ఈ రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ప్రో ఇయర్‌ఫోన్స్ 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్‌ను సపోర్టు చేస్తాయని రియల్‌మి సంస్థ తెలిపింది. దీని ద్వారా సినిమాటిక్ సౌండ్ అనుభూతిని పొందవచ్చని పేర్కొంది. ఈ ఇయర్‌బడ్స్ డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. అంటే ఒకేసారి రెండు డివైస్‌లతో కనెక్ట్ కావచ్చు.
40 గంటలపాటు బ్యాటరీ లైఫ్ :
ఈ రియల్‌మి బడ్స్.. ఛార్జింగ్ కేస్‌లో కలిపి సింగిల్ ఛార్జింగ్ ద్వారా 40 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ను ఇస్తాయని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు సంస్థ మరో కీలక అంశాన్ని వెల్లడించింది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 7 గంటలపాటు వినియోగించుకోవచ్చని పేర్కొంది.
* రియల్‌మి నుంచి GT 6 స్మార్ట్‌ఫోన్ కూడా జూన్ 20 మధ్యాహ్నం 1:30 గంటలకు లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉండనుంది. ఈ హ్యాండ్‌సెట్ 120W ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 10 నిమిషాల్లో 50 శాతం మరియు 28 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేస్తుందని తెలుస్తోంది.
ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు VC కూలింగ్ సిస్టమ్‌తో లాంచ్ కానుంది. ఫలితంగా ఫోన్ వేడెక్కకుండా ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు యాంబియంట్ లైట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుందని రియల్‌మి వెల్లడించింది.


Click it and Unblock the Notifications