అదిరిపోయే డిజైన్, 38 గంటల బ్యాటరీ లైఫ్, ANC, ENC ఫీచర్‌లతో రియల్‌మి నెక్‌బ్యాండ్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి భారత్ మార్కెట్‌లోకి (Realme india) జనవరి 16 వ తేదీ రియల్‌మి 14 ప్రో 5G సిరీస్ లాంచ్ చేస్తున్నట్లు ఇప్పటికే సంస్థ ప్రకటన చేసింది. అయితే తాజాగా రియల్‌మి తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి కీలక వివరాలు వెల్లడించింది. అదిరిపోయే డిజైన్, బ్యాటరీ లైఫ్ తో రియల్‌మి నెక్‌బ్యాండ్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.
రియల్‌మి బడ్స్ విడుదల, సేల్ వివరాలు :
రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 5 ANC హెడ్‌సెట్‌ను (Realme Buds Wireless 5 ANC) జనవరి 16 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. డిజైన్ సహా స్పెసిఫికేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ రియల్‌మి నెక్‌బ్యాండ్ గ్రే, యెల్లో రంగుల్లో భారత్ లో అందుబాటులో ఉంటాయి. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ తోపాటు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌లలో (Flipkart) లభించనున్నాయి.

నాయిస్ క్యాన్సిలేషన్ :
ఈ ఇయర్‌ఫోన్స్ 50dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్, అడాప్టివ్ 3 లెవల్ నాయిస్ రిడక్షన్ మరియు 400Hz అల్ట్రా వైడ్ బాండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ను సపోర్టు చేస్తుందని రియల్‌మి తన ప్రకటనలో తెలిపింది. మరియు ఈ బడ్స్ ENC కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.
38 గంటలపాటు బ్యాటరీ లైఫ్ :
రియల్‌మి బడ్స్ వైర్‌లైస్ 5 ANC సింగిల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 38 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ హెడ్‌సెట్ IP55 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉండనుంది. అయితే ఈ హ్యాడ్‌సెట్ ఎంత ధరలో అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
రియల్‌మి 14 ప్రో 5G సిరీస్ కూడా అదే రోజుల విడుదల కానుంది. ఈ సిరీస్ లో భాగంగా రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో + హ్యాండ్‌సెట్ లు లాంచ్ కానున్నాయి. ప్రో+ మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్, బేస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ ఫ్లాష్ కలిగిన ఫోన్‌గా లాంచ్ కానుందని రియల్‌మి తెలిపింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 6000mAh బ్యాటరీతో విడుదల కానున్నాయని తెలుస్తోంది. పెర్ల్ వైట్, బికనీర్ పర్పుల్, జైపూర్ పింక్, స్పీడ్ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. పెర్ల్ వైట్ కలర్ వేరియంట్.. కలర్ చేంజింగ్ టెక్నాలజీతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
రియల్‌మి 14 ప్రో సిరీస్ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ సహా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు IP66, IP68 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా విడుదల కానుందని తెలుస్తోంది. అయితే త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








