32 గంటల బ్యాటరీ లైఫ్‌తో రియల్‌మి నుంచి నెక్‌బ్యాండ్.. భారత్‌లో విడుదల తేదీ ఖరారు..!
రియల్‌మి నుంచి త్వరలో ఇయర్‌బడ్స్ విడుదల కానున్నాయి. మే 22వ తేదీన రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్‌తోపాటు రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో నెక్‌బ్యాండ్ (Realme Buds Wireless 3 Neo) విడుదల కానున్నాయి. సేల్ కూడా అదే రోజు ప్రారంభం కానుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి.
రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో నెక్‌బ్యాండ్ యువతను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించామని రియల్‌మి తెలిపింది. ఈ నెక్‌బ్యాండ్ ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుందని తెలిపింది. గతం కంటే భిన్నంగా మెరుగైన ఆడియో అనుభూతిని కల్పిస్తుందని తెలిపింది.

రియల్‌మి బడ్స్ వైర్‌లైస్ 3 నియో ఇయర్‌బడ్స్ 13.4 mm డైనమిక్ బాస్ డ్రైవర్లను కలిగి ఉంటాయి. మరియు మెరుగైన పనితీరును కలిగిస్తాయి. దీంతోపాటు ఈ ఇయర్‌బడ్స్ AI ENC (ఎలక్ట్రానిక్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా కాల్స్ మాట్లాడే సమయంలో నాయిస్‌ను తగ్గిస్తుంది. మరియు 45ms అల్ట్రా లో లేటెన్సీ తో విడుదల కానుంది.
దీంతోపాటు ఈ రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో సింగిల్ ఛార్జింగ్ ద్వారా గరిష్టంగా 32 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందించనుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఇయర్‌బడ్స్ గూగుల్ ఫాస్ట్ పెయిర్ నెక్‌బ్యాండ్, IP55 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా రానుంది.
రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో ఇయర్‌బడ్స్ ధర రూ.1299 గా ఉంది. మే 22న లాంచ్ కానుండగా.. అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. రియల్‌మి వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో ఇయర్‌బడ్స్.. బ్లాక్, బ్లూ, గ్రీన్ వంటి మూడు రంగుల్లో లభించనున్నాయి.
అదేరోజు భారత్ మార్కెట్‌లోకి రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ఇయర్‌బడ్స్ విడుదల కానున్నాయి. రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ఇయర్‌బడ్స్ గత సంవత్సరం విడుదలైన బడ్స్ ఎయిర్ 5 కు తర్వాత తరం వెర్షన్‌గా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఇయర్‌బడ్స్ Hi-Res సర్టిఫైడ్ TWS గా రానున్నాయని సంస్థ వెల్లడించింది. 12.4mm డీప్ బాస్ డ్రైవర్‌ను కలిగి ఉంటుంది, 50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్టును కలిగి ఉంటుంది.
ఈ ఇయర్‌బడ్స్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సపోర్టుతో 6 మైక్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఫోన్ కాల్స్ సమయంలో మెరుగైన అనుభూతిని పొందుతారని పేర్కొంది. దీంతోపాటు 55ms లేటెన్సీని కలిగి ఉంటుందని సమాచారం. ఫలితంగా గేమింగ్ సమయంలో మెరుగైన పనితీరు కనబరుస్తుందని సమాచారం. రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 ధరపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
** రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో విడుదల కానుందని సమాచారం. దీంతోపాటు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 32MP IMX615 కెమెరాను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








