Home
Gadgets

Realme నుంచి కొత్త ఇయర్‌బడ్ లు ! లాంచ్ , ధర వివరాలు

Realme నుంచి ఏప్రిల్ 15న P1 సిరీస్‌తో పాటు భారతదేశంలో కంపెనీ తదుపరి బడ్జెట్ TWS ఇయర్‌బడ్స్‌ బడ్స్ T110 లాంచ్‌ను సంస్థ ధృవీకరించింది. ఈ బడ్స్‌ను ఈ వారం ప్రారంభంలో చైనాలో ప్రవేశపెట్టారు. మరియు ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ రియల్‌మి బడ్స్ T110 ఇయర్‌బడ్ లు 10mm డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం AI ENCతో వస్తాయి మరియు మొత్తం ప్లేబ్యాక్ 38 గంటల వరకు ఉంటుంది.

Realme Buds T110 Set To Launch On April 15  12PM In India  Price Specifications And Sale Details

చైనాలో ఇదివరకే ఈ పరికరం లాంచ్ అయినందున దీని స్పెసిఫికేషన్ల వివరాలు మనకు తెలిసినవే. ధృవీకరించిన బ్లూటూత్ 5.4, 88ms తక్కువ లేటెన్సీ గేమింగ్ మోడ్, బడ్స్ కోసం IPX5 స్ప్లాష్ రెసిస్టెంట్ రేటింగ్‌లు, 4.09g లైట్-వెయిట్ బాడీ, 7 గంటల స్వతంత్ర బ్యాటరీతో 40mAh బ్యాటరీ మరియు పాత బడ్స్ మాదిరిగానే రియల్‌మీ లింక్ యాప్‌తో అనుకూలీకరణ ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఇయర్‌బడ్‌లు చైనాలో నలుపు, తెలుపు మరియు నీలం రంగులలో లాంచ్ అయ్యాయి. అయితే, భారత మార్కెట్లో మాత్రం ఆకుపచ్చ రంగు మాత్రమే ప్రస్తావించబడింది.

రియల్‌మే బడ్స్ T110 చైనా సేల్ జాబితా ప్రకారం, లాంచ్ తర్వాత realme.com లో విక్రయించబడుతుంది. చైనాలో వీటి ధర 129 యువాన్లు (USD 17.2 ) అంటే భారత మార్కెట్లో రూ. 1,485 ఇదే ధరలో భారత్ మార్కెట్లో కూడా లాంచ్ కావొచ్చని అంచనాలున్నాయి.భారత దేశంలో అధికారిక ధర కోసం లాంచ్ ఆవరకు వేచి చూడాల్సిందే.

రియల్‌మి ప్యాడ్‌ 2.. 120Hz సపోర్టుతో 2k డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 33W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో 8360mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్‌ మెరుగైన అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది. అయితే ఈ రియల్‌మి ప్యాడ్‌ వైఫై గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రియల్‌మి ప్యాడ్ 2 Wi-Fi తోపాటు రియల్‌మి P1 5G సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌లు కూడా విడుదల కానున్నాయి. రూ.15,000 కంటే తక్కువ ధరకే ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ ధర సెగ్మెంట్‌లో 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో అమోలెడ్‌ డిస్‌ప్లే మరియు 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌ నెస్‌ను కలిగి ఉన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదేనని రియల్‌మి తెలిపింది.

ఈ సిరీస్‌ TUV Rhenland eye Protection సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. P1 5G స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటి 7050 SoC చిప్‌ సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెవెన్ లేయర్‌ VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. విడుదల దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Buds T110 Set To Launch On April 15, 12PM In India. Price,Specifications And Sale Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X