అతి తక్కువ ధరలోనే విడుదలైన రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్!!

|

ఇండియాలో రియల్‌మి సంస్థ తన హవాను కొనసాగిస్తున్నది. సరసమైన ధరల వద్ద స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడంతో పాటుగా స్మార్ట్ వాచ్ లను మరియు బడ్స్ వంటి మొబైల్ సంబంధిత పరికరాలను కూడా సరసమైన ధరల వద్ద విడుదల చేస్తోంది. వీటికి అనుగుణంగా ఇప్పుడు తక్కువ ధర వద్ద వైర్‌లెస్ ఛార్జర్‌ను ఈ రోజు విడుదల చేసింది.

 

రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్‌

రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్‌

వైర్‌లెస్ పద్దతిలో 10W ఫాస్ట్ ఛార్జింగ్ తో ఛార్జ్ చేసే వైర్‌లెస్ ఛార్జర్‌ను రూ.899 ధర వద్ద విడుదల చేసింది. ఈ ఛార్జింగ్ ప్యాడ్ మధ్యలో రియల్‌మి బ్రాండింగ్‌తో వృత్తాకార డిజైన్ ను కలిగి ఉంది. ఇది రియల్‌మి యొక్క వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: గూగుల్ ప్లే స్టోర్ లో 29 ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్ లు !! అవి ఇవే...Also Read: గూగుల్ ప్లే స్టోర్ లో 29 ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్ లు !! అవి ఇవే...

రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్ స్పెసిఫికేషన్స్
 

రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి యొక్క ఈ కొత్త వైర్‌లెస్ ఛార్జర్‌ కేవలం బూడిద రంగు కలర్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఇది దీని యొక్క అనుకూల పరికరాలను 10W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో ఛార్జింగ్ చేయగలుగుతుంది. ఇది USB టైప్-C మద్దతును కలిగి ఉండి ఛార్జింగ్ ప్యాడ్ 9.9-mm మందంతో వృత్తాకార ఆకారంలో ఉంటుంది. ఈ వైర్‌లెస్ ఛార్జర్ నాన్-రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఛార్జ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. ప్రస్తుతం రియల్‌మి బడ్స్ ఎయిర్ మాత్రమే వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో వస్తున్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతును ఇచ్చే స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మి ఇంకా విడుదల చేయలేదు.

రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్ ఛార్జింగ్ స్పీడ్

రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్ ఛార్జింగ్ స్పీడ్

రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్ ప్యాడ్ క్వి ఛార్జింగ్ సర్టిఫికేట్ ను కలిగి ఉంది. కావున మీరు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే ఏదైనా ఫోన్ లేదా డివైస్ ను దీనితో ఛార్జ్ చేయవచ్చు. ఐఫోన్‌ల ఛార్జింగ్ స్పీడ్ 7.5W కి పరిమితం చేయబడింది. ఈ ఛార్జర్ యొక్క ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఇది క్రెడిట్ కార్డులు లేదా ప్యాడ్‌లో ఉంచిన కీలు వంటి ఛార్జింగ్‌ అంశాలను యాక్టీవెట్ చేయకుండా చూసుకుంటాయి. వీటితో పాటు ఛార్జింగ్ ప్యాడ్ స్వయంచాలకంగా పరికరానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుందని కంపెనీ నిర్ధారించింది. ఈ విధంగా ఫోన్ లేదా మరే ఇతర పరికరం అధికంగా ఛార్జ్ చేయబడదు.

Best Mobiles in India

English summary
Realme Introduced 10W Speed Wireless Charger in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X