తక్కువ ధరలో రియల్‌మి నుంచి నెక్‌బ్యాండ్, ఇయర్‌బడ్స్ విడుదల.. ఫీచర్లు, ధర, సేల్ వివరాలు..!
రియల్‌మి నుంచి ఇవాళ భారత్ మార్కెట్‌లోకి GT 6T స్మార్ట్‌ఫోన్ సహా రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో, రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 లాంచ్ అయ్యాయి. ఈ రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో నెక్‌బ్యాండ్ AI ENC కాల్ నాయిస్ రిడక్షన్ ఫీచర్ సహా డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.
రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో నెక్‌బ్యాండ్ ఫీచర్లు :
రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో (Realme buds wireless 3 neo launched) నెక్‌బ్యాండ్ 13.4mm బాస్ బూస్ట్ డ్రైవర్ యూనిట్‌ను కలిగి ఉంది. దీని ద్వారా నాణ్యమైన ఆడియో అనుభూతి సొంతం అవుతుందని తెలుస్తోంది.

ఈ రియల్‌మి బడ్స్ బ్లూటూత్ 5.3 వెర్షన్ పైన పనిచేస్తాయి. మరియు రెండు పరికరాలను ఒకేసారి కనెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. గూగుల్ ఫాస్ట్ పెయిర్ ద్వారా మెరుగైన అనుభూతి సొంతమవుతుంది. దీంతోపాటు ENC ఫీచర్ ద్వారా కాలింగ్ సమయంలో నాయిస్‌ను గణనీయంగా తగ్గిస్తుంది.
దీంతోపాటు ఈ రియల్‌మి బడ్స్ ప్రత్యేక గేమింగ్ మోడ్‌ను కలిగి ఉంటాయి. మరియు IP55 రేటింగ్ తో స్వెచ్, వాటర్ రెసిస్టెంట్‌గా లాంచ్ అయ్యాయి. సింగిల్ ఛార్జింగ్ ద్వారా గరిష్ఠంగా 32 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్‌ను పొందవచ్చని సంస్థ తెలిపింది. మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 10 నిమిషాల ఛార్జింగ్ ద్వారా 6 గంటలపాటు ప్లేటైంను పొందవచ్చని పేర్కొంది.

రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో ఇయర్‌ఫోన్స్ ధర రూ.1,299 గా ఉంది. ఈ నెక్‌బ్యాండ్‌ను ఆక్వా బ్లూ, ప్యూర్ బ్లాక్ మరియు ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ నెక్‌బ్యాండ్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు realme.com కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.1,199 కే కొనుగోలు చేయవచ్చు. ఇవాళ్టి నుంచి కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ఇయర్‌బడ్స్ ఫీచర్లు :
రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ఇయర్‌బడ్స్ 12.4mm డ్రైవర్‌ను కలిగి ఉంటుంది. 50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), 6 మైక్ ENC ఫీచర్లను కలిగి ఉంది. 55ms సూపర్ లో లేటెన్సీ మోడ్‌తో లాంచ్ అయింది. మరియు గూగుల్ ఫాస్ట్ పెయిర్. మైండ్‌ఫ్లో మోడ్‌లతో వచ్చింది.

ఈ బడ్స్ (Realme Buds Air 6 Launched) సింగిల్ ఛార్జింగ్ ద్వారా 40 గంటలపాటు ప్లేబ్యాక్ టైంను పొందవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ ఇయర్‌బడ్స్ ధర రూ.2999 గా ఉంది. ఫ్లేమ్ సిల్వర్, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ఇయర్‌బడ్స్ సేల్ మే 27 నుంచి ప్రారంభం అవుతుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








