Home
Gadgets

ఆకట్టుకొనే డిజైన్‌, స్మార్టర్‌ నాయిస్‌ మేనేజ్‌మెంట్‌తో రియల్‌మి బడ్స్‌.. ఎప్పుడు విడుదల కానున్నాయంటే?

రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌ లోకి జనవరి 6 వ తేదీన రియల్‌మి 16 ప్రో సిరీస్‌ విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్‌ సహా కెమెరా వివరాలు ఇటీవలే వెల్లడయ్యాయి. ఈ సిరీస్‌ లో భాగంగా అందుబాటులోకి వచ్చే రియల్‌మి 16 ప్రో, ప్రో ప్లస్‌ మోడల్స్‌ రెండు కూడా 200MP కెమెరాను కలిగి ఉంటాయి. దీంతోపాటు డిజైన్‌ పరంగానూ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపింది.

ఎప్పుడు విడుదల కానుంది :
రియల్‌మి 16 ప్రో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లతోపాటు రియల్‌మి బడ్స్‌ కూడా అదే తేదీన లాంచ్‌ కానుంది. రియల్‌మి బడ్స్‌ ఎయిర్‌ 8 పేరుతో (Realme Buds Air 8) విడుదల కానుంది. అయితే ఈ బడ్స్‌ స్పెసిఫికేషన్‌ ల వివరాలను షేర్‌ చేయలేదు. స్మార్ట్‌ఫోన్‌ తరహాలోనే బడ్స్‌ డిజైన్‌ సహా ఇతర ఫీచర్‌ లను ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Realme buds air 8 telugu news

సౌకర్యవంతమైన డిజైన్! :
రియల్‌మి 16 ప్రో సిరీస్‌ తరహాలోనే బడ్స్‌ ఎయిర్‌ 8 ను కూడా నావోటో ఫుకాసావా సహకారంతో రూపొందించారు. ఈ బడ్స్ సౌకర్యవంతమైన డిజైన్‌ సహా మెరుగైన అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది.

స్మార్ట్‌ర్‌ నాయిస్‌ మేనేజ్‌మెంట్ :
ఈ రియల్‌మి బడ్స్ స్మార్టర్‌ నాయిస్‌ మేనేజ్‌మెంట్, క్లియర్‌ వాయిస్‌ ఉండే విధంగా మెరుగైన ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ (ANC) కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌ లో సేల్‌ :
రియల్‌మి బడ్స్‌ ఎయిర్‌ 8 భారత్‌ లో జనవరి 6 వ తేదీ న విడుదల కానున్నాయి. ఈ బడ్స్ సేల్‌ రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో ప్రారంభం అయింది. విడుదల సమయంలో సేల్ వివరాలు వెల్లడికానున్నాయి.

200MP కెమెరా :
రియల్‌మి 16 ప్రో సిరీస్‌ తోపాటే ఈ బడ్స్‌ విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌ గురించి తొలుత డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి. అనంతరం కెమెరా వివరాలు వెల్లడయ్యాయి. ఈ సిరీస్‌ లో లాంచ్‌ అవుతున్న రెండు ఫోన్‌ లు 200MP కెమెరాను కలిగి ఉంటాయి. అయితే ప్రో ప్లస్‌ మోడల్‌ ఫోన్‌ ఫుల్‌ పిక్సల్‌ ఆటో జూమ్‌ సపోర్టు ఉంటుందని తెలుస్తోంది.

ప్రత్యేక ఇమేజింగ్‌ టెక్నాలజీ :
కెమెరా విభాగం కోసం LumaColor Image టెక్నాలజీని కలిగి ఉంటుంది. స్కిన్‌ టోన్‌, లైటింగ్, టెక్చర్‌ నేచురల్‌ గా ఉండేలా ఈ టెక్నాలజి పనిచేస్తుంది. అన్ని లైటింగ్‌ కండిషన్‌ లలో మెరుగైన ఫోటోల కోసం ఈ టెక్నాలజీ పనిచేస్తుందని తెలుస్తోంది.

దీంతోపాటు AI Edit Genie వంటి అనేక ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ సిరీస్ ఫోన్‌లు (Realme 16 Pro Series) ఎంత ధరలో అందుబాటులోకి వస్తాయనే అంచనా వివరాలు ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme buds air 8 confirmed to launch on january 6 in india here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X