40 గంటల బ్యాటరీ లైఫ్‌తో రియల్‌మి ఇయర్‌బడ్స్... ANC, ENC సహా కీలక ఫీచర్‌లు..!!
రియల్‌మి సంస్థ ఇవాళ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా GT 6 స్మార్ట్ ఫోన్ సహా రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ప్రో ఇయర్‌బడ్స్ ను (Realme Buds Air 6 Pro Earbuds Launched) విడుదల చేసింది. ఈ ఇయర్‌బడ్స్ మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తాయి. మరియు అడ్వాన్స్‌డ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ ఛార్జింగ్‌తో 40 గంటల బ్యాటరీ లైఫ్ ను పొందవచ్చు. ఈ నెల 27 నుంచి ఈ ఇయర్‌బడ్స్ సేల్ ప్రారంభం కానుంది.
రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ప్రో ఇయర్ బడ్స్ 11mm + 6mm డ్యూయల్ డ్రైవర్లను కలిగి ఉంటాయి. Hi-Res ఆడియో సర్టిఫికేషన్ మరియు LDAC HD ఆడియో Codec తో అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా మైండ్ ప్లో మోడ్, డైనమిక్ బాస్ బూస్ట్, ఆడియో ఆల్గారిథమ్ ను కలిగి ఉంటుంది.

ఈ రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ప్రో ఇయర్ బడ్స్ 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను సపోర్టు చేస్తాయి. దీంతోపాటు 6 మైక్స్ తో వస్తుంది. మరియు కాలింగ్ సమయంలో ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. 55ms సూపర్ లో లేటెన్సీ, డ్యూయల్ డివైస్ కనెక్షన్ 2.0, ఇంటెలిజెంట్ టచ్ కంట్రోల్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
ఈ రియల్‌మి బడ్స్ సింగిల్ ఛార్జింగ్ తో 40 గంటల బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 8 గంటల ప్లే బ్యాక్ సమయాన్ని పొందవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ IP55 రేటింగ్‌తో వాటర్ ఫ్రూఫ్ గా అందుబాటులోకి వచ్చాయి.
రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ప్రో ధర రూ.4999 గా ఉంది. జూన్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి తొలి సేల్ ప్రారంభం అవుతుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.800 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ ఇయర్‌బడ్స్ ను రూ.4199 కే కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
* ఇయర్‌బడ్స్‌తోపాటు రియల్‌మి సంస్థ ఇవాళ GT 6 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీ సహా 6.78 అంగుళాల FHD+ 8T LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.40999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.4000 వరకు తగ్గింపును పొందవచ్చు.
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.69 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 808 కెమెరాను కలిగి ఉంది. మరియు 50MP శాంసంగ్ JN5 టెలిఫొటో సెన్సార్, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను అమర్చారు. f/2.45 అపేచర్‌తో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








