Home
Gadgets

58 గంటల బ్యాటరీ లైఫ్‌, ANC సపోర్టుతో ఇయర్‌బడ్స్‌.. సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే?

Realme Buds Air 8 : భారత్‌ మార్కెట్‌లో రియల్‌మి సంస్థ జనవరి 6 వ తేదీన రియల్‌మి 16 ప్రో సిరీస్, రియల్‌మి ప్యాడ్‌ 3 ట్యాబ్లె్ట్‌, రియల్‌మి బడ్స్‌ ఎయిర్‌ 8 విడుదల చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌ ANC సహా అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ బడ్స్‌ సేల్‌ జనవరి రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 58 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని రియల్‌మి తెలిపింది. ఈ ఇయర్‌బడ్స్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్‌ వివరాలు.

రియల్‌మి బడ్స్ ఎయిర్‌ 8 ధర, సేల్‌ :
ఈ ఇయర్‌బడ్స్‌ ధర రూ.3799 గా ఉంది. తొలి సేల్‌లో భాగంగా రూ.200 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.3599 కే కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్‌ సేల్‌ జనవరి 16 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది.

Realme Buds Air 8 sale

రియల్‌మి బడ్స్‌ ఎయిర్ 8 ను రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్‌ మాస్టర్‌ గ్రే, మాస్టర్‌ గ్రే, మాస్టర్‌ పర్పుల్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

రియల్‌మి బడ్స్‌ ఫీచర్లు :
రియల్‌మి బడ్స్‌ SBC, AAC, LHDC ఆడియో Codecs సపోర్టుతో 11mm, 6mm డ్యూయల్‌ డ్రైవర్‌లను కలిగి ఉంది. ఈ బడ్స్‌ Hi-Res ఆడియో సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు LHDC 5.0 సపోర్టు చేస్తుంది. Low Frequency అవుట్‌పుట్‌ కోసం Nextbass అల్గారిథమ్‌ను కలిగి ఉంది.

ANC ఫీచర్ :
ఈ ఇయర్‌బడ్స్‌ స్పేషియల్‌, డైనమిక్‌ ఆడియో ప్రాసెసింగ్‌ ఆధారిత HRTF తో కూడిన 3D స్పేషియల్‌ ఆడియో సపోర్టును కలిగి ఉంది. రియల్‌మి బడ్స్‌ 55dB రియల్‌టైమ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ (ANC) సపోర్టును కలిగి ఉంది. ఇయర్‌బడ్స్‌ను వినియోగించే విధానం ఆధారంగా నాయిస్‌ క్యాన్సిలేషన్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు.

Realme Buds Air 8 sale

రియల్‌మి లింక్‌ యాప్‌ ద్వారా ANC మోడ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. యూజర్ల అవసరాలకు తగినట్లుగా బ్యాలెన్సడ్, డీప్‌, మైల్డ్‌ మోడ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ బడ్స్‌లో ఒక్కో బడ్‌కు 3 మైక్రోఫోన్ల చొప్పున మొత్తంగా 6 మైక్రోఫోన్‌లు ఉంటాయి. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
ఈ బడ్స్‌ లో అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు ఉన్నాయి. ఏఐ లైవ్‌ ట్రాన్స్‌లేషర్‌, ఫేస్‌ టు ఫేస్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 30 కంటే ఎక్కువ భాషలను సపోర్టు చేస్తుంది. గూగుల్‌ జెమిని ఆధారిత ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ 2.0 సపోర్టు చేస్తుంది. ఈ బడ్స్‌ IP55 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

రియల్‌మి బడ్స్‌ ఎయిర్‌ 8 ఇయర్‌బడ్స్‌లో ఒక్కో బడ్‌ 62mAh బ్యాటరీని కలిగి ఉంది. ఛార్జింగ్‌ కేస్‌ 530mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ANC ఆఫ్‌ చేసి, AAC ఆడియో 50 శాతం వాల్యూమ్‌లో వినియోగిస్తే.. 58 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని రియల్‌మి చెబుతోంది. ఈ బడ్స్‌ను పూర్తిగా ఛార్జింగ్‌ చేసేందుకు రెండు గంటల సమయం పడుతుందని రియల్‌మి తెలిపింది. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా రియల్‌మి బడ్స్ ఎయిర్‌ 8 ఇయర్‌బడ్స్‌ బ్లూటూత్‌ 5.4 తో పనిచేస్తుంది. 10 మీటర్ల రేంజ్‌ వరకు బ్లూటూత్‌ సక్రమంగా పనిచేస్తుందని రియల్‌మి చెబుతోంది. ఈ బడ్స్‌ 3 డివైజ్‌ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. గేమింగ్‌ సమయంలో 45ms Low లేటెన్సీని అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Buds Air 8 Earbuds with 58 hours of battery life sale to start from january 16 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X