Home
Gadgets

48 గంటల ప్లేబ్యాక్‌ టైం, ANC, AI ఫీచర్‌లతో రియల్‌మి బడ్స్‌ ఎయిర్‌ 7 ప్రో .. ధర, సేల్‌ వివరాలు..!

రియల్‌మి నుంచి బడ్స్‌ ఎయిర్‌ 7 ప్రో ఇయర్‌బడ్స్‌ విడుదల అయింది. ఈ ఇయర్‌బడ్స్‌ 53dB యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC) సపోర్టును కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఇయర్‌బడ్స్‌ AI ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. ఈ రియల్‌మి బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 48 గంటల ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు. ఈ బడ్స్‌తోపాటు రియల్‌మి GT 7 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. ఇందులో రియల్‌మి GT 7, GT 7T, GT 7 డ్రీమ్‌ ఎడిషన్ ఫోన్‌ కూడా విడుదల అయింది.

రియల్‌మి బడ్స్ ఎయిర్‌ 7 ప్రో ఇయర్‌బడ్స్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
రియల్‌మి బడ్స్ ఎయిర్‌ 7 ప్రో ఇయర్‌బడ్స్‌ (Realme Buds Air 7 pro Earbuds) ఇన్‌-ఇయర్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ బడ్స్ IP55 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. డిజైన్‌ పరంగానూ ఈ బడ్స్‌ ఆకట్టుకుంటాయి.

Realme Buds Air 7 pro

ANC సపోర్టు :
ఈ బడ్స్‌ 11mm, 6mm డ్యూయల్‌ dac డ్రైవర్లను కలిగి ఉంది. మరియు 6 మైక్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC) సపోర్టుతో లాంచ్‌ అయింది. మరియు 53dB ANC సపోర్టు చేస్తుంది. Hi-Res ఆడియో వైర్‌లైస్‌ సర్టిఫికేషన్‌ మరియు LHDC ఆడియో కోడిక్‌ను సపోర్టు చేస్తుంది.

అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లు :
ఈ రియల్‌మి బడ్స్‌ ఎయిర్‌ 7 ప్రో ఇయర్‌బడ్స్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. AI లైవ్ ట్రాన్స్‌లేటర్‌, ఫేస్‌ టూ ఫేస్‌ ట్రాన్స్‌లేటర్, AI inquiry టూల్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు గూగుల్‌ జెమిని AI వాయిస్‌ అసిస్టెంట్‌ ను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఈ బడ్స్‌ బ్లూటూత్ 5.4, డ్యూయల్ డివైస్‌ కనెక్టివిటీ, స్విఫ్ట్‌ పెయిర్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ రియల్‌మి TWS బడ్స్‌ 45ms లో లేటెన్సీ ని సపోర్టు చేస్తుంది. ఫలితంగా గేమింగ్‌ సమయంలో మెరుగైన అనుభూతిని పొందవచ్చని తెలుస్తోంది. ఈ బడ్స్‌ USB-C ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తాయి.

సింగిల్‌ ఛార్జింగ్‌తో 48 గంటల ప్లేబ్యాక్‌ టైం :
ఈ రియల్‌మి బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 48 గంటల ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చు. అయితే LHDC ఫీచర్‌ను ఉపయోగిస్తుంటే.. ప్లేబ్యాక్ టైం 28 గంటలుగా ఉంటుంది. 10 నిమిషాల క్విక్‌ ఛార్జింగ్‌ తో 11 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు.

రియల్‌మి బడ్స్ ఎయిర్‌ 7 ప్రో ఇయర్‌బడ్స్‌ :
రియల్‌మి బడ్స్‌ ధర రూ.5499 గా ఉంది. మే 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. రియల్‌మి ఇ-స్టోర్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా సహా ఇతర రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. రేసింగ్ గ్రీన్‌, మెటాలిక్‌ గ్రే, గ్లోరీ బీజ్‌, ఫెయిరీ రెడ్‌ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో డిస్కౌంట్‌ను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Buds Air 7 pro Earbuds launched in india with 48 hours of playback time
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X