రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్లో ఏప్రిల్ 15 P1 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు సహా రియల్‌మి ప్యాడ్ 2 (Wi-Fi) వేరియంట్ సహా బడ్స్ T110 ను విడుదల చేసింది. ఈ ప్యాడ్ 2 (Realme Pad 2 wifi variant sale) ఇవాళ్టి నుంచి రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ realme.com సహా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. బడ్స్ T110 సేల్ కూడా ప్రారంభం అయింది.
రియల్‌మి ప్యాడ్ 2 Wi-Fi స్పెసిఫికేషన్లు :
రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్.. 11.5 అంగుళాల 2K IPS స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 450 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. 18 గ్రాముల బరువు, 7.2mm థిక్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. డాల్బీ ఆట్మాస్ సపోర్టుతో క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుంది.

8340mAh బ్యాటరీ :
ఈ రియల్‌మి ప్యాడ్ 2.. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మి UI 4.0 పైన పనిచేస్తుంది. మరియు 6nm మీడియాటెక్ హీలియో G99 CPU చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు Arm Mail G57 GPU తో జతచేయబడి ఉంటుంది. 33W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 8360mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ ప్యాడ్ 2 వెనుకవైపు 8MP కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ రియల్‌మి ప్యాడ్ వైఫై 5 మరియు బ్లూటూత్ 5.2 సహా అనేక సెన్సార్లను కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్ గ్రీన్, ఇమేజినెషన్ గ్రీన్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 25 వరకు సేల్ ఆఫర్ల అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వైబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ప్రారంభ ఆఫర్ కింద రియల్‌మి సంస్థ ఈ ప్యాడ్‌పై రూ.2000 తగ్గింపు ధరను ప్రకటించింది. అదే realme.com వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపుతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1250 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ప్యాడ్ 2 వైఫై ధర రూ.14,749 గా ఉండనుంది.

రియల్‌మి బడ్స్ T110 స్పెసిఫికేషన్లు :
రియల్‌మి బడ్స్ T110 కాలింగ్ (Realme Buds T110 Sale) కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత (AI) ENC ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ మరియు 10mm డైనమిక్ డ్రైవర్లను కలిగి ఉంటుంది. IPx5 రేటింగ్‌తో బ్లూటూత్ 5.4 పైన పనిచేస్తుంది.
సింగిల్ ఛార్జింగ్ ద్వారా 38 గంటలపాటు బ్యాకప్‌ను కలిగి ఉంటుంది. మరియు కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ ద్వారా 2 గంటలపాటు వినియోగించుకోవచ్చు. మరియు కంట్రీ గ్రీన్, జాజ్ బ్లూ, పంక్ బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ రియల్‌మి బడ్స్ T110 ధర రూ.1499 గా ఉంది. సేల్‌లో భాగంగా రూ.200 తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications








