Realme నుంచి కొత్త Night lamp ! ఈ రోజే లాంచ్.. ధర, ఫీచర్లు చూడండి.
రియల్ మీ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ పరికరాన్ని ఈ రోజు భారత మార్కెట్లో విడుదల చేసింది. Realme Narzo 30 తో పాటు బడ్స్ ఎయిర్ 2 ఇయర్‌బడ్స్ పరికరంతో ఈ పరికరాన్ని ఈ రోజు భారతదేశంలో విడుదల చేసారు. మోషన్ సెన్సార్‌లతో కూడిన ఈ పరికరం ఎలా పనిచేస్తుందో, ఏ ధరతో లాంచ్ చేసారు వంటి సమాచారాన్ని ఈ పోస్ట్‌లో చూడవచ్చు.

రియల్మీ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్
రియల్మ్ మోషన్ యాక్టివేటెడ్ నైట్‌లైట్ పరికరం 365 రోజుల బ్యాటరీ జీవితంతో వస్తుంది. ఇది మోషన్ డిటెక్షన్ సెన్సార్లను కలిగి ఉంది. ఇది మనుషుల కదలికలో ఉన్నప్పుడు స్వయంచాలకంగా ఆన్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 2,800 K డిప్ వీక్ లైట్ ఫీచర్‌తో వస్తుంది.

ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) మోషన్ సెన్సార్
రియల్మీ మోషన్ యాక్టివేటెడ్ నైట్‌లైట్ గురించి కీలక వివరాలను విడుదల చేయడానికి ముందు, రియల్మీ ప్రత్యేకమైన మైక్రోసైట్‌ను అభివృద్ధి చేసింది. ఈ పరికరం ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) మోషన్ సెన్సార్‌తో వృత్తాకార మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్‌ను ప్రదర్శిస్తుంది. ఇది 120 డిగ్రీల విస్తీర్ణంలో ఉంటుంది.

ఆటోమేటిక్ ఆఫ్ ఫీచర్
ఎవరైనా పరికరం యొక్క స్థానం గుండా వెళుతున్నప్పుడు లేదా పరికరం యొక్క ప్రదేశంలోకి ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్ గా వెలుగుతుంది. ప్రజలు కదలికను గుర్తించిన తర్వాత వచ్చే 15 సెకన్లలో లైట్లు మల్లి దానంతట అవే ఆపివేయబడతాయి. అంటే దీనికి ఆటోమేటిక్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. అలాగే, ఇది లైట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది, ఇది లైట్ల ప్రకాశాన్ని సర్దుబాటు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

మరి ధర ఎలా ఉంటుంది?
రియల్మీ మోషన్ యాక్టివేటెడ్ నైట్‌లైట్ మూడు AAA బ్యాటరీల శక్తిని ఉపయోగిస్తుంది. ప్యాకేజీ చేసిన బ్యాటరీలు 365 రోజులు ఉంటాయని కంపెనీ పేర్కొంది. రియల్మీ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ ధర రూ.599 గా ప్రకటించంబడింది. తక్కువ ధర వద్ద మంచి ఫీచర్లతో ఉన్న స్మార్ట్ గాడ్జెట్ గా ఇది చెప్పుకోవచ్చు. ఈ పరికరం ఫ్లిప్కార్ట్ మరియు Realme వెబ్సైటు ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








