Home
Gadgets

రియల్‌మి ఎయిర్ ఐకానిక్ కవర్ కేస్ సేల్స్,రేపటి నుండే

రియల్‌మి సంస్థ నుండి వస్తున్న మొట్టమొదటి ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల యొక్క ఐకానిక్ కవర్ ధరల వివరాలను వెల్లడించింది. ఈ నెల మొదట్లో 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్‌తో పాటు క్లాసిక్ బ్లూ కలర్‌తో వస్తున్న ఇయర్‌బడ్‌ల కేసును కంపెనీ ప్రకటించింది.

ఇయర్‌బడ్స్

ఆ సమయంలో పవర్ బ్యాంక్ యొక్క ధర మరియు లభ్యత వివరాలను మాత్రమే కంపెనీ వెల్లడించింది. ఈ రెండు ఉత్పత్తులలో ఒకటైన రియల్‌మి ఇయర్‌బడ్స్ యొక్క ధర మరియు లభ్యత వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

ధరల వివరాలు

ధరల వివరాలు

రియల్‌మి బడ్స్ ఎయిర్ ఐకానిక్ కవర్ కేసు ఇండియాలో 399 రూపాయలకు లభిస్తుందని కంపెనీ ట్వీట్‌ ద్వారా పేర్కొంది. ఐకానిక్ కవర్ నలుపు, తెలుపు, పసుపు మరియు క్లాసిక్ బ్లూ కలర్ లలో వస్తుంది. రియల్‌మి బడ్స్ యొక్క ధర రూ.3999.

లభ్యత

లభ్యత

రియల్‌మి బడ్స్ జనవరి 28 నుండి రియల్‌మి యొక్క సొంత వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఐకానిక్ కవర్ కేసులు రియల్మే తనను ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ గా మార్చడానికి చేసిన ప్రయత్నం.

 

 

బడ్స్ ఐకానిక్ కవర్ కేసు డిజైన్

బడ్స్ ఐకానిక్ కవర్ కేసు డిజైన్

డిజైన్ పరంగా రియల్‌మి నుండి వచ్చిన ఐకానిక్ కవర్ పెంటాగ్రామ్ రూపొందించిన టైలర్-మేడ్ "R" లోగోను కలిగి ఉంది. ఈ ఐకానిక్ కేసు దీని యొక్క బడ్స్ ను సులభంగా క్యారీ చేసే ఆకారంతో సరిపోయేలా రూపొందించబడింది. అవి ఇంపాక్ట్ రెసిస్టెంట్ మరియు ఫాల్స్ మరియు స్లిప్-ఆఫ్స్ నుండి రక్షించబడతాయి. ఈ కేసు సున్నితమైన స్పర్శను కలిగి ఉండి మరియు మన్నికైన డివైస్ తో తయారు చేయబడి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది మెటల్ కారాబైనర్తో కూడా వస్తుంది, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను మనతో పాటుగా తీసుకెళ్లడం చాలా సులభం.

 

 

రియల్‌మి బడ్స్ ఎయిర్

రియల్‌మి బడ్స్ ఎయిర్

రియల్మే బడ్స్ ఎయిర్ ఐకానిక్ కవర్ ప్రాచుర్యం పొందిన ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఇప్పుడు రియల్మే ఆ డిజైన్‌ను అధికారికంగా దాని ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌కు తీసుకువస్తోంది. ఈ కేసు యొక్క ఉత్తమ భాగం వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వడం. రియల్మే బడ్స్ ఎయిర్ 3,999 రూపాయలకు లభిస్తుంది. ఇది సంస్థ నుండి వచ్చిన మొదటి టిడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్. ఇది ఒక ఛార్జింగ్ కేసుతో 17 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. దీనిని నాలుగు వేర్వేరు కలర్ లలో కొనుగోలు చేయడానికి వీలు ఉంది.

 

 

రియల్‌మి పవర్ బ్యాంక్

రియల్‌మి పవర్ బ్యాంక్

రియల్‌మి కంపెనీ ప్రారంభించిన రెండవ మొబైల్ యాక్సెసరీ రియల్‌మి పవర్ బ్యాంక్. ఇది 10,000WAh హై-డెన్సిటీ బ్యాటరీతో పాటు 18W టూ-వే క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. రియల్‌మి పవర్ బ్యాంక్‌లో డ్యూయల్ అవుట్‌పుట్‌తో యుఎస్‌బి టైప్-సి పోర్ట్ మరియు యుఎస్‌బి టైప్-ఎ పోర్ట్‌ను జోడించబడి ఉంది. డ్యూయల్ అవుట్పుట్ ద్వారా వినియోగదారులు తమ ల్యాప్‌టాప్ మరియు స్మార్ట్‌ఫోన్ రెండింటినీ ఒకే సమయంలో రియల్‌మి పవర్ బ్యాంక్‌తో ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది.

 

 

పవర్ బ్యాంక్

రియల్‌మి పవర్ బ్యాంక్ 12 పొరల సర్క్యూట్ రక్షణ వలయంతో వస్తుందని ప్రకటనలో తెలిపింది. అదనంగా రియల్‌మి పవర్ బ్యాంక్ మూడు వేర్వేరు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ పవర్ బ్యాంక్ ధర 1,299 రూపాయలు. ఆసక్తిగల కొనుగోలుదారులు రియల్‌మి.కామ్, ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది సెప్టెంబర్ చివరి నుండి అమ్మకాలు మొదలవుతాయి.

Best Mobiles in India

English summary
Realme's First Earbuds Air Iconic Cover will be available from January 28, 12:30PM
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X