Home
Gadgets

ప్రత్యేక డిజైన్‌తో ఇయర్‌బడ్స్‌.. సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే?

Realme Buds Clip Earbuds Sale : రియల్‌మి సంస్థ భారత్‌ మార్కెట్లో నిన్న (జనవరి 29) 10,001mAh భారీ బ్యాటరీతో రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీంతోపాటు రియల్‌మి బడ్స్‌ క్లిప్‌ ఇయర్‌బడ్స్‌ కూడా లాంచ్‌ అయ్యాయి. ఈ ఇయర్‌బడ్స్‌ ఓపెన్‌ ఇయర్‌ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఈ బడ్స్‌ ENC, 3D స్పేషియల్‌ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే? :
భారత్‌ మార్కెట్లో రియల్‌మి బడ్స్‌ క్లిప్‌ ఇయర్‌బడ్స్‌ ధర రూ.5999 గా ఉంది. ఈ బడ్స్‌ సేల్‌ ఫిబ్రవరి 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Realme Buds clip earbuds sale

ప్రారంభ సేల్‌లో భాగంగా రూ.500 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.5499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌ టైటానియం గ్లోల్డ్‌, టైటానియం బ్లాక్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తాయి.

ఏఐ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ :
ఈ రియల్‌మి బడ్స్‌ క్లిప్‌ ఇయర్‌బడ్స్ నెక్ట్స్‌బాస్‌ అల్గారిథం ఆధారిత బాస్‌ బూస్ట్ తో కూడిన 11mm డ్యూయల్‌ మాగ్నైట్ డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు 3D స్పేషియల్‌ ఆడియో ఫీచర్ కూడా ఉంది. ఏఐ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ కాల్‌ క్వాలిటీని మెరుగుపరుస్తుంది.

ఫీచర్లు :
ఈ ఇయర్‌బడ్స్‌ లో AI ట్రాన్స్‌లేటర్‌ ఫీచర్‌ ఉంది. Next AI ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫీచర్‌ 30 భాషల్లో రియల్‌టైం ట్రాన్స్‌లేషన్‌ను అందిస్తుంది. బ్లూటూత్‌ 5.4, డ్యూయల్‌ డివైజ్‌ కనెక్టివిటీ, మైక్రోసాఫ్ట్‌ షిఫ్ట్‌ పెయిర్, SBC, AAC కోడిక్స్‌ను సపోర్టు చేస్తుంది. 45ms low latency ని కలిగి ఉంది.

రియల్‌మి బడ్స్‌ క్లిప్‌ ఇయర్‌బడ్స్‌ ఛార్జింగ్‌ కేస్‌ 530mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే బడ్స్‌ ఒక్కొక్కటి 45mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి 36 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చని సంస్థ చెబుతోంది. USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

రియల్‌మి P4 పవర్‌ 5G :
బడ్స్‌తోపాటు రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల అయింది. ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల 1.5K 4D కర్వ్‌+ హైపర్‌గ్లో డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉంది. 8MP అల్ట్రావైడ్ లెన్స్‌, 16MP సెల్ఫీ కెమెరాలున్నాయి. 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 10001mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.25999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Buds clip earbuds sale to start from February 5 in india Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X