40 గంటల బ్యాటరీ లైఫ్, హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్టుతో రియల్‌మి బడ్స్ N1.. విడుదల తేదీ వెల్లడి..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ లు, గ్యాడ్జెట్ ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి త్వరలో ఇయర్‌బడ్స్ విడుదల కానున్నాయి. రియల్‌మి బడ్స్ N1 లాంచ్ పై (Realme Buds N1 TWS Earbuds) సంస్థ అధికారిక ప్రకటన చేసింది. రియల్‌మి 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ సహా బడ్స్ సెప్టెంబర్ 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ బడ్స్‌కు సంబంధించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ బడ్స్ డిజైన్ రియల్‌మి ఇండియా, అమెజాన్ ప్లాట్‌ఫాం లో విడుదలైంది.
రియల్‌మి బడ్స్ N1 డిజైన్ పరంగా ఛార్జింగ్ కేస్, ఇయర్‌బడ్స్ ఆకట్టుకున్నాయి. ఈ బడ్స్ వృత్తాకార స్టెమ్ మరియు సిలికోన్ టిప్స్‌తో కూడిన ఇన్- ఇయర్ డిజైన్ ను కలిగి ఉన్నాయి. ఈ బడ్స్ కింది వైపు ఛార్జింగ్ కనెక్టర్లు ఉన్నాయి. ఛార్జింగ్ కేస్ కింది వైపు LED ఛార్జింగ్ ఇండికేటర్లను కలిగి ఉంది.

రియల్‌మి బడ్స్ N1 స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి బడ్స్ 12.4mm బాస్ డ్రైవర్లను కలిగి ఉన్నాయి. ఈ బడ్స్ 360 డిగ్రీల స్పేషియల్ ఆడియో అనుభూతిని అందిస్తాయి. సింగిల్ ఛార్జింగ్‌తో ఈ బడ్స్, ఛార్జింగ్ కేస్ 40 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని రియల్‌మి సంస్థ చెబుతోంది.
ఈ బడ్స్ 46dB వరకు హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ పైన పనిచేస్తాయి. ఈ TWS (ట్రూ వైర్‌లెస్ స్టీరియో) ఇయర్‌బడ్స్ IP55 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రిసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇయర్‌బడ్స్ రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్ సహా అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
* రియల్‌మి బడ్స్‌తోపాటు నార్జో 70 5G స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేయనుంది. రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. విడుదలైన డిజైన్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ పవర్, వాల్యూమ్ బటన్‌లను కుడి వైపున కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7.6mm థిక్‌నెస్, 185 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
ఇప్పటి వరకు లీకైన వివరాల ఆధారంగా రియల్‌మి హ్యాండ్‌సెట్ నాలుగు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. 6GB ర్యామ్ +128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుందని తెలుస్తోంది. మరియు 50MP ప్రైమరీ కెమెరా సహా 8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








